Wednesday, September 5, 2007

మళ్ళీ జన్మలో కుక్కగా పుడతాను..షారుఖ్ ఖాన్.మళ్ళీ జన్మంటూ ఉంటే మీకేమై పుట్టాలని ఉందని ఎవర్నైనా అదిగితే సహజంగా చాలామందికి ఏ సచిన్ గానో, లేక మరే షారుఖ్, అమీర్, హృతిక్, లేదా గాంధీ గానో మరో హిట్లర్ గానో పుట్టాలని ఉందని చెప్పడం సహజం. అయితే మన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ కాన్ రూటే వేరు. అంతేకాదు దియా మిర్జా, మందిరా బేడీ లదీ అదే దారి. అదేనండీ కుక్కై పుట్టడం.
కొందరికి పెంపుడు జంతువులంటే ప్రాణం. మన షారుఖ్ కు అది కొంచెం ఎక్కువ. ఇటీవల జరిగిన ఒక సర్వేలో షారుఖ్ ఖాన్ తనకు తన పెంపుడు కుక్క "చ్యూబెక్కా" లా పుట్టాలని ఉందన్నాడు.తన పెంపుడు కుక్క చ్యూబెక్కా అంటే షారుఖ్ కు చచ్చేంత ఇష్టం. దానిలా కడుపునిండా తింటూ, జల్సాగా తోక ఊపుతూ, ఏ టెన్షన్ లేకుండా గడిపెయ్యాలని ఉందన్నాడు. ఇతని దారిలోనే మరికొందరు బాలీవుడ్ భామలు వెల్లారు. ప్రముఖ మోడల్, సెక్సీ నటి దియా మిర్జా, క్రికెట్ యాంకర్ కం నటి మందిరా బేడీ లు కూడా తమకు "కుక్కగా" పుట్టాలని ఉందని చెప్పారు. సో జంతు ప్రేమా జోహార్.

No comments: