Monday, September 3, 2007

చిరంజీవి మరియు నా కాంబినేషన్ లో చేసే సినిమాకు "కథ" మీదగ్గరుంటే అవకాశం నేనిస్తాను-నాగార్జున.


టాలీవుడ్ టెరాస్టార్ అక్కినేని నాగార్జున ప్రతిభకు పట్టం కట్టడంలో ముందుంటారు. కొత్త ఆలోచనలకు, ఆచరణలకు తానే ఆద్యుడవడానికికూడా సై అంటారు. ఇప్పుడు కొత్త ఆలోచనలు రేకెత్తించడానికి ముందుకొచ్చారు. తన మితృడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడమంటే తనకూ ఇష్టమేనని కాని కథలు దొరకడం లేదని ఆయన ఇటీవల చెప్పారు.
తనతోబాటు చిరంజీవికి కూడా మా ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా అయినా వస్తే బావుంటుందనే కోరిక ఉంది.ఈ విషయమై కొన్ని సంవత్సరాలుగా మేము అనుకుంటున్నాం. కాని ఇంతవరకు ఎవరూ మా ఇద్దరికీ సరిపొయ్యే కథతో మమ్మల్ని సంప్రదించలేదు. ఈ విశయమై ఏ రచయితా, దర్శకుడూ దృష్టి పెట్టనప్పుడు మా కాంబినేషన్ లో ఓ చిత్రం వచ్చే అవకాశమే లేదని అన్నారు. కొత్త, పాత అని కాకుండా ఎవరైనా మా ఇద్దరికీ ఉపయోగపడే కథతో వస్తే సినిమా నిర్మించడానికి తను సిద్దంగా ఉన్నానని, ఇక రచయితలు, దర్శకులదే ఆలస్యమని ఆయన అన్నారు.సో రచయితలూ లెట్ అస్ రెడీ....!.

No comments: