Thursday, September 13, 2007

మహేశ్ బాబుకు తమిళ నాడులో పెరుగుతున్న డిమాండ్


యంగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తమిళ నాడులో డిమాండ్ పెరుగుతోంది.
మహేశ్ బాబు నటించిన "పోకిరి", "మురారి","సైనికుడు" తదితర చిత్రాలు తెలుగులో అక్కడ విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అలాగే మహేశ్ బాబు నటించిన అనేక చిత్రాలను తమిళ నాడు క్రేజీ స్టార్ విజయ్ తో రీమేక్ చసారు. అవికూడా అక్కడ మంచివిజయాన్ని సాధించాయి. ఇటీవలి "పోకిరి" అదే పేరుతో విజయ్ తో రీమేక్ చేయగా అది అక్కడ సంచలన విజయం సాధించి 200రోజులు ప్రదర్శింపబడింది. ఇక మహేశ్ బాబు నటించిన "అతడు"తో సహా మరికొన్ని చిత్రాలు తమైళం లో డబ్బింగ్ చిత్రాలుగా విడుదలై విజయాన్ని సాధించాయి. దాంతో తమిళ నిర్మాతల, దర్శకుల దృష్టి మహేశ్ బాబుపై పడింది.తమ చిత్రాలలో నటించాల్సిందిగా పలువురు అడుగుతున్నారు. గతంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన "యువ" చిత్రంలో నటించాల్సిందిగా మహేశ్ బాబును ఆయన అడగగా డేట్ల సమస్య వచ్చి ఆ చిత్రం లో మహేశ్ బాబు నటించలేదు.ఇప్పుడు కొత్తగా తమిళ దర్శకులు లింగుస్వామి, గౌతం మీనన్ లు మహేశ్ బాబును తమిళ చిత్రం కోసం అడిగినట్లు తెలిసింది. అయితే ఆ అవకాశాన్ని త్రోసిపుచ్చకుండా వేచిచూసే ధోరణిలో మహేశ్ బాబు ఎలాంటి సమాధానాన్ని ఇవ్వలేదని తెలిసింది. అయితే ప్రస్తుతం యు.టి.వి, వైజయంతి మూవీస్, సుమంత్ ఆర్ట్ క్రియేషన్స్ సహా ఆరు చిత్రాలు చేతిలో ఉండటం వల్ల తమిళ చిత్రాలను ఒప్పుకోవడం లేదని సమాచారం.

No comments: