Monday, September 24, 2007

ఒకే థియేటర్లో 890 రోజులు పూర్తి చేసుకుని కొత్త రికార్డు సృస్టించిన "చంద్రముఖి"







రజినీ కాంత్ నటించిన "చంద్రముఖి" చిత్రం 890 రోజులు ఒకే థియేటర్లో ప్రదర్శింపబడిన ఏకైక తమిళ చిత్రంగా భారతీయ చలన చిత్ర చరిత్రలో కొత్త రికార్డును సృస్టించింది. చెన్నయ్ లోని శాంతి థియేటర్లో ఇన్ని రోజులు ప్రదర్శింపబడిన ఈ చిత్రం గత శుక్రవారం నుంచి నిలిపివేయబడింది. అదే రోజునుంచి చెన్నైలోని మరోనాలుగు థియేటర్లలో మరో మారు ఈ చిత్రం విడుదలై మరో కొత్త రకార్డు వైపు అడుగులువేస్తోంది.

శివాజి ఫిలింస్ పతాకంపై దివంగత నటుడు శివాజీ గణేశన్ తనయుడు ప్రభు నిర్మాతగా, దర్శకుడు పి.వాసు దర్శకత్వలో నిర్మించిన ఈ చిత్రంలో రజినీ కాంత్,నయనతార, జ్యోతిక,ప్రభులు ప్రధాన పాత్రలు పోశించారు. "చంద్రముఖి" చిత్రం 14 ఏప్రిల్, 2005న విడుదలై ఏకబిగిన 890 రోజులు ఒకే థియేటర్లలో ప్రదర్శితమై, గతంలో ఒకే థియేటేలో 800 రోజులు ప్రదర్శించిన తమిళ చిత్రంగా "భాగవతార్" పేరుతో ఉన్న రికార్డును ఈ చిత్రం బద్దలుకొట్టి, కొత్త రికార్డును సృస్టించింది. కాగా 300రోజులు ఏకబిగిన నాలుగు థియేటర్లలో ప్రదర్శింపబడిన ఏకైక తమిళ చిత్రంగా ఈ చిత్రం తమిళ నాట మరో రికార్డును కూడా నెలకొల్పింది.

No comments: