
చలన చిత్ర నిర్మాణం, డిస్త్రిబ్యూషన్ లలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ సంస్థ ఈ దీపావళి పర్వదినం సందర్భంగా ఒకేసారి మూడు పెద్ద చిత్రాలను విడుదల చేస్తూ రికార్డు సృష్టించించనుంది. దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన "ఓం శాంతి ఓం" చిత్రాన్ని, తమిళ నాడులో యంగ్ హీరోలలో ప్రత్యేకమైన గుర్తింపుతోబాటు, మాచిత్రాలలో కలెషన్ల కింగ్ గా పేర్గాంచిన నటుడు విజయ్ నటించిన "అళగియ తమిళ మగన్" చిత్రాన్ని, ఇంకా నటుడు అజిత్ నటించిన "డాన్" తమిళ రీమేక్ "బిల్లా-2007" చిత్రాన్ని ఏక కాలంలో
తమిళనాట విడుదల చేస్తోంది. ఇది తమిళ నాట పెద్ద రికార్డు. ఏ సంస్థా ఏక కాలంలో మూడు పెద్ద చిత్రాలను ఒకేసారి తమిళనాడులో విడుదల చేయలేదు. ఇప్పుడు పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ మూడు చిత్రాలను విడుదలచేస్తోంది. ఈ పెద్ద చిత్రాలు మాత్రమే కాకుండా మరో మూడు చిన్న బడ్జెట్ చిత్రాలను కూడా సంస్థ ఈ దీపావళికి విడుదలచే
స్తోంది.


No comments:
Post a Comment