Saturday, October 13, 2007
విదేశాలలో "గెట్ టుగెదర్"ల పేరిట సినీ తారల కొత్త వ్యాపారం
ఈ మధ్యన ప్రతి విషయం కమర్షియల్ అయిపోయింది. ఇక సినీ తారలు మరీ దిగజారి పోయారనిపిస్తోంది. చివరికి తమను అభిమానించే అభిమానులనుంచి కూడా ఎంతో కొంత రాబట్టుకునే కొత్త ఆలోచనలకు కూడా ఈ మధ్యే తెరలేచింది. కాకపోతే అది జరుగుతోంది ఇక్కడ కాదు, విదేశాలలో. చాలామంది సినీ తారలు తమ షూటింగ్ ల కోసం విదేశాలకు వెళ్ళడం పరిపాటి. అక్కడ ఉన్న తెలుగు వారు తమ అభిమాన తారలు ఎప్పుడైనా తామున్న ప్రాంతానికి వస్తే, వారిని చూడాలని, పలకరించాలని అనుకోవడం పరిపాటి. ఈ తతంగాన్ని బాగా గమనించిన కొందరు, ఈ అభిమానానికి కూడా వెలకట్టడం ప్రారంభించారు. షూటింగ్ ల కోసం వచ్చిన తారలతో మీటింగ్, గెట్ టుగెదర్, స్పెషల్ పార్టీ, నైట్ విత్ స్టార్...ఇలా కొత్త కొత్త పేర్లతో ఈ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. దాదాపు ప్రతి చిత్రానికి సంబంధించీ ఎంతో కొంత షూటింగ్ ను విదేశాలలో నిర్వహించడం పరిపాటి అయిన ఈ రోజులలో ఈ కొత్త వ్యాపారం మూడు నైట్ పార్టీలూ, ఆరు గెట్ టుగెదర్ లుగా వర్ధిల్లుతోందని తెలిసింది. ఈ కొత్త వ్యాపారం నిర్వహించే వారు కొన్ని సంస్థలుగా ఏర్పడి, ముందుగానే విదేశాలకు వచ్చే తారల వివరాలు తెలుసుకుని వారితో సంప్రదించి, వారిని ఈ పార్టీలకు ఒప్పిస్తుండగా, మరికొందరు తారలు ముందుగానే ఇలాంటి గెట్ టుగెదర్ లు కొన్నయినా తాము విదేశాలలో ఉన్నప్పుడు ఏర్పాటు చేయాలని సదరు నిర్వాహకులకు ముందుగానే తెలియజేస్తుండటం జరుగుతోందని తెలిసింది. ఈ పార్టీల వల్ల వచ్చిన డాలర్లను ఇరు పక్షాలూ పంచుకోవడడం కొసమెరుపు. ఇక కొందరు తారలు తమ గెట్ టుగెదర్ లకు కొత రేటు నిర్నయించి, దానిని నిర్వాహకులనుంచి వసూలు చేసుకుంటున్నట్లు తెలిసింది.దాదాపు అందరు తారలూ ఇలా పార్టీలకు హాజరవుతున్నట్లు తెలిసింది. కొద్ది మంది పెద్ద తారలు మాత్రం వీటినుంచి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. చూస్తుంటే అభిమానం పెంచుకున్నందుకు కూడా, ఇకపై ఫీజు చెల్లించమంటారేమో ఈ సినీ తారలు...?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment