Friday, September 14, 2007

హీరోయిన్లు లేకుంటే ఆ సినిమా ఫెయిల్ కావల్సిందే-కమలినీ ముఖర్జీ.




ఎంతటి స్టార్లున్న చిత్రమయినా అందులో హీరోయిన్లు లేకుంటే ఆ చిత్రం పరాజయం పాలవుతుందని తెలుగు, తమిళ చిత్రాల కథానాయిక కమలినీ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. సినిమాల విజయానికి హీరోయిన్ల ప్రాధాన్యత చాలా వుంటుందని ఆమె అన్నారు.

ఇటీవల చెన్నైలో పత్రికలవారితో మాట్లాడుతూ,కమల్ హాసన్, తను, జ్యొతికలు ప్రముఖపాత్రలలో నటించిన "వేట్టైయ్యాడు విళైయాడు" చిత్రం, తెలుగులో డబ్ చేయబడి "రాఘవన్" పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించిందని, ఆచిత్రంలో తన నటనను అందరూ పొగుడుతున్నారని, తనకు లెక్కకు మించిన అభినందనలు వస్తున్నాయని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా చిత్ర విజయంలో తన పాత్ర చాలా కీలకమని, ఒక విధంగా కథానాయికలు చిత్ర విజయంలో ప్రముఖ పాత్ర వహిస్తారని ఆమె అన్నారు. ఇక ముందు, ముందు కూడా అభినయ ప్రాధాన్యమున్న పాత్రలను పోషిస్తానని, ఆ అభినయ ప్రాధాణ్యత అన్నిరకాల పాత్రలకు ఉంటుందని, అవసరమయితే శృంగార పాత్రల్లో కూడా నటించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

No comments: