Wednesday, September 26, 2007

స్వచ్చమైన "ముద్దు"లకూ జిందాబాద్.




























నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం.
ఎంతిష్టమంటే ఎంతిష్టమో చెప్పలేనంత ఇష్టం.

ఆ ఇష్టాన్ని ఎలా చెప్పాలో తెలీనంత ఇష్టం.

ఏ భాషలూ..భావనలకూ అందనంత ఇష్టం.

మరి ఆ ఇష్టాన్ని ఎలా చెప్పాలి... అదేగా ఇంతవరకూ ప్రపంచం కనుగొనంది..భవిష్యత్తులో కనుగొంటుందనే ఆశా లేనిదీ.మరి ఆ ఇష్టాన్ని చెప్పడానికి ఉన్న మరేదైనా దగ్గరి దారి..?

అసలు దారే లేనిదానికి దగ్గర దారి మరో దూరం దారి ఉంటాయా.. మన పిచ్చి గానీ...అయ్యో అప్పుడే అంత మాట అనకండి. ఎందుకంటే దారయితే ఉందో లేదో తెలీదు గానీ, మన ఇష్టాన్ని మన మనసైన వారికి తెలియజెప్పడానికి ఓ దారుంది. అదే ..."ముద్దు".

"ముద్దు" అని కొట్టిపడెయ్యకండి. ఆ ముద్దు ఎవరు ఎవరికి ఇచ్చేదయినా కావచ్చు. తల్లి తన తనయులకు లేదా తనయలకు ఇచ్చేదే కావచ్చు, లేదా భర్త తన భార్యకు ఇచ్చేదే కావచ్చు. ప్రియుడు తన ప్రియురాలికి ఇచ్చేదే కావచ్చు...ముద్దేదయినా దాని వెనుక ఉండే హృదయం ముఖ్యం. ఆ ముద్దు వెనక ఉండే భావం ముఖ్యం. దాని వెనక ఉండే స్వచ్చత ముఖ్యం. స్వచ్చమైన మనసుతో...స్వచ్చమైన భావంతో...స్వచ్చమైన హృదయంతో ఇచ్చే ముద్దు నిజంగా ఓ గొప్ప భావనే.ఒకరు ఒకరికి ఇచ్చే ముద్దు వారి మద్య ఆత్మీయానుబంధాలను పెంచేదిగా ఉంటే, ఆ ముద్దు వారి హృదయాలను గాయపరిచేది కాకుండా ఉండేది అయితే ముద్దు నిజంగా అమృత తుల్యమే.

విషయం ఏదైనా ప్రపంచ ముద్దుల దినోత్సవం సందర్భంగా స్వచ్చమైన "ముద్దు" లకూ జిందాబాద్.

శ్రీవెంకట్ బులెమోని

No comments: