Friday, October 19, 2007

శిరీశ్ భరద్వాజ్ తండ్రి ఇంటర్వ్యూ


చిరంజీవి చిన్న కూతురు శ్రీజను రహస్యంగా పెళ్ళి చేసుకున్న శిరీశ్ భరద్వాజ్ తండ్రి వెంకట రమణ మూర్తి మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. మీడియా వారితో మాట్లాడుతూ మెగాస్టార్ కు మనకు వియ్యం అందని ద్రాక్ష అవుతుంది, కనుక ఈ పెళ్ళి ప్రస్తావన తీసుకురావద్దని మూడునెలల ముందే హెచ్చరించానని చెప్పుకొచ్చాడు. అతని ఇంటర్వ్యూ వివరాలు.

ప్రశ్న: మీ కుమారుడు శిరీశ్ భరద్వాజ్ వివాహం చేసుకున్న విషయం ఎప్పుడు తెలిసింది?
జవాబు:మొన్న సాయంత్రం 2.30 నిమిషాలకు నా స్నేహితుడు ఒకరు నాకు ఫోన్ చేసి చెప్పాడు.
ప్రశ్న: మీ కుమారుడు చిరంజీవి కూతురిని ప్రేమిస్తున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? దానికి మీరు ఎలా స్పందించారు?
జవాబు: మూడు నెలల క్రితం నాకు తెలిసింది. అప్పుడే వాడిని కోప్పడి చిరంజీవితో వియ్యం మనకు సాధ్యం కాదని, ఆ అలోచనను మానుకోమని సూచించాను. గట్టిగానే కోప్పడి మరీ చెప్పాను. కాని వాడు మా మాటలను వినలేదు.
ప్రశ్న: వివాహం తర్వాత మీ కుమారునితో మీరు మాట్లాడారా? ఇప్పుడు వారు ఎక్కడ వుందీ మీకు తెలుసా?
జవాబు: లేదు ఇంతవరకూ నేను వాడితో మాట్లాడ లేదు. అలాగే వారు ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియదు.
ప్రశ్న: పెళ్ళి విషయం తెలియగానే మీరు ఎక్కడికి వెళ్ళారు?
జవాబు: వెంటనే మేము మా వూరికి వెళ్ళాము. చిరంజీవి అభిమానులకు తెలిస్తే జరిగే పరిణామాలు ఎలా వుంటాయో ఊహిస్తేనే భయం వేసి అలా వెళ్ళిపోయాము.
ప్రశ్న: మీకు సెక్యూరిటీ కావాలని మీరు భావిస్తున్నారా?
జవాబు: అవును మా జీవితాలను కాపాడుకోవాలంటే మాకు ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలి. లేదంటే చిరంజీవి అభిమానులు ఏం చేస్తారో ఊహించలేకుండా ఉన్నాము.
ప్రశ్న: ఎం ఎల్ ఎ పి జనాఎధన్ రెడ్డికి మీకు భంధుత్వం వుందని తెలిసింది. ఈ పెళ్ళి విషయంలో అతని సహకారం ఉందా?
జవాబు: పి జనార్ధన్ రెడ్డి గారు నా భార్య వైపు నుంచి దూరపు బంధువులు అవుతారు. ఆయన ఇలాంటి సంఘటనలను ఎప్పుడూ ప్రోత్సహించడు.
ప్రశ్న: మీ కొడుకుపై గతంలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసు ఉందనే విషయం మీకు గుర్తుకు ఉందా?
జవాబు: ఉంది. అప్పుడెప్పుడో 2001 లోనో, లేక 2002లోనో ఒక కేసు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంది. అయితే అది జరిగి చాలా సంవత్సరాలే అవుతోంది. అది మూత బడిన కేసు.
ప్రశ్న: చిరంజీవి కూతురు శ్రీజ ఎప్పుడైనా మీ యింటికి వచ్చిందా?
జవాబు: లేదు. ఒక వేల వస్తే ఆమె చిరంజీవి కూతురని తెలుకున్న అభిమానులు వారి అభిమానాన్ని చూయించి ఎప్పుడో ఈ విషయం పత్రికలలో వచ్చేది.
ప్రశ్న: ఇక ముందు ఏం చేయబోతున్నారు?
జవాబు: ప్రస్తుతానికి ఏదీ ఆలోచించలేదు. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటాను.

1 comment:

Anonymous said...

so thanks this is so nice.