Saturday, September 29, 2007

ఆస్కార్ లక్ష్యంగా నిర్మాణం జరుపుకుంటున్న కమల్ హాసన్ "దశావతారం" చిత్రం







ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్కార్ అవార్డు లక్ష్యంగా "దశావతారం" చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. గతంలో దక్షిణ భారత దేశం నుంచి తొలిసారిగా ఆస్కార్ అవార్డుకు నామినేషన్ పొందిన "స్వాతిముత్యం" హీరోపై మాకా నమ్మకం ఉందని నిర్మాత చెబుతుండటం గమనార్హం.
దక్షిణ భారత దేశంలోని సృజనాత్మక నటులలో ఒకరైన కమల హాసన్ నటిస్తున్న "దశావతారం" చిత్రం లోని సునామీ దృశ్యీకరణ ప్రేక్షకులకు విస్మయాన్ని కలిగించనుంది. పూర్తి స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలను జోడిస్తూ చిత్రిస్తున్న ఈ చిత్రంలో ఒక సందర్భంలో సునామీని సృష్టించారు. గత రెండు సంవత్సరాల క్రితం తమిళనాడులో వచ్చిన సునామీ వల్ల కొన్ని వందల కుటుంబాలు అనాదలయ్యాయి. కొన్ని వందల మంది సునామీలో కొట్టుకునిపోయి చనిపోయారు.కొన్ని వేల మంది ఉపాదిని కోల్పోయారు. ప్రకృతి సృష్టించిన ఈ వైపరీత్యం వల్లజరిగిన నష్టం ఊహకందనిది. ఇప్పటికీ కొన్ని కుటుంబాలవారు ఇంకా కోలుకోలేదంటే ఆ విపత్తు సామాన్యమైనదేమీ కాదు. అలాంటి సునామీని ప్రేక్షకులకు "దశావతారం" చిత్రంలో కల్లకు కట్టినట్లు చూయించనున్నారు. ఇందుకోసం భారీయెత్తున సాంకేతిక పరికరాలను, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లను చెన్నై తరలించి సునామీ దృష్యాల చిత్రీకరణగావించారు. ఇందులో కమల హాసన్ దశ అవతారాలలో కనిపించనున్నారు. అందులో సుమారు తొమ్మొది రకాల పాత్రలను సునామీ సందర్బంలో ఏక కాలంలో పోషించనున్నారు. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించడంతోబాటు, వచ్చే సంవత్సరం ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డులకు పంపడం తమ లక్ష్యంగా దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.

No comments: