తన తాతగారు (స్వర్గీయ నందమూరి తారకరామారావు) నటించిన అపురూప చిత్రం "దాన వీర సూర కర్ణ" లో నటించాలని ఉంది, తప్పకుండా ఈ చిత్రంలో నటించి ఆంధ్ర ప్రేక్షకులను మెప్పిస్తాననే నమ్మకం కూడా నాకు కలిగిందని యంగ్ ఎన్.టి.ఆర్ అంటున్నట్లు వినికిడి.
ఇటీవల "చంద్రముఖి" దర్శకుడు పి.వాసు యంగ్ ఎన్.టి.ఆర్ ను కలిసి "యుగందర్" చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన ఉందని, అందులో నటించాల్సిందిగా ఎన్.టి.ఆర్ ను కోరగా ఆయన పై విధంగా స్పందించినట్లు తెలిసింది. గతంలో అమితాబ్ బచ్చన్ నటించిన "డాన్" హిందీ చిత్రాన్ని సీనియర్ ఎన్.టి.ఆర్ తో "యుగంధర్" పేరుతో నిర్మించగా, అది సంచలన విజయం సాధించింది. అయితే ఆ చిత్రం పట్ల తనకు అంత మక్కువ లేదని, తనకు "దాన వీర సూర కర్ణ" లో నటించాలని ఉందని తెలిపాడని తెలిసింది. దీనికి వాసు కూడా "అది మంచి ఆలోచనే" అని సమర్ధించినట్లు టాలీవుడ్ రిపోర్ట్. అయితే వాసు దర్శకత్వంలో యంగ్ ఎన్."దాన వీర సూర కర్ణ" రీమక్ లో నటిస్తాను : యంగ్ ఎన్.టి.ఆర్. "దాన వీర సూర కర్ణ" చిత్రంలో నటించడం ఖాయమేనని మాత్రం అనుకోకండి. ఈ చిత్ర దర్శకత్వ భాధ్యతలను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు గానీ, లేక ఆయన శిష్యుడైన రాజమౌలి గానీ వహిస్తే బావుంటుందని ఎన్.టి.ఆర్ మనోగతంగా ఫిలిం నగర్ ముచ్చట. ఏదేమైనా, "దాన వీర సూర కర్ణ" చిత్రాన్ని తనే నిర్మిస్తూ, నటించడానికి ఎన్.టి.ఆర్ ఉత్సుకత చూయిస్తున్నాడని మరో కథనం. కథనాలు ఏవైనా అలనాటి ఆణిముత్యం "దాన వీర సూర కర్ణ" రీమేక్ అవడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.
No comments:
Post a Comment