అఖండ పేరు ప్రఖ్యాతులు తీసుకు వచ్చిన "శివాజీ" చిత్రం తరువాత రజినీ కాంత్ నటించే కొత్త చిత్రంపై ఉన్న స్థంభన దాదాపు తొలిగిపోయింది. "శివాజీ" వల్ల వచ్చిన పేరును ఉపయోగించుకుంటూ అంతకు మించిన ప్రాజెక్ట్ లో నటించాలని ఇన్నాళ్ళూ భావిస్తున్న రజినీ కాంత్ తన తదుపరి చిత్ర భాధ్యతను ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు అప్పచెప్పాడు.
కథ ఖచ్చితంగా "నాయకన్", "దళపతి" చిత్రాల తరహాలో అంతకు మించిన కథా, కథనాలతో ఉండాలని చెప్పడంతో ఇన్నాళ్ళూ కథ రూపకల్పనపైనే దృష్టి సారించిన మణిరత్నం తయారు చేసిన కథ రజినీ కాంత్ కు నచ్చడంతో దానికి తుది మెరుగులు దిద్దమని చెప్పి దాదాపు తన తరువాతి చిత్రంపై ఉన్న ప్రతిష్టంభనను తొలగించారు. దాంతో తుది స్క్రిప్టును తయారు చేసేపనిలో దర్శకుడు, అతని టీం తలమునకలై ఉంది. మరో వైపు ఈ చిత్రంలో కథా నాయికగా నటించడం కోసం ఐశ్వర్యతో జరిపిన సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చాయని తెలిసింది. ఐశ్వర్య ఒప్పుకోకపోతే విద్యా బాలన్, లేదా అయేషా టకియాలలో ఎవరైనా ఒకరిని ఎన్నుకోవాలని దర్శకుని అబిప్రాయంగా ఉండేది. అయితే చివరికి ఐశ్వర్య వైపునుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిసింది. అధికారికంగా ఇంకా ప్రకటించని ఈ కొత్త చిత్రం కథ మరో రెండు నెలలలో పూర్తిగా సిద్దమవుతుందని, జనవరి,2008 నుంచి చిత్ర నిర్మాణం ప్రారంభిస్తారని తెలిసింది. సో రజినీ కాంత్ నుంచి మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆశించవచ్చు.
No comments:
Post a Comment