నటకిషోరం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం "ఒక్కమగాడు" కు ఆడియో, శాటిలైట్ హక్కుల కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయి. దర్శక,నిర్మాత వై.వి.యస్.చౌదరి తన స్వంత "బొమ్మరిల్లు" పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం పై అన్ని విభాగాలలో భారీ అంచనాలే ఉన్నాయి.
ముఖ్యంగా వై.వి.యస్.చౌదరి పాటలకు మంచి క్రేజీ ఉంటుంది. పాటల చిత్రీకరణలో, సాహిత్యం పొందుపరచుకోవడం లో చౌదరి విభిన్న బాణీని అనుసరిస్తాడు. దాంతో గత చిత్రాలు కూడా ఆడియో పరంగా మంచి విజయాన్ని సాధించాయి. అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ, వై.వి.యస్ ల కలయిక కావడం తో సహజంగానే అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం అన్ని ఆడియో కంపనీలు ఈ చిత్రంపై రెండు కోట్లదాకా పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూయిస్తున్నాయని తెలిసింది. ఇక శాటిలైట్ హక్కులకోసం ప్రముఖ స్థానంలో ఉన్న రెండు ఛానెళ్ళు "రెండు పేటీ" ల ఫ్యాన్సీ ఆఫర్ ను ఇచ్చాయని తెలిసింది. సహజంగా శాట్లైట్ హక్కులకు 1.5 కోట్ల నుంచి 1.75 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి శాటిలైట్ కంపనీలు ముందుకు వస్తాయి. కానీ ఇప్పుడు బాకకృష్ణ చిత్రానికి "రెండు పేటీల(రెండు కోట్ల)" ఆఫర్ అటు ఆడియో హక్కుల పరంగా, ఇటు శాటిలైట్ హక్కుల పరంగా రావడం తో దర్శకనిర్మాత వై.వి.యస్ సంతోశంగా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ చిత్రం అక్టోబర్ చివరిదాకా షూటింగ్ లోనే ఉంటుంది. బాలకృష్ణ సంక్రాంతి చిత్రాల విజయాల సెంటిమెంట్ లో భాగంగా ఈ చిత్రాన్ని జనవరిలో మాత్రమే విడుదలచేసే ఆలోచనలో చౌదరి ఉన్నట్లు తెలిసింది.
No comments:
Post a Comment