Tuesday, September 4, 2007

భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు యంగ్ ఎన్.టి.ఆర్ -సల్మాన్ ఖాన్.



యంగ్ ఎన్.టి.ఆర్ అంటే తనకు అపారమైన ఇష్టమని బాలీవుడ్ క్రేజీ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. ఇటీవల జెమిని టి.వి. కోసం నటి రమ్యకృష్ణ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ టి.వి స్క్రీన్ పై ప్రత్యక్షమై యంగ్ ఎన్.టి.ఆర్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు.

యంగ్ ఎన్.టి.ఆర్ ను తను గత అయిదు సంవత్సరాలుగా గమనిస్తున్నానని, అతను నటించిన "ఆది", "సిం హాద్రి","యమదొంగ" చిత్రాలు తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఎన్.టి.ఆర్ ఇన్నోసెంట్ ఫేస్ బావుంటుందని, గతంలో కాస్త లావుగా వుండే ఎన్.టి.ఆర్ ఇప్పుడు సన్నబడి చాలాబాగా కనిపిస్తున్నాడని చెప్పారు. ఈ సందర్బంగా ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ లో అతని బాడీ అంటే తనకు ఇష్టమని చెప్పారు. అతని గుండె ధైర్యం కూడా తనకు బాగా నచ్చుతుందని చెప్పారు. ఈ సందర్బంగా సల్మాన్ ఖాన్ కు నచ్చిన "యమదొంగ" చిత్రంలోని ఓ డైలాగును ఎన్.టి.ఆర్ తిరిగి చెప్పి అందర్నీ ఆనందపరిచారు.

No comments: