Tuesday, September 25, 2007

పుత్రోత్సాహంతో అమెరికాకు ఫోన్లు చేస్తున్న చిరంజీవి







మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో పులకరించిపోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తనయుని చిత్రం "చిరుత" పైనే పూర్తి ధ్యాస పెట్టిన చిరంజీవి, ఈ చిత్ర ప్రివ్యూ చూసిందగ్గర్నుంచి ఒకటే ఆనందంతో పూరీ జగన్నాథ్ ను అభినందించడంతో బాటు, తనయుడిని మనస్పూర్తిగా కౌగిలించుకుని అభినందించినట్లు తెలిసింది.
చిత్రంలో రాం చరన్ నటన చాలా బావున్నట్లు తన అమెరికా మితృలకు ఫోన్ చేసిమరీ చిరంజీవి చెప్పడం చిత్ర పరిశ్రమలో ఆసక్తిని కలిగించింది. దానికి తోడు ధని ఏలె రూపొందించిన "చిరుత" పబ్లిసిటీ డిజైన్లు సహితం చిరంజీవిని ఆకట్టుకున్నట్లు తెలిసింది. హైదరాబాదుతో సహా ఇతర పట్టణాలలో, చెన్నై, బెంగులూరు నగరాలలో కూడా "చిరుత" పోస్టర్లు ప్రముఖంగా కనిపిస్తూండటం కూడా చిరంజీవిని సంతృప్తి పరచినట్లు తెలిసింది. ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని ఆయన అందరికీ ఫోన్లో చెబుతున్నారు.ప్రజలు కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తారని తాను నమ్ముతున్నట్లు ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం చిత్ర దర్శకునికి, నిర్మాతకు, ఇతర టెక్నీషియన్లకు ఆనందాన్ని కలిగిస్తోంది.

2 comments:

netizen నెటిజన్ said...

ఏ తండ్రి, ఏ సోదరుడు,తన వాళ్ళున్న సినిమా బాగోలేదని చెబుతాడు?

ఏ నిర్మాత అంటాడు?
అనక పోతే అశ్చర్యపడాలి కాని అంటే అబ్బురమేముంది?

Anonymous said...

adi sahajamekada! daniki intha raddantham enduku?