Friday, September 28, 2007

చిరంజీవి ఇంటిముందు "చిరుత" టికెట్ కోసం చేయి కోసుకున్న అభిమాని


చిరంజీవి వారసుని తొలి చిత్రం తొలి మార్నింగ్ షోలోనే చూడాలనే అభిమానం చివరికి ఆ అభిమాని చేయి కోసుకుని స్పృహ తప్పేదాకావెళ్ళింది.

ఆంద్ర రాష్ట్రంలో "చిరుత" పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక చిరంజీవి అభిమానూలకు చిరు వారసుని ఆగమనం పండగ వాతావరణాన్ని సృస్టించింది. దాంతో చిరంజీవి తనయుని "చిరుత" ను తొలి రోజు, మార్నింగ్ షోలోనే చూడాలని అందరు అభిమానులు కోరుకోవడం సహజమే. అయితే "చిరుత" కు ఉన్న క్రేజీ దృష్ట్యా టికెట్లు ఎక్కడా దొరకని పరిస్తితి నెలకొంది. దాంతో ఓ అభిమాని ఎలాగయినా సినిమా టికెట్ సాధించడం కోసం గురువారం (నిన్న)ఏకంగా చిరంజీవి ఇంటికే వెళ్ళాడు. చిరంజీవి వైపునుంచి కనీసం ఒక టికెట్ అయినా దొరకక పోతుందా అనే ఆశ తో ఆ అభిమాని చిరంజీవి ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది. అయితే పూర్తి కోలాహలం మధ్యన ఆ అభిమానిని ఎవరూ పట్టించుకోలేదు. సెక్యూరిటీ వారు "అభిమానులు షరా మామూలే" అన్నట్లు ప్రవర్తించడంతో, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎదురు చూసిన ఆ అభిమాని, చివరికి తనజేబులోని బ్లేడ్ తో చేతిపై "చిరు" అని వ్రాసుకున్నాడు. దాంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. కొద్ది సేపట్లోనే ఆ అభిమాని రక్తం ఎక్కువగా పోవడం వల్ల స్పృహతప్పి పడిపోయాడు. అప్పుడు గమనించిన సెక్యూరిటీ వారు అతన్ని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. చిరంజీవిపై ఉండే అభిమానంతో రోజూ కొన్ని వందలమంది అభిమానులు వస్తూంటారని, అందర్నీ చిరంజీవిని కలవడానికి పంపడం సాధ్యం కాదని, కాని అతను ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడని తామెవరూ అనుకోలేదని తదనంతరం సెక్యూరిటీవారు చెబుతూడటం గమనార్హం. అయితే ఈ విషయం ఏ పత్రికలో కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా, అప్పటికే వెబ్ సైట్ లలో దర్శనమిచ్చేప్పటికి తెల్లబోవడం సెక్యూరిటీవారి వంతైంది. ఈ విషయమై చిరంజీవి మేనేజర్ సెక్యూరిటీ వారిని తీవ్రంగా మందలించి, ఇంకెప్పుడూ, అలా చేయవద్దని, ఎవరు వచ్చినా తనకు తెలియజేయవలసిందిగా చెప్పినట్లు తెలిసింది.

No comments: