Saturday, September 29, 2007

స్వర్గీయ ఎన్.టి.ఆర్ ను ఎండలో నిలబెట్టిన హీరో




స్వర్గీయ ఎన్.టి.ఆర్ తెలుగు వారి ఆరాధ్య నటునిగా ప్రజలచేత నీరాజనాలు అందుకున్నారు. సినీ పరిశ్రమ మొత్తం ఆయనకు అగ్ర హీరోగా ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. అయితే అలాంటి ఎన్.టి.ఆర్ ను సహితం ఎండలో నిలబెట్టిన హీరో అలనాటి మేటి హీరో సి.హెచ్.నారాయణ రావు.


ఎన్.టి.ఆర్ సినీపరిశ్రమలోకి వచ్చేముందు కొన్ని రోజుల క్రితం అప్పటి నంబర్ వన్ హీరో సి.హెచ్.నారాయణ రావును ఒకసారి చూద్దామని ఆయన షూటింగ్ జరుగుతున్న వాహిని స్టూడియోకు వెళ్ళాడు. లోపల మేకప్ రూంలో మేకప్ చేసుకుంటున్న సి.హెచ్.నారాయణ రావును తాను కలవాలనుకుంటున్నటు గేట్ దగ్గరున్న వాచ్ మెన్ కు చెప్పి పంపించాడు ఎన్ టి ఆర్. అది విన్న నారాయణ రావు "తను, ఎందుకు వచ్చాడో తెలుసుకొమ్మని" తిరిగి వాచ్ మెన్ కు పురమాయించాడు. అప్పుడు "తాను, సినిమాలలో నటించడానికి మద్రాసు వచ్చాననీ, నారాయణ రావు సినిమాలను చాలాసార్లు చూసాననీ, ఆయనపై ఉన్న గౌరవంతో ఒకసారి చూడడానికి వచ్చాననీ" చెప్పాడు. అది విన్న నారాయణ రావు నాకిప్పుడు పని ఉంది, నన్ను చూడాలనుకుంటే ఓ రెండు, మూడు గంటలు బయటే వేచిఉండాల్సి వస్తుందని వాచ్ మెన్ తో చెప్పి పంపించాడు. అది విన్న ఎన్ టి ఆర్ కాసేపు ఆలోచించి నారాయణ రావు బయటికి వచ్చేదాకా ఎండలోనే వేచి యున్నాడు. రెండు, మూడు గంటలనుకుంటే అది కాస్తా ఐదు గంటలైన తర్వాత బయటికి వచ్చిన నారాయణ రావు ఎన్ టి ఆర్ ను పలకరించి, సినీ పరిశ్రమలో ఇదంతా మామూలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే నారాయణ రావు వెనకబడడం, ఎన్ టి ఆర్ నంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత నారాయణ రావుకు వేషాలే కరువయ్యే పరిస్తితి వచ్చింది. అటువంటప్పుడు ఎన్ టి ఆర్ తనకు తెలిసిన నిర్మాతల చిత్రాలలో ఆయనకు వేశాలు ఇప్పించేవాడని, ఆ తర్వాత ఒకసారి తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో నారాయణ రావే స్వయంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సినీ పరిశ్రమలో చాలామంది తనను ఎన్ టి ఆర్ ను ఎండలో నిలబెట్టిన హీరో అని అంటుండేవారని, అది తెలిసిన ఎన్ టి ఆర్, నారాయణ రావుతో "ఇవన్నీ సినీ పరిశ్రమలో సాధారణం, పట్టించుకోకండి..." అన్నారనీ మరోమారు నారాయణ రావే గుర్తుచేసుకున్నారు.

నయనతార గ్లామర్ గ్యాలరీ













బాలీవుడ్ వైపు "చిరుత" చూపు


చిరంజీవి తనయుడు రాం చరన్ చూపు బాలీవుడ్ పై బడిందని తెలిసింది. "చిరుత" చిత్రం విడుదల సందర్బంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో జరిగిన ప్రివ్యూ షోలో రాం చరన్ తన మనసులోని మాటను "CNN-IBN " విలేఖరితో పంచుకున్నారు. ఈ సందర్బంగా " CNN-IBN" విలేఖరి శ్వేతల్ కంప్లపూర్కర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా "తన తొలి ప్రాధాన్యత తెలుగుకే, అయితే మంచి కథ వస్తే మాత్రం బాలీవుడ్ లో నటిస్తాను. అటువైపునుంచి, ఇప్పటికే కొందరు దర్శకులు తనను సంప్రదించడం జరిగిందని, అయితే కథ నచ్చక వాటిని ఒప్పుకోలేదని అన్నారు. అలాగే తెలుగులో తన ద్వితీయ చిత్రానికి రాం దర్శకుడని, దీనిని తన మావయ్య అల్లు అరవింద్ నిర్మిస్తారని" తెలిపాడు.

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అభినందనలు పొందిన విశాల్ "భయ్యా"











యువ నటుడు విశాల్ నటించిన ద్విభాషా చిత్రం "భయ్యా" తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అభినందనలు పొందింది. నిన్ననే (శుక్రవారం) తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం తమిళ వర్షన్ "మలైకోట్టై" ని ముఖ్యమంత్రి కరుణానిధి ప్రత్యేకంగా చూసారు. చిత్రీకరణ పద్దతులు, సాంకేతికత, ముఖ్యంగా విశాల్ నటన చాలాబావున్నాయని, నటుడు విశాల్ కు సినీ పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉందని ఆయన అభినందించారు. తెలుగులో కూడా ఈ వారమే ఈ చిత్రం విడుదల కావలసి ఉన్నా, చిరంజీవి తనయుని "చిరుత" విడుదల ఉండటం వల్ల దీనిని వచ్చే వారానికి వాయిదా వేశారు.

"వనజ" హైదరాబాద్ ఎప్పుడొస్తుంది..?







_"ఏందో ఈ జీవితం. నాజీవితాన్ని నాదిగా బతుకనీరు ఓ ఆశా పడనీరు ఓ కోరికా తీరనీరు. నేనేమైనా యిమాన మెక్కుతానన్నానా లేక అమెరికా చూపమన్నానా, కొద్దిగా డ్యాన్సేగా నేను నేర్చుకుంటానంతోంది..."_ అనుకుంటూ తనలో తనే నలిగిపోతూ తన హృద్యమైన భావాలను, భావనలను అంతర్జాతీయ ప్రేక్షకలోకంలో పంచుకున్న "వనజ" సొంత ఊరు హైదరాబాద్ కు ఎప్పుడొస్తుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న?. పద్నాలుగేళ్ళ ప్రాయంలోని వనజ లేలేత స్వప్నాలకు నిర్దయపూరితమైన వాస్థవ ప్రపంచం, కులం కుళ్ళూ,అమ్మాయనే లైంగిక వివక్షా ఆ పసి హృదయంపై చూపిన ప్రభావాన్ని ప్రభొదాత్మకంగా చిత్రించిన హైదరబాదీ దర్శకుడు రజినీశ్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా అనేక వేదికలలో ప్రదర్శించి అవార్డులనూ, ప్రేక్శకుల రివార్డులనూ అందుకున్నా, స్వంత ప్రాంతంలో స్వంతవారి మద్యన ఈ చిత్రాన్ని ప్రదర్శించలేదనే విశయాన్ని గమనించి అందుకుతగ్గ ప్రయత్నాలు చేస్తే బావుంటుంది. తన దర్శకత్వ ప్రతిభతో అద్భుత చిత్రాన్ని రూపొందించిన తను ఇక ముందు కూడా విలువలకు తిలోదకాలివ్వకుండా మంచి చిత్రాలను రూపొందించాలని ఆశిస్తున్నాము.

ఆస్కార్ లక్ష్యంగా నిర్మాణం జరుపుకుంటున్న కమల్ హాసన్ "దశావతారం" చిత్రం







ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్కార్ అవార్డు లక్ష్యంగా "దశావతారం" చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. గతంలో దక్షిణ భారత దేశం నుంచి తొలిసారిగా ఆస్కార్ అవార్డుకు నామినేషన్ పొందిన "స్వాతిముత్యం" హీరోపై మాకా నమ్మకం ఉందని నిర్మాత చెబుతుండటం గమనార్హం.
దక్షిణ భారత దేశంలోని సృజనాత్మక నటులలో ఒకరైన కమల హాసన్ నటిస్తున్న "దశావతారం" చిత్రం లోని సునామీ దృశ్యీకరణ ప్రేక్షకులకు విస్మయాన్ని కలిగించనుంది. పూర్తి స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలను జోడిస్తూ చిత్రిస్తున్న ఈ చిత్రంలో ఒక సందర్భంలో సునామీని సృష్టించారు. గత రెండు సంవత్సరాల క్రితం తమిళనాడులో వచ్చిన సునామీ వల్ల కొన్ని వందల కుటుంబాలు అనాదలయ్యాయి. కొన్ని వందల మంది సునామీలో కొట్టుకునిపోయి చనిపోయారు.కొన్ని వేల మంది ఉపాదిని కోల్పోయారు. ప్రకృతి సృష్టించిన ఈ వైపరీత్యం వల్లజరిగిన నష్టం ఊహకందనిది. ఇప్పటికీ కొన్ని కుటుంబాలవారు ఇంకా కోలుకోలేదంటే ఆ విపత్తు సామాన్యమైనదేమీ కాదు. అలాంటి సునామీని ప్రేక్షకులకు "దశావతారం" చిత్రంలో కల్లకు కట్టినట్లు చూయించనున్నారు. ఇందుకోసం భారీయెత్తున సాంకేతిక పరికరాలను, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లను చెన్నై తరలించి సునామీ దృష్యాల చిత్రీకరణగావించారు. ఇందులో కమల హాసన్ దశ అవతారాలలో కనిపించనున్నారు. అందులో సుమారు తొమ్మొది రకాల పాత్రలను సునామీ సందర్బంలో ఏక కాలంలో పోషించనున్నారు. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించడంతోబాటు, వచ్చే సంవత్సరం ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డులకు పంపడం తమ లక్ష్యంగా దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.

గ్లామరే నా ఆయుధం,నెంబర్ వన్ నా లక్ష్యం-"కంత్రి" హీరోయిన్ హాన్సికా మోత్వాని




ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లోకి అడుగు పెడుతూనే "నంబర్ వన్ నా లక్ష్యమని" "కంత్రి" హీరోయిన్ హాన్సికా మోత్వాని ప్రకటించేసింది.

నా మనసు నిండా ఆత్మ విశ్వాసం మెండుగా ఉండి. గ్లామర్ అనే ఆయుధం నా చేతిలో ఉంది. ఇక విజయమే మిగిలి ఉంది, అని ఆత్మ విశ్వాసంతో ప్రకటిస్తున్న ఈ చిన్నది "ఎన్.టి.ఆర్ "కంత్రీ" చిత్రంపై పెద్ద ఆశలే పెట్టుకుంది. మరో రెండు పెద్ద కంపనీలలో, యువ నటులతో నటిస్తున్న హాన్సిక "చేతిలోని మూడు తెలుగు ప్రాజెక్టులూ, సక్సెస్ నిచ్చేవేనని" ముంబై సన్నిహితులతో ఘంటాపదంగా సెలవిస్తోంది.తాను అతి త్వరలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటానని కూడా చెబుతున్నట్లు ముంబై పత్రికలలో మసాలా వార్తలు వస్తున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ హాన్సికా.

గ్లామర్ హీరోయిన్ నమిత పోటో గ్యాలరీ











Friday, September 28, 2007

జాతీయ జెండాను కించపరచినందుకు అమీర్ ఖాన్ కు అరెస్ట్ వారెంట్




బాలీవుడ్ కథానాయకులు ఒక్కరొక్కరుగా జైలుకువెలుతున్నారు.గతంలో నటులు సంజయ్ దత్, ఆతర్వాత సల్మాన్ ఖాన్ లు జైలుకు వెళ్ళి వచ్చారు. ఇప్పుడు అమీర్ ఖాన్ వంతైంది.


ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్స్ షోరూం ఓపెనింగ్ కు అమీర్ ఖాన్ ముఖ్య అథిధిగా వచ్చారు. అప్పుడు ఆ షోరూం పైభాగంలో 11 జాతీయ జెండాలను ఎగురవేశారు. నిబంధనల ప్రకారం జాతీయ జెండాను సూర్యాస్తమయం తరువాత ఎగురవేస్తే దాన్ని జాతీయ జెండాను కించపరచబడినట్లుగా భావించి, అందుకు భాద్యులైన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు కార్యక్రమం పూర్తయినా జెండాలను నిభందనల ప్రకారం క్రిందికి దించలేదు. ఈ విషయం కార్ల షోరూం యజమానుల దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత రాత్రి సమయంలో హడావిడిగా వాటిని క్రిందికిదించారు. అయితే సదరు కార్ల షోరూం యజమానులైన అశోక్, రాజేశ్ రాజ్పాల్ లు, ఆ కార్యక్రమానికి ముఖ్య అథిధిగా వచ్చిన నటుడు అమీర్ ఖాన్ లు ఈ విషయాన్ని పట్టించుకోలేదని, ఇది ఉద్దేష్యపూర్వకంగా చేసిన చర్యగా భావించి ఈ ముగ్గురిపై చర్య తీసుకోవలసిందిగా కోరుతూ స్థానిక న్యాయవాది శైలేంద్ర శర్మ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన న్యాయాధికారి ఆ ముగ్గురికి బెయిలుతో కూడిన అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మలి విచారణ అక్టోబర్ 12వ తేదీన జరుగుతుంది.

స్వీయ దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రాన్ని పునర్నిర్మించనున్న బాలకృష్ణ







స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన ఆణిముత్యం "నర్తనశాల" చిత్రాన్ని పునర్నిర్మించాలన్న బాలకృష్ణ కోరిక తీరకుండా గతంలో అది మద్యలోనే ఆగిపోయింది. "నర్తనశాల" చిత్రాన్ని తాను అర్జునుడుగా, బృహన్నలగా ద్విపాత్రాభినయం చేస్తూ, తన దర్శకత్వంలోనే నిర్మించాలన్నది బాలకృష్ణ కోరిక.
దానికి తగ్గట్లుగానే గతంలో ఈ చిత్రాన్ని ప్రారంభంచారు కూడా.అప్పట్లో సౌందర్యను ద్రౌపదిగా, తాను అర్జునిగా కొంత షూటింగ్ కూడా జరిగిన తర్వాత, అనుకోని అవాంతరాలవల్ల ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఈ చిత్రాన్ని తప్పకుండా నిర్మించాలని కోరుకుంటున్న బాలకృష్ణ, వచ్చే సంవత్సరం ద్వితీయార్దంలో దీనికి ముహూర్తం పెట్టినట్లు తెలిసింది. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నిర్మించే "రంగా-పాండురంగా" చిత్రం పూర్తయిన తర్వాత ఈ "నర్తనశాల" ను ప్రారంభిస్తానని ఆయన తన కుటుంబీకులకు, స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది.

చిరంజీవి ఇంటిముందు "చిరుత" టికెట్ కోసం చేయి కోసుకున్న అభిమాని


చిరంజీవి వారసుని తొలి చిత్రం తొలి మార్నింగ్ షోలోనే చూడాలనే అభిమానం చివరికి ఆ అభిమాని చేయి కోసుకుని స్పృహ తప్పేదాకావెళ్ళింది.

ఆంద్ర రాష్ట్రంలో "చిరుత" పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక చిరంజీవి అభిమానూలకు చిరు వారసుని ఆగమనం పండగ వాతావరణాన్ని సృస్టించింది. దాంతో చిరంజీవి తనయుని "చిరుత" ను తొలి రోజు, మార్నింగ్ షోలోనే చూడాలని అందరు అభిమానులు కోరుకోవడం సహజమే. అయితే "చిరుత" కు ఉన్న క్రేజీ దృష్ట్యా టికెట్లు ఎక్కడా దొరకని పరిస్తితి నెలకొంది. దాంతో ఓ అభిమాని ఎలాగయినా సినిమా టికెట్ సాధించడం కోసం గురువారం (నిన్న)ఏకంగా చిరంజీవి ఇంటికే వెళ్ళాడు. చిరంజీవి వైపునుంచి కనీసం ఒక టికెట్ అయినా దొరకక పోతుందా అనే ఆశ తో ఆ అభిమాని చిరంజీవి ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది. అయితే పూర్తి కోలాహలం మధ్యన ఆ అభిమానిని ఎవరూ పట్టించుకోలేదు. సెక్యూరిటీ వారు "అభిమానులు షరా మామూలే" అన్నట్లు ప్రవర్తించడంతో, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎదురు చూసిన ఆ అభిమాని, చివరికి తనజేబులోని బ్లేడ్ తో చేతిపై "చిరు" అని వ్రాసుకున్నాడు. దాంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. కొద్ది సేపట్లోనే ఆ అభిమాని రక్తం ఎక్కువగా పోవడం వల్ల స్పృహతప్పి పడిపోయాడు. అప్పుడు గమనించిన సెక్యూరిటీ వారు అతన్ని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. చిరంజీవిపై ఉండే అభిమానంతో రోజూ కొన్ని వందలమంది అభిమానులు వస్తూంటారని, అందర్నీ చిరంజీవిని కలవడానికి పంపడం సాధ్యం కాదని, కాని అతను ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడని తామెవరూ అనుకోలేదని తదనంతరం సెక్యూరిటీవారు చెబుతూడటం గమనార్హం. అయితే ఈ విషయం ఏ పత్రికలో కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా, అప్పటికే వెబ్ సైట్ లలో దర్శనమిచ్చేప్పటికి తెల్లబోవడం సెక్యూరిటీవారి వంతైంది. ఈ విషయమై చిరంజీవి మేనేజర్ సెక్యూరిటీ వారిని తీవ్రంగా మందలించి, ఇంకెప్పుడూ, అలా చేయవద్దని, ఎవరు వచ్చినా తనకు తెలియజేయవలసిందిగా చెప్పినట్లు తెలిసింది.

అక్టోబర్ 25న లవ్ మ్యారేజ్ చేసుకోనున్న భూమికా చావ్లా







తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో లక్షలాది అభిమానులుగల భూమికా చావ్లా ఎట్టకేలకు తను ప్రేమించిన యోగా టీచర్ భరత్ ఠాగూర్ ను అక్టోబర్ 25వ తేదీన గోవాలో వివాహం చేసుకోనుంది.
గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న వీరి ప్రేమ పెద్దల అనుమతితో చివరికి కళ్యాణ బంధంతో ముడిపడనుంది. పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించిన భూమికా చావ్లా ప్రస్తుతం "అనసూయ", "స్వాగతం" తెలుగు చిత్రాలలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా రెండు సినిమాలకు భూమిక సైన్ చేసి ఉంది. వాటి భవిష్యత్తు తన కాబోయే వాడే నిర్ణయిస్తాడని దగ్గరివారితో చెబుతున్న భూమిక వివాహం తరువాత నటిస్తుందా, లేదా అనే విషయం ఇప్పుడిప్పుడే తెలీదు. ఎనీహౌ.."విష్ యూ హ్యాప్పీ మ్యారీడ్ లైఫ్ భూమికా" అని మనమూ అడ్వాన్స్ గానే విషెస్ చెబుదామా.

హాట్ గావుంటేనే లైం లైట్లో ఉంటాం-శ్రేయ











తన విజయ రహస్యానికి ప్రథమ సూత్రం హాట్ గా ఉండటమేనని టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రేయ అంటోంది.




ఈ రోజులలో శృంగారంగా కనిపిస్తేనే సినీ పరిశ్రమ దగ్గరకు తీసుకుంటుందని, ఏదో కుటుంబ పక్షంలా కనిపిస్తే మనం గెలుపు పందేరంలో వెనకబడటం ఖాయమని ఆమె తెలిపింది. సినిమాలలో శృంగారంగా కనిపించడంతోబాటు, ఏవైనా సినీ ఫంక్షన్లలో కూడా తమ హీరోయిన్ గ్లామర్ గా అంటే కైపెక్కేలా ఉంటేనే బావుంటుందని దర్శక, నిర్మాతలు కోరుకుంటున్నారని, దాంతో తను సాద్యమైనంత శృంగారంగా కనిపించడంకోసం ప్రయత్నిస్తానని చెబుతున్న శ్రేయ, మనలో టాలెంట్ ఉంటే సరిపోదని, ఇలాంటి చిన్న చిన్న ప్రదర్శనలు కూడా అప్పుడప్పుడు ఇస్తుండాలని, అదే తన విజయ రహస్యమని ఆమె తన స్నేహితులతో చెబుతోంది. చెప్పడమే కాదు అదే విషయాన్ని అక్షరాలా పాఠిస్తోంది. అందుకే ఇటీవల తాను విక్రం తో కలిసి నటిస్తున్న ద్విభాషా చిత్రం "మల్లన్న" ప్రారంభ ఫంక్షన్ కు ఇలా గ్లామరస్ గానే వచ్చి అందర్నీ ఆకర్శించింది. కావలిస్తే మీరే చూడండి.

Thursday, September 27, 2007

రెమ్యునరేషన్లలో పోటీ పడుతున్న తెలుగు సినీ కథానాయకులు







తెలుగు సినిమాల బడ్జెట్ చుక్కలను తాకుతోంది. తాకుతోంది సినీ బడ్జెట్ అనేకన్నా.. తెలుగు సినీ కథానాయకుల బడ్జెట్ అంటే సమంజసంగా ఉంటుందని పలువురు నిర్మాతలు విమర్షిస్తున్నారు.
నిజానికి సినిమాల బడ్జెట్ ఒక విధంగా అందుబాటులోనే ఉంటుంది, కానీ అందుబాటులో లేనిది సినీ కథానాయకుల బడ్జెటేనని టాలీవుడ్ అంటోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అక్షరాలాఎనిమిది కోట్ల యాభై లక్షలను తన రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు. తను నటించే చిత్ర నిర్మాతనుంచి చిరంజీవి రెమ్యునరేషన్ కు బదులుగా నైజాం ఏరియా హక్కూలను తీసుకుని, వాటిని వేరేవారికి అమ్ముకోవడం ఆయన చేస్తున్న పని. గత శంకర్ దాదా జిందాబాద్ చిత్రాన్ని ఆయన ఎనిమిది కోట్ల యాభై లక్షలకు అమ్ముకున్నారు. అంటే ఆయన రెమ్యునరేషన్ ఎనిమిది కోట్ల యాభై లక్షలన్నమాట. ఇక ఆయన తర్వాత ఇప్పుడు అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు మహేశ్ బాబు, జూనియర్ ఎన్.టి.ఆర్.లే. వారు సుమారుగా ఆరు కోట్ల రూపాయలను తమ రెమ్యునరేషన్ గా కోరుతున్నారు. ఇటీవల మహేశ్ బాబు చిత్రాలు బాగా విజయవంతం కావడం, ఇక ఎన్ టి ఆర్ మార్కెట్ రేంజ్ పెరగడం తో వారు అధికంగా ఆషిస్తున్నారు. ఇక వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ,పవన్ కళ్యాన్ లు సుమారు 4.5 నుంచి 5 కోట్ల రూపాయలను ఆషిస్తున్నట్లు తెలిసింది. మిగిలిన వారి రెమ్యునరేషన్ ఎక్కువ లేకున్నా, వారి చిత్రాల మార్కెట్ తీరును దృష్టిలో వుంచుకుంటే మాత్రం వారు కూడా ఎక్కువగానే ఆషిస్తున్నారని తెలిసింది. దాంతో పలువురు చిత్ర నిర్మాతలు పెరిగింది సినిమాల బడ్జెట్ కాదు కథానాయకుల బడ్జెట్ అని చమత్కరిస్తున్నారు.

"రంగా పాండురంగా" లో నారదునిగా బ్రహ్మానందం




రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రియుల్ని కడుపుబ్బా నవ్విస్తున్న హాస్య నటుడు బ్రహ్మానందం తొలిసారిగా నారద పాత్రను పోషిస్తున్నారు.
ప్రముఖ నటుడు బాలకృష్ణ నటిస్తున్న ఈ పౌరానిక చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తూ, తనే తన ఆర్.కె ఫిలంస్ బ్యానరుపై నిర్మిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం తొలి సారిగా నారద పాత్రను పోషిస్తున్నారు. గతంలో బ్రహ్మానందం చిత్రగుప్తుని పాత్రను పలు చిత్రాలలో పోషించినా, ఇంతవరకు నారద పాత్రను పోషించలేదు. తన నట జీవితంలో ఒక్క సారైనా నారద పాత్ర పోషించాలనే బ్రహ్మానందం కోరిక ఈ చిత్రంతో తీరనుంది.


టాలీవుడ్ / కోలీవుడ్ కొత్త హీరోయిన్ దీపిక ఫోటో గ్యాలరీ







ఇలియానా చెంప పగలగొట్టిన పవన్ కళ్యాన్




మళ్ళీ పవన్ కళ్యాన్ కు కోపం వచ్చింది. ఈ సారి పవన్ కోపానికి బలి కావడం ఇలియానా వంతైంది. ఇది సినిమాలో అయితే ఎవరూ అంతగా పట్టించుకోనవసం లేదు. అయితే ఇది నిజంగానే షూటింగ్ లో ఉన్న ఇలియానాను అందరూ చూస్తుండగా పవన్ ఆమె చెంప పగలగొట్టాడని తెలిసింది.


పవన్ కళ్యన్, ఇలియానా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. త్రివిక్రం శ్రీనివాస్ దీనికి దర్శకుడు. ఏదో చిన్న విషయానికే పెద్దగా కోపం తెచ్చుకుని పవన్ ఇలియానాపై చేయి చేసుకున్నాడని, దాంతో షూటింగ్ లోనే ఏడ్చేసిన ఇలియానా, మరునాడు షూటింగ్ కు డుమ్మా కొడితే, దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఆమె ఉంటున్న హోటల్ కు వెల్లి ఆమెను ఓదార్చిన తర్వాతే ఆమె తిరిగి షూటింగ్ కు హాజరైందని తెలిసింది. ఈ విషయం ఫిల్మ్ ఛాంబర్ దాకా వచ్చినా ఎవరూ అధికారికంగా ఒప్పుకోకపోవడం, గుట్టుగా చర్చించుకుంటూనే, అధికారికంగా "అలాగా, మాకు తెలీదే" అనో, లేక " ఛ,అలాంటిదేం జరగక పోవచ్చు, అంతా గ్యాసిప్ అయి ఉంటుంది" అనో అంటూడడం కొస మెరుపు.

సెన్సార్ దెబ్బకు "చిరుత" విలవిల


చిరంజీవి తనయుడు సెన్సార్ వారి తొలి దెబ్బకు విలవిల లాడాడు. "చిరుత" చిత్రంలోని 53.06 మీటర్ల రీల్ సెన్సార్ వారి దెబ్బతో చిత్రంలోంచి కనుమరుగైంది. కొన్ని మాటలు, కొన్ని దృష్యాలను సెన్సార్ వారు చిత్రంలోంచి తొలగించారు. సెన్సార్ వారు తొలగించిన దృష్యాల, మాటల వివరాలు.

1.నటుడు సూర్య గొంతు కోయడం దృష్యాన్ని.

2.చివరి ఫైట్లో విలన్ నలిపివేసే 786 అక్షరాల దృష్యాన్ని.

3."ఐ లైక్ యువర్ బ్యాక్" అన్న పదాలను.

4."అన్ని మూసుకుని" అన్న పదంలోచి "అన్ని" పదాన్ని.

5."సంక నాకి", "నేనా సంకలు నాకేది" పదాలను.

6."ఫక్", "ఫకింగ్" పదాలను.

7.కత్తితో గొంతు కోస్తున్న దృష్యాలను.

8."ఆషిష్ విద్యార్తి" గొంతు కోయడం, కత్తి నుంచి బొట్లు బొట్లుగా పడుతున్న రక్తపు చుక్కలు దృష్యం.

9.క్లైమాక్స్ దృష్యాన్ని సుమారు ఇరవై శాతం దాకా కట్ చేసారు.

10.హీరోయిన్ బెడ్ రూం దృష్యాన్ని.

Wednesday, September 26, 2007

బాలీవుడ్ భామిని ఇషా కొప్పీకర్ ఫోటో






















"దశావతారం" చిత్రం కోసం కమల్ హాసన్ వెరైటీ కొత్త గెటప్


శాఖాహార ఉద్యమం చేస్తున్న బాలీవుడ్ భామిని కరీనా కపూర్


బాలీవుడ్ క్రేజీ కథానాయకి కరీనా కపూర్ శాఖాహార ఉద్యమాన్ని లేవనెత్తింది.

ఉద్యమం అంటే పెద్దయెత్తున రోడ్లపై కాదు...బాలీవుడ్ లోనే. తన సహ నటీనటుల దగ్గర చేరి మాంసాహారాన్ని మానివేయమని సలహాలు ఇవ్వడమే కాకుండా, శాఖాహారం వల్ల ఉన్న లాభాలు, మాంసాహారం వల్ల ఉన్న నష్టాలను విడమర్చి చెబుతూ అందరూ మాంసాహారాన్ని మానివేయాలని, ఇకపై శాఖాహారాన్ని మాత్రమే భుజించాలని కోరుతోంది. గత ఎనిమిది నెలల క్రితం దాకా మాంసాహారాన్ని అమితంగా ఇష్టపడే కరీనా అకస్మాత్తుగా, దానికి గుడ్ బై చెప్పి శాఖాహార వ్రతాన్ని చేబట్టింది. తను మాంసాహారాన్ని మానివేయడమే కాకుండా, తన ప్రియుడు షాహిద్ తో కూడా మాంసాహారాన్ని పూర్తిగా మానివేయించి ఇప్పుడు సహనటీ,నటుల దగ్గర తన శాఖాహార సూత్రాలను వల్లెవేస్తోంది. కొత్తగా తన గ్లామర్ రహస్యానికి శాఖాహారమే కారణమనీ సెలవిస్తోంది. ఎనీహౌ, కరీనా తన ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుందాం.

"మల్లన్న" చిత్రంకోసం విక్రం కొత్త గెటప్


టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు చేరిన గ్లామర్ భామిని అర్చన ఉరఫ్ వేద (ఫోటో గ్యాలరీ)











వియ్యంకులు కాబోతున్న బాలకృష్ణ, మోహన్ బాబు..!?




టాలీవుడ్ నటద్వయం బాలకృష్ణ, మోహన్ బాబులు త్వరలో వియ్యంకులు కాబోతున్నారా...?ఏమో...ఫిల్మ్ నగర్లో ఇదే విషయం గూర్చి అంతా చర్చించుకుంటున్నారు. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణువర్దన్ వివాహం బాలకృష్ణ రెండవ అమ్మాయి తేజస్వినితో చేస్తే ఎలావుంటుందనే విషయం గూర్చి మోహన్ బాబు తనకు దగ్గరి వారి దగ్గర చర్చిస్తున్నట్లు తెలిసింది.


ఈ విశయం ఇంకా బాలయ్య దగ్గరికి వెళ్ళిందా లేదా అనే విషయం ఇదమిద్దంగా తెలీకున్నా, ఈ జోడీ గూర్చి విన్న వారు మాత్రం ఇది మంచి జంట అవుతుందని మాత్రం చెబుతున్నట్లు తెలిసింది. స్వతహాగా బాలకృష్ణ, మోహన్ బాబులు మంచి మితృలు కావడం, మోహన్ బాబు స్వర్గీయ ఎన్.టి.ఆర్ కు బాగా ఆత్మీయుడు కావడం వల్ల వీరి పెళ్ళి బాజా త్వరలో మోగే సూచనలు కనిపిస్తున్నట్లు చెబుతోంది. ఇదే జరిగితే బాలయ్య, మోహన్ బాబులు వియ్యంకులవుతారన్నమాట. సరే ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం.

స్వచ్చమైన "ముద్దు"లకూ జిందాబాద్.




























నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం.
ఎంతిష్టమంటే ఎంతిష్టమో చెప్పలేనంత ఇష్టం.

ఆ ఇష్టాన్ని ఎలా చెప్పాలో తెలీనంత ఇష్టం.

ఏ భాషలూ..భావనలకూ అందనంత ఇష్టం.

మరి ఆ ఇష్టాన్ని ఎలా చెప్పాలి... అదేగా ఇంతవరకూ ప్రపంచం కనుగొనంది..భవిష్యత్తులో కనుగొంటుందనే ఆశా లేనిదీ.మరి ఆ ఇష్టాన్ని చెప్పడానికి ఉన్న మరేదైనా దగ్గరి దారి..?

అసలు దారే లేనిదానికి దగ్గర దారి మరో దూరం దారి ఉంటాయా.. మన పిచ్చి గానీ...అయ్యో అప్పుడే అంత మాట అనకండి. ఎందుకంటే దారయితే ఉందో లేదో తెలీదు గానీ, మన ఇష్టాన్ని మన మనసైన వారికి తెలియజెప్పడానికి ఓ దారుంది. అదే ..."ముద్దు".

"ముద్దు" అని కొట్టిపడెయ్యకండి. ఆ ముద్దు ఎవరు ఎవరికి ఇచ్చేదయినా కావచ్చు. తల్లి తన తనయులకు లేదా తనయలకు ఇచ్చేదే కావచ్చు, లేదా భర్త తన భార్యకు ఇచ్చేదే కావచ్చు. ప్రియుడు తన ప్రియురాలికి ఇచ్చేదే కావచ్చు...ముద్దేదయినా దాని వెనుక ఉండే హృదయం ముఖ్యం. ఆ ముద్దు వెనక ఉండే భావం ముఖ్యం. దాని వెనక ఉండే స్వచ్చత ముఖ్యం. స్వచ్చమైన మనసుతో...స్వచ్చమైన భావంతో...స్వచ్చమైన హృదయంతో ఇచ్చే ముద్దు నిజంగా ఓ గొప్ప భావనే.ఒకరు ఒకరికి ఇచ్చే ముద్దు వారి మద్య ఆత్మీయానుబంధాలను పెంచేదిగా ఉంటే, ఆ ముద్దు వారి హృదయాలను గాయపరిచేది కాకుండా ఉండేది అయితే ముద్దు నిజంగా అమృత తుల్యమే.

విషయం ఏదైనా ప్రపంచ ముద్దుల దినోత్సవం సందర్భంగా స్వచ్చమైన "ముద్దు" లకూ జిందాబాద్.

శ్రీవెంకట్ బులెమోని

Tuesday, September 25, 2007

పుత్రోత్సాహంతో అమెరికాకు ఫోన్లు చేస్తున్న చిరంజీవి







మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో పులకరించిపోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తనయుని చిత్రం "చిరుత" పైనే పూర్తి ధ్యాస పెట్టిన చిరంజీవి, ఈ చిత్ర ప్రివ్యూ చూసిందగ్గర్నుంచి ఒకటే ఆనందంతో పూరీ జగన్నాథ్ ను అభినందించడంతో బాటు, తనయుడిని మనస్పూర్తిగా కౌగిలించుకుని అభినందించినట్లు తెలిసింది.
చిత్రంలో రాం చరన్ నటన చాలా బావున్నట్లు తన అమెరికా మితృలకు ఫోన్ చేసిమరీ చిరంజీవి చెప్పడం చిత్ర పరిశ్రమలో ఆసక్తిని కలిగించింది. దానికి తోడు ధని ఏలె రూపొందించిన "చిరుత" పబ్లిసిటీ డిజైన్లు సహితం చిరంజీవిని ఆకట్టుకున్నట్లు తెలిసింది. హైదరాబాదుతో సహా ఇతర పట్టణాలలో, చెన్నై, బెంగులూరు నగరాలలో కూడా "చిరుత" పోస్టర్లు ప్రముఖంగా కనిపిస్తూండటం కూడా చిరంజీవిని సంతృప్తి పరచినట్లు తెలిసింది. ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని ఆయన అందరికీ ఫోన్లో చెబుతున్నారు.ప్రజలు కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తారని తాను నమ్ముతున్నట్లు ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం చిత్ర దర్శకునికి, నిర్మాతకు, ఇతర టెక్నీషియన్లకు ఆనందాన్ని కలిగిస్తోంది.

నీతులు చెప్పేకన్నా ముందు వాటిని పాఠించాలని చెబుతూ రెండు గ్రామాల దత్తత తీసుకున్న "మల్లన్న" చిత్ర యూనిట్







నీతులు చెప్పేకన్నా ముందు వాటిని పాఠించాలని చెబుతూ హీరో విక్రం, నటి శ్రేయలు జంటగా నటిస్తున్న ద్విభాషా చిత్రం "మల్లన్న" చిత్రం యూనిట్ రెండు గ్రామాలను దత్తతకు తీసుకుంది.
ఆరంభం నుంచే వార్తల్లో నిలవాలని భావిస్తున్న ఈ సినీ బృందం ఈ చిత్ర ప్రారంభాన్ని ఏకంగా "గిన్నిస్ రికార్డ్స్" లోకి ఎక్కించడం కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రపంచంలోనే తొలిసారిగా ఈ చిత్ర ట్రైలర్ తో కూడిన వెయ్యి ఎలక్ట్రానిక్ ఇన్విటేషన్ లను ప్రచురించి రికార్డులకు ఎక్కింది. గిన్నిస్ వారు దీనిని ఇంకా రికార్డు చేయనప్పటికీ, రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది."ఒక్కో ధనవంతుడు ఒక్కో వీధిని దత్తతుకు తీసుకుని అబివృద్ది పరిస్తే సమాజంలో అసమానతలు చాలావరకు తొలిగి పోతాయని చెప్పే ఇతివృత్తంతో" ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకని ఆ నీతిని చెప్పేకన్నా ముందు తామే ఈ సూత్రాన్ని పాఠించాలని చిత్ర యూనిట్ భావించింది. తదనుగుణంగా తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని "చెల్లపట్టి", "సంఘపట్టి" అనే రెండు గ్రామాలను దత్తతుకు తీసుకుంది.ఈ గ్రామాలలో రోడ్ల సౌకర్యం, అంగన్ వాడీ కేంద్రం, పాఠశాల భవనం వంటివి చిత్ర యూనిట్ నిర్మించనుంది. అలాగే ఈ గ్రామాలకు సంబంధించి భవిశ్యత్తులో కూడా కనీస అవసరాలు, ఇతర అభివృద్ది పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కొందరు ఉద్యోగులను చిత్ర యూనిట్ నియమించింది. ఇలా కొత్తదారిలో వెళ్ళడం ఖర్చుతో కూడినదైనా ఇది ప్రజలకు మేలు చేసేది కనుక ఈ దారిని ఎంచుకున్నట్లు చిత్ర దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.

విశాల్, నయనతారల "సత్యం" సాంగ్యాలరీ







Monday, September 24, 2007

రాం చరన్ తేజ్ హీరోగా "జగదేక వీరుడు అతిలోక సుందరి-2"




చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం "జగదేక వీరుడు అతిలోక సుందరి" కథతో చిరంజీవి తనయుడు రాం చరన్ తేజ్ హీరోగా "జగదేక వీరుడు అతిలోక సుందరి-2" చిత్రం రూపొందనుంది.


ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించతలపెట్టిన ఈ చిత్రానికి క్రేజీ దర్శకుడు రాజమౌలి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇందులో రాం చరన్ కూడా తండ్రి పోషించిన గైడ్ పాత్రనే పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను గోప్యంగా వుంచుతున్నారు. స్క్రిప్ట్ వర్క్,నటీనటుల ఎంపిక, ఇతరత్రాలు పూర్తి చేసుకుని వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రారంభించే అవకాశం ఉంది.

శ్రేయాందాలు...(ఫోటో గ్యాలరీ)







ఒకే థియేటర్లో 890 రోజులు పూర్తి చేసుకుని కొత్త రికార్డు సృస్టించిన "చంద్రముఖి"







రజినీ కాంత్ నటించిన "చంద్రముఖి" చిత్రం 890 రోజులు ఒకే థియేటర్లో ప్రదర్శింపబడిన ఏకైక తమిళ చిత్రంగా భారతీయ చలన చిత్ర చరిత్రలో కొత్త రికార్డును సృస్టించింది. చెన్నయ్ లోని శాంతి థియేటర్లో ఇన్ని రోజులు ప్రదర్శింపబడిన ఈ చిత్రం గత శుక్రవారం నుంచి నిలిపివేయబడింది. అదే రోజునుంచి చెన్నైలోని మరోనాలుగు థియేటర్లలో మరో మారు ఈ చిత్రం విడుదలై మరో కొత్త రకార్డు వైపు అడుగులువేస్తోంది.

శివాజి ఫిలింస్ పతాకంపై దివంగత నటుడు శివాజీ గణేశన్ తనయుడు ప్రభు నిర్మాతగా, దర్శకుడు పి.వాసు దర్శకత్వలో నిర్మించిన ఈ చిత్రంలో రజినీ కాంత్,నయనతార, జ్యోతిక,ప్రభులు ప్రధాన పాత్రలు పోశించారు. "చంద్రముఖి" చిత్రం 14 ఏప్రిల్, 2005న విడుదలై ఏకబిగిన 890 రోజులు ఒకే థియేటర్లలో ప్రదర్శితమై, గతంలో ఒకే థియేటేలో 800 రోజులు ప్రదర్శించిన తమిళ చిత్రంగా "భాగవతార్" పేరుతో ఉన్న రికార్డును ఈ చిత్రం బద్దలుకొట్టి, కొత్త రికార్డును సృస్టించింది. కాగా 300రోజులు ఏకబిగిన నాలుగు థియేటర్లలో ప్రదర్శింపబడిన ఏకైక తమిళ చిత్రంగా ఈ చిత్రం తమిళ నాట మరో రికార్డును కూడా నెలకొల్పింది.

"మల్లన్న" చిత్రంలో మల్లమ్మ గా నటిస్తున్న విక్రం (ఫోటో)


Friday, September 21, 2007

శృంగార నన్నివేశాల చిత్రీకరనకు సై అంటున్న మీరా జాస్మిన్







జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్న నటి మీరా జాస్మిన్ గ్లామర్ పండించే శృతిమించని శృంగార సన్నివేశాలకు తానూ సిద్దమేనని "నేపాళీ" తమిళ చిత్రంలో శృంగార సన్నివేశాలలో నటిస్తూ తెలియజేసింది. ఇప్పటిదాకా గృహస్థ ప్రాధాన్యమైన చిత్రాలకే ఓటు వేసిన మీరా జాస్మిన్ ఇకముందు, అవసరమైన పక్షంలో ముద్దు సన్నివేశాల చిత్రీకరణకూ సై అంది. రాజశేఖర్ నటిస్తున్న "రక్త సంబంధం" చిత్రంలో చెల్లెలి పాత్రలో నటిస్తున్న మీరా జాస్మిన్ తమిళంలో, మళయాలంలో పలు చిత్రాలలో నటిస్తోంది.ఇక ముందు అన్ని భాషలలో, గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తానని కోలీవుడ్ లో అంటున్నట్లు వినికిడి.

విశాఖ బీచ్ లో ఆడుకోవడం ఇష్టం, ఐ.ఎ.ఎస్ కావడమే నాకున్న లక్ష్యం : నేహా ధూపియా


బాలీవుడ్ అందాల భామ, ప్రముఖ మోడల్ నేహా ధూపియాకు ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ కావడం తన జీవిత లక్ష్యమని చెన్నైలో పత్రికలవారికి తెలిపింది. ప్రఖ్యాత నగల డిజైనర్ శోభా అసర్ చెన్నైలో ఏర్పాటు చేసిన వివాహ ఆభరణాల ప్రదర్శనకోసం వచ్చిన ఆమె, చిన్నప్పుడు విషాఖపట్నంలో చదువుకున్నానని, అక్కడి బీచ్ లో అలల వెంట పరిగెత్తడమంటే భలే సరదా అని తెలిపింది. చిన్నతనంలో మా నాన్న ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నప్పటినుంచే తనకు ఐ.ఎ.ఎస్ అధికారి కావాలనే కోరిక ఉందని తెలిపింది.కోరికైతే ఉంది గానీ, ఐ.ఎ.ఎస్ చేయడానికి టైమే లేదని చల్లగా సెలవిస్తుంటే నవ్వుకోవడం పత్రికలవారి పనైంది.

"శివాజి" చిత్ర కథపై రజినీ కాంత్ కు కోర్టు నోటీసు


తన కథను కాపీచేసి "శివాజి" చిత్రాన్ని నిర్మించారని, తనను మోసం చేసారని చెన్నైకి చెందిన ఒక న్యాయవాది చెన్నై సిటి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దానిని విచారణకు తీసుకున్న న్యాయమూర్తి ఈ విషయమై వివరణ కోరుతూ చిత్ర నిర్మాత ఎం.వి.శరవణన్, చిత్ర దర్శకుడు శంకర్, చిత్ర కథానాయకుడు రజినీ కాంత్ లకు కోర్టు నోటీసులు పంపించారు. గత నెలలో విడుదలైన "శివాజి" చిత్రం కథ తనదని చెన్నైలోని చ్చేత్ పేట్ కు చెందిన న్యాయవాది ఎ.ఇళంగోవన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. అతను తన పిటిషన్లో "నేను, "శివాజి" చిత్ర కథను 2005వ సంవత్సరంలో రాసానని, మూడు పేజీలలో రాసిన ఈ కథను, తను నిర్మాత ఎం.వి.శరవణన్, దర్శకుడు శంకర్, హీరో రజినీ కాంత్ లకు 12.10.2005న రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాను. అయితే దర్శకుడు శంకర్ కు పంపించిన కవర్ తిరిగివచ్చింది. అయితే అందులో తను వుంచిన కథ లేకుండా, కేవలం తెల్ల కాగితాలు మాత్రం ఉన్నాయి. అప్పట్లో పెద్దగా పట్టించుకోని నేను, చిత్రం విడుదల తర్వాత చూస్తే అది తాను వ్రాసిన కథనే చిన్న చిన్న మార్పులతో నిర్మించడం గమనించాను. ఇది నాకు దిగ్బ్రాంతిని కలుగజేసింది.తదనంతరం దీనిగురించి వివరణ కోరడానికి శంకర్ ను, రజినీకాంత్ లను కలవడానికి ప్రయత్నించగా, అది సాద్యంకాలేదు. దాంతో తాను కోర్టును ఆశ్రయించానని, ఆ కథను తనదిగా ప్రకటించాలని, అంతదాకా చిత్రాన్ని నిషేధించాలని" ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు తీసుకున్న న్యాయమూర్తి, నిర్మాత, దర్శకుడు, హీరోలకు నోటీసులు ఇచ్చి, కేసును ఈ నెల 21కి వాయిదా వేశారు.

"చిరుత" సుందరి ఫోటో గ్యాలరీ







Thursday, September 20, 2007

అభిమాన నటి ఆటోగ్రాఫ్ కోసం సెక్యూరిటీ వారిచే నెట్టివేయబడ్డ మెగాస్టార్ చిరంజీవి


















కొందరికి కొన్ని అపూర్వ క్షణాలు ఉంటాయి. కొందరు కొందరికి అపురూప వ్యక్తులు అవుతారు. కొందరిపై కొందరికి పెరిగే అభిమానం ఎలాంటి సంఘటనలకైనా దారి తీస్తుంది. భారత దేశంలో తనకంటూ ప్రత్యేకమైన హోదా కలిగిన వ్యక్తి తను అభిమానించే ఒక నటి ఆటోగ్రాఫ్ కోసం సెక్యూరిటీ వారిచేత నెట్టివయబడ్డాడంటే అది సామాన్య విషయం కాదు. ఆ వ్యక్తి అభిమానాన్ని పొందిన వ్యక్తీ సామాన్యమైన వ్యక్తి అయి ఉండరు. దక్షిణ భారత దేశంలో కొన్ని కోట్ల మందికి ఆరాధ్య నటుడైన చిరంజీవి ఒక వైపు మెగా స్టార్ గా కొనసాగుతూ, మరోవైపు ఒక నటి ఆటోగ్రాఫ్ కోసం ఏకంగా సెక్యూరిటీ వారిచేత నెట్టివేయబడ్డ సంఘటన 1989లో అమెరికాలో, ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జరిగింది.
1989లో ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్ళిన చిరంజీవి అక్కడ తన అభిమాన నటి గోల్డీ హాన్స్ ను చూడడం జరిగింది. తను ఎంతగానో అభిమానించే హాలీవుడ్ నటి ఆమె. ఆమెకు సంబంధించిన ఎన్నెన్నో ఫోటోలు, సినిమాల డి.వి.డిలను ఎంతో భద్రంగా దాచి ఉంచుకున్న చిరంజీవి, అక్కడ ఆమెను చూడగానే తను ఓ మెగా స్టార్ ను అనే విషయమే మరచిపోయి ఒక సాధారణ ప్రేక్షకునిగా అందరితో కూడి గోల్డీ హాన్స్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డాడు. అప్పుడు ఆమెకు సెక్యూరిటీగాఉన్న గార్డులు చిరంజీవితో సహా, అందరినీ వెనక్కి నెట్టివేశారు. అయినా వెరవకుండా, ఆమెదగ్గరికివెళ్ళి, ఆమె ఆటోగ్రాఫ్ తీసుకున్న చిరంజీవి జీవితంలో ఏదో దొరకనిది పొందిన అనుభూతికి లోనయ్యానని ఆయనే స్వయంగా అక్కడ తనకు తెలిసినవారితో చెప్పడం, ఆ తర్వాత ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా ఇక్కడి పాత్రికేయులకు చెప్పడం జరిగింది. చిరంజీవి జీవితంలో తీసుకున్న తొలి, చివరి ఆటోగ్రాఫ్ అది.

డ్యూయట్ సాంగ్సా...వ్య్వాక్...: తనుశ్రీ దత్తా


బాలీవుడ్ గ్లామర్ స్టార్ తనుశ్రీ దత్తాకు ద్యూయట్ సాంగ్స్ అంటేనే యమబోరెత్తినట్లుంది. ఆ మాటంటేనే అసహ్యించుకుంటోంది. చెట్ల వెంటా, పుట్టల వెంటా హీరో చేతులు పట్టుకుని పరిగెత్తడం, గెంతడం,ఎగరడం కూర్చోవడం... చూస్తుంటే సర్కస్ లో బఫూన్ చేసినట్లుగా వుంటోంది. అందుకే ఇకపై ద్యూయట్ సాంగ్స్ దాదాపు చేయనని చెబుతోంది.

రెగ్యులర్ గా వచ్చే పాత్రలవల్ల మల్లీ మల్లీ ఇలా ద్యూయట్ సాంగ్స్ లో కనిపించాల్సి వస్తుందని, అల్లంటి స్క్రిప్ట్ తో ఎవరు వచ్చినా "నో" అనిచెప్పడం ప్రారంభించానని బాలీవుడ్ రిపోర్టర్ల మెదడ్లు తినేస్తున తనుశ్రీ ప్రస్తుతం "రమ్మ-ది సేవియర్" బాలల చిత్రంలో నటిస్తోంది. ఇందులో తనది అడ్వెంచరస్ పాత్ర అని, ఇది పిల్లలను బాగా ఆకట్టుకుంటుందని చెబుతోంది. గతంలో తను నటించిన "రఖీబ్" చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గ బోల్తాపడినా, అందులో తను చేసిన నెగిటివ్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందని, అలాగే త్వరలోనే విడుదల కానున్న దర్శకుడు ప్రియదర్షన్ చిత్రం "ధోల్" లో కూడా చాలా మంచి పాత్రను తనకు ఇచ్చారని చెబుతున్న తనుశ్రీ ఈ బాలల చిత్రంపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నట్లు బాలీవుడ్ చెబుతోంది.

హిందీ "పోకిరి" లో నటించనున్న హాలీవుడ్ హాటెస్ట్ ఐటెం గర్ల్ షకీరా...!











హాలీవుడ్ ఐటెం గర్ల్ షకీరా హిందీలో నిర్మిస్తున్న రీమేక్ చిత్రం "పోకిరి" నటించనుందని తెలిసింది. మహేశ్ బాబు, ఇలియానాలు జంటగా తెలుగులో నిర్మించిన "పోకిరి" చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్, ఆయేషా టకియాలు జంటగా బోనీ కపూర్ పునర్నిర్మిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ లో నటించాల్సిందిగా చిత్ర నిర్మాత బోనీ కపూర్ ఇటీవల హాలీవుడ్ నృత్య తార షకీరాను కలిసి అడగడం జరిగింది. ఇందుకు ఆమె వెంటనే ప్రతిస్పందించకున్నా, ఆమె మేనేజర్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దాంతో తదనంతర ఏర్పాట్లకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. కాగా "పోకిరి" చిత్రం తమిళంలో కూడా పునర్నిర్మించబడి అక్కడ సంచలన విజయం సాధించింది. ఇప్పుడిక హిందీ వంతు.

కొంత మంచి + కొంత చెడు = పవన్ కల్యాణ్.




ఎప్పుడూ వివాదాలతో సహజీవనం చేసే టాలీవుడ్ కథానాయకుడు పవన్ కల్యాణ్ లో ఉన్న మంచిని అతని వివాదాలు తెరమరుగు చేస్తున్నాయని తెలిసింది.


ఒకప్పుడు పరిటాల రవి గొడవ, "ఖుషి" దర్శకుడు ఎస్.జె సూర్యను సెట్లో కొట్టడం, కోపాన్ని తట్టుకోలేక అన్నపూర్న స్టూడియోలో గొడవచేసి సెట్ ను కూల్చడం, చిరంజీవి కూతురు నిష్చితార్థం ఉదయకిరన్ తో జరుగుతున్నప్పుడు, డెక్కన్ క్రానికల్ రిపొర్టర్ని కొట్టడం, ప్రస్తుతం తన భార్య నందినితో కోర్టులో గొడవ ...ఇలా ఎప్పుడూ వివాదాలు చుట్టుముట్టి ఉండే పవన్ కల్యాణ్ సహజసిద్దంగా దయార్ద హృదయుడని ఫిల్మ్ నగర్ అంటోంది. ఎన్నోమార్లు జూనియర్ ఆర్టిస్టులకు ఆర్థిక సహాయం చేయడం, విద్య,ఉపాది కలిగించడం కోసం చాలా ఉత్సాహం చూయించడమే కాకుండా, కొందరు బీదవారికి వారి ఆరోగ్య రక్షణ కోసం ఎంతో ధన సహాయం చేసాడని, అలాంటి అతనికే ఎప్పుడూ ఇలా వివాదాలు చుట్టుముట్టడం తమను బాధిస్తోందని కొందరు జూనియర్ ఆర్టిస్టులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. దేవుడు ఆయనకు మంచే చేస్తాడని అంటున్నారు. ఏ విషయానికైనా వెంటనే స్పందించే స్వభావమే పవన్ వివాదాలకు కారణమని దగ్గరివారు అంటున్నారు. ఉద్రేకాన్ని తగ్గించుకుని శాంతంగా వుంటే పవన్ చాలా ఉత్తముడని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఎన్.టి.ఆర్ "కంత్రీ"


యంగ్ ఎన్.టి.ఆర్ కంత్రీగా ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత సి.అశ్విని దత్ తన వైజయంతి పిక్షర్స్ బ్యానరుపై నిర్మించనున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నాడు. హాన్సికా మోత్వాని కథానాయికగా ఎన్నికైన ఈ చిత్రం పూజాకార్యక్రమాలను ఈ శుక్రవారం పూర్తిచేసి, ఈ అక్టోబర్ 22నుంచి రెగ్యులర్ షూటింగ్ ను జరపనున్నారు.

కథాపరంగా కొన్ని రోజులు లండన్ లో, మరికొన్ని రోజులపాటు ఆస్టేలియాలో షూటింగ్ జరిపినతర్వాత మిగిలిన రెగ్యులర్ షూటింగ్, ఇతర పాటలు, టాకీని ఇండియాలో, ఆంద్రప్రదేశ్ లో షూటింగ్ జరిపి వచ్చే వేసవికి చిత్రాన్ని విడుదలకు సిద్దం చేస్తారు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి చిత్రాల సమరంలో నిలపాలని ముందుగా అనుకున్నా, అప్పుడు ఎన్.టి.ఆర్ బాబాయ్ బాలక్రిష్ణ నటిస్తున్న "ఒక్క మగాడు" విడుదల ఉండటంతో ఈ చిత్రాన్ని వేసవికి వాయిదా వేసినట్లు తెలిసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు మణిశర్మ ఇప్పటికే ట్యూన్స్ సిద్దం చేసినట్లు తెలిసింది.

Wednesday, September 19, 2007

నేనూ..నా బుజ్జి కుక్క పిల్లలూ : హీరో విక్రం





ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో ఒక్కోలా వుంటే బావుంటుందనిపిస్తుంది. ఎవరికైనా కొద్దిపాటి లీజర్ దొరికినా తమ మనసుకు నచ్చిన పనులలో మునిగితేలుతారు. కొందరు ఝుమ్మని రేడియో వింటే, మరికొందరికి ఆటలాడటం, కొందరికి పాటలు, కొందరయితే జాలీగా ఏ ఊటీకో, కొడైకెనాల్ కో వెళ్ళి సేదతీరుతారు. కాని మన హీరో విక్రం ఏంచేస్తాడో తెలుసా... హాయిగా తన బుజ్జి కుక్క పిల్లలతో ఆడుకుంటూ మనస్పూర్తిగా సేదతీరుతాడు. కావలిస్తే మీరే చూడండి...తన కుక్కపిల్లలతో ఎలా ఆడుకుంటున్నాడో...!.

చైనాలో యుద్ద విద్యల్లో శిక్షణ తీసుకుంటున్న సుస్మితా సేన్




మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ చైనాలో యుద్ద విద్యలలో శిక్షణ తీసుకుంటోంది. తను నిర్మాతగా మారి నిర్మించతలపెట్టిన "రాణి లక్ష్మి భాయ్" చిత్రంకోసం ఆమె ఈ శిక్షణ తీసుకుంటున్నారు. భారత దేశం గర్వించే మహరాణి రాణీ రుద్రమ దేవి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె రాణీ రుద్రమ దేవిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయింది. అంతర్జాతీయ స్తాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో తను నిర్మించతలపెట్టిన ఈ చిత్రంకోసం ఆమె చైనాలో గుర్రపు స్వారీ, కత్తి యుద్దం, మల్ల యుద్దం లతోబాటు, ఇతర యుద్దవిద్యలలో కూడా శిక్షణ తీసుకుంటున్నారు. మరో నెల రోజులలో ఈ శిక్షణను పూర్తి చేసుకుని భారత్ తిరిగివచ్చిన తర్వాత ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారో నిర్ణయించి, సాధ్యమైనంత తొందరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని సుస్మితా సేన్ మేనేజర్ కృష్ణ బెనర్జీ తెలిపారు.

తెలుగులో రీమేక్ అవుతున్న శృంగార భరిత ఇంగ్లీష్ చిత్రం "బేసిక్ ఇంస్టింక్ట్స్"



హాలీవుడ్ శృంగార తార షెరాన్ స్టోన్ నటించిన ఆంగ్ల చిత్రం "బేసిక్ ఇంస్టింక్ట్స్" తెలుగులో రీమేక్ అవుతోంది.అమెరికాలో నిర్మాణమై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఈ చిత్రంలో నటి షెరాన్ స్టోన్ నటన ప్రపంచవ్యాప్తంగా మగవారి గుండెలు కొల్లగొట్టింది. అద్భుతమైన శృంగారరసం ప్రధానాంశంగా, నవలా రచయిత్రి పాత్రలో కనువిందు చేసిన ఈ పాత్రను తెలుగులో ఐటెం గర్ల్ గా రాణిస్తున్న మోనాలిసా ఈ పాత్రను పోశిస్తోంది. గతంలో పలు డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన వెంకట సాయి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభమైన ఈ చిత్రం నవంబర్ నెలలో తెలుగులో విడుదలచేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూస్తే గానీ తెలీదు.

విక్రం, శ్రేయల హాట్ పెయిర్ ఫోటో సెషన్







వెంకటేశ్ "తులసి" చిత్రం లోగో విడుదల




సురేష్ ప్రొడక్షన్స్ బ్యానరుపై, డి. సురేష్ బాబు నిర్మించిన "తులసి" చిత్రం అధికారికమైన లోగో విడుదల చేసారు. ఇది యాక్షన్ ఓరిఎంటెడ్ లవ్ స్టోరి. ఇందులో వెంకటేశ్ సరసన నయనతార కథానాయికగా నటించింది. కాగా ఒక పాటలో నటి శ్రియ నటించింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.

రూ.7.5 కోట్లకు "చిరుత" నైజాం హక్కులు కొన్న దాసరి నారాయణ రావు.

ప్రముఖ దర్శక,నిర్మాత, కేంద్ర మంత్రి డా.దాసరి నారాయణ రావు చిరంజీవి తనయుడు రాం చరన్ నటించిన తొలి చిత్రం "చిరుత" నైజాం హక్కులను రూ.7.5 కోట్లకు కొన్నారు.
నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ హక్కులకోసం ఇంత పెద్ద మొత్తం తొలి చిత్రానికే సాధించడం ఒక రికార్డు. సాధారణంగా పెద్ద హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్.టి.ఆర్ ల చిత్రాలకే ఇంతదాకా సుమారు ఏడు కోట్ల రూపాయలు నైజాం ఏరియాలో డిస్త్రిబ్యూషన్ హక్కులకోసం బయ్యర్లు వెచ్చిస్తుంటారు. మరీ ప్రత్యేకమైన చిత్రాలకు మాత్రం 7.0 నుంచి 7.5 కోట్లదాకా వెచ్చిస్తుంటారు. అయితే రాం చరన్ తొలి చిత్రంపై పరిష్రమలో పెద్దయెత్తున అంచనాలు పెరిగిపోవడంతో దాసరి నారాయణ రావు ఇంత పెద్ద మొత్తం ఈ చిత్రంకోసం వెచ్చించినట్లు తెలిసింది. దీనిని ఆయన స్వంత బ్యానరైన సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పై విడుదలచేస్తారు. కాగా ఆంధ్రా, ఈస్ట్, వెస్ట్, రాయలసీమ ఏరియాలకుగాను సుమారు మరో పదికోట్ల రూపాయలదాకా ఈ చిత్రం డిస్త్రిబ్యూషన్ హక్కులకుగాను వసూలు చేసినట్లు తెలిసింది.

Tuesday, September 18, 2007

గ్లామర్ భామల గ్లామరస్ భంగిమలు (ఫోటో గ్యాలరీ)


టాలీవుడ్,కోలీవుడ్, బాలీవుడ్ లలో ప్రముఖ గ్లామర్ తారలుగా కొనసాగుతున్న తనుశ్రీ, శ్రియ,రియా ఖాన్, ప్రీతీ జింటా, మల్లికా శెరావత్, కంగన, సెలీనా జైట్లీ,ఆర్తీ ఛాబ్రియా, నమితల గ్లామరస్ ఫోటోలు.




















































చిరంజీవి ఇల్లూ, కార్లూ ఎలా వున్నాయో చూసొద్దాం రండి.
















అభిమానులకు తమ హీరోలేం చేసినా, ఏం వాడినా అది తెలుసుకోవాలనే కొరిక సహజంగా ఉంటుంది. అందునా తము అభిమానించే నటుడు చిరంజీవి అయితే...!.అది మరీనూ, అందుకే చిరంజీవి అభిమానులకోసం చిరంజీవి వ్యక్తిగతంగా చాలా ఇష్టపడే కార్లూ, అతను మెచ్చి కట్టుకున్న ఇల్లూ ఎలా వున్నాయో చూయిస్తే ఎలా వుంటుందనే ఆలోచన వచ్చింది. దానికి అనుగుణంగానే ఈ కలెక్షన్లను బ్లాగు ప్రియులకోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము. అభిమానులు చూసి ఆనందించండి.

టీనేజ్ గ్లామర్ స్టార్ జెనీలియా లేటెస్ట్ ఫోటో సెషన్











సినిమా నిర్మాణంపై సంపూర్ణ అవగాహన కోసం http://filmtechniques.blogspot.com/

సినిమా నిర్మాణంపై సంపూర్ణ అవగాహన కలిగించడం కోసం ప్రారంభించిన కొత్త బ్లాగ్ "ఫీచర్ ఫిల్మ్ టెక్నిక్స్" చాలాబాగావుంది. ఇందులో ఫీచర్ ఫిలింస్, డాక్యుమెంటరీ ఫిలింస్, కార్పోరేట్ ఫిలింస్, అడ్వర్టైస్ మెంట్ ఫిలింస్, ఆర్ట్ ఫిలింస్ ల నిర్మాణం విశయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కథ, స్క్రీన్ ప్లే, మాటల రచన, నిర్మాణాంతర కార్యక్రమాలకు సంబంధించిన ఎడిటింగ్, మిక్సింగ్, మ్యూజిక్, గ్రాఫిక్ వర్క్, టైట్లింగ్,స్పెషయల్ ఎఫెక్ట్స్ మొదలుకుని ఇతరత్రా చిత్ర నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాల గూర్చి పూర్తి సాంకేతికమైన వ్యాసాలను ఇంగ్లీషులో ప్రచురిస్తామని బ్లాగు నిర్వాహకులు తెలిపారు. ఈ సబ్జెక్ట్ కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వీటిని హాలీవుడ్ నిర్మాణశైలి నేపద్యంగా తీసుకుని, అక్కడక్కడా మన తెలుగు, హిందీ, తమిళ, చిత్రాలే కాక ఇతర భారతీయ చిత్రాలను ఉదాహరణలుగా తీసుకుని వివరించడం బావుంది. ఆసక్తి గల బ్లాగర్లు వీటిని ఉపయోగించుకొగలరు. blog URL: http://filmtechniques.blogspot.com/

"అడవిదొంగ","క్రిష్" ల వాసనల్తో రోమాంటిక్ లవ్ & యాక్షన్ స్టోరీతో రూపుదిద్దుకున్న "చిరుత".




టాలీవుడ్ అంచనాలకు అందకుండా రూపొందించాలనే ప్రయత్నంలో భారీ అంచనాలకు తెరలేపిన చిత్రం "చిరుత". చిరంజీవి తనయుని ప్రధమ చిత్రం కావడం, పూరీ జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించడం.. ఇలా అన్నింట్లా భారీతనం ఉట్టిపడుతున్న ఈ చిత్రం యువతే ప్రధాన లక్ష్యంగా నిర్మించిన రోమాంటిక్ లవ్ మరియు యాక్షన్ కథతో రూపుదిద్దుకుంది.


కథాపరంగా పెద్ద భూస్వామి కుమారుడైన చరన్ , చిన్న తనంలోనే దగ్గరివారు చేసిన కుట్రకు బలై తన తల్లిదండృలను కోల్పోవడంతో సినిమా ప్రారంభమౌతుంది. ఆ తర్వాత అడవిలో పెరిగిన చరన్ అక్కడి చిరుతపులితో స్నేహం చేయడం, మొరటుగా పెరిగిన చరన్ అడవి జంతువులలాగా ఎంతదూరమైనా చెట్లపైనుంచి, కొండలపైనుంచి ప్రాకుతూ వెళ్ళడంతోబాటు, మహా బలషాలిగా రూపాంతరం చెందుతాడు. తదితరం జరిగిన కథలో అతని బంధువులు అతని దగ్గరున్న చైన్ మరియు పుట్టుమచ్చలద్వారా అతడిని గుర్తించి, తమకు జరిగిన అన్యాయాన్ని తెలపడం, తమకు అన్యాయం చేసిన వారిపై చరన్ సాక్షాలు దొరకని రీతిలో పోరాడి విజయం సాధించడం ప్రధాన కథాం షంగా, పూర్తి స్థాయి రోమాంటిక్ లూక్స్ తో, డిఫరెంట్ ఫైట్ కంపోజింగ్ లతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. చిరంజీవి నటించిన "అడవిదొంగ" మరియు హృతిక్ రోషన్ నటించిన "క్రిష్" ల వాసనలు బలంగా వీచే "చిరుత"విజయమే లక్ష్యంగా భారీతనాన్ని సముపార్జించుకుని రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల తీర్పుకోసం ఈ నెల 28వ తేదీన పెద్దౌఎత్తున విడుదలకాబోతోంది.

చిరంజీవి తనయుని "చిరుత" స్పెషల్ ఫోటో గ్యాలరీ

టాలీవుడ్ ఎదురుచూస్తున్న "చిరుత" స్పెషల్ ఫోటో గ్యాలరీని "పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్" బ్లాగు వీక్షకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము.














Monday, September 17, 2007

అతీంద్రియ శక్తులు పొందిన కుక్క కథతో అమెరికన్లను అలరిస్తున్న "అండర్ డాగ్" చిత్రం.


ఆకాశంలో రివ్వున ఎగురుతూ, ఆపదలలో ఉన్న వారిని రక్షిస్తూ, తన అతీంద్రియ శక్తులతో దుర్మార్గుల పాలిట సిం హస్వప్నంగా మారిన కుక్క కథ తో నిర్మించిన "అండర్ డాగ్" చిత్రం హాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత నెలలో అమెరికాలో విడుదలైన ఈ సెమీ యానిమేషన్ చిత్రం బాలలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోగా నటించిన కుక్క పేరు "షూ షైన్". ఇది అన్ని కుక్కల్లాగే సాధారణమైనదే. అయితే ఈ సినిమాలోని విలన్ మానవాళిని నాశనం చేయడం కోసం చేస్తున్న ప్రయోగాలలో ఉత్పన్నమైన ఒక ద్రావకం అనుకోకుండా, ఈ కుక్క చేతికి దొరకడంతో కథ మలుపుతిరుగుతుంది. ఈ ద్రవ ప్రభావం వల్ల ఈ కుక్కకు అతీంద్రియ శక్తులు వచ్చి ఇది మనుషుల్లాగే మాట్లాడడం, ఆలోచించడంతోబాటు,గాలిలో ఎగరడం, జరగబోయేదాన్ని పసి గట్టడం చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అమెరికన్లను ఆకర్శిస్తోంది. సూపర్ డాగ్ లా మారి చిన్నారులతోబాటు, పెద్దలనూ ఆకట్టుకుంటున్న ఈ చిత్రం భారత్ లో విడుదల కావడానికి ఇంకా కొంత సమయం పట్టేలావుంది. అమెరికన్ మార్కెట్ మాత్రం ఇటీవల విడుదలైన మంచి కామిక్ చిత్రంగా దీనిని ఆదరిస్తోంది.

నాకూ ఒక్క నెగిటివ్ రోల్ కావాలి : త్రిష.


"ప్రతిభావంతమైన కథానాయికగా ఇప్పటికి నాకు ఉన్న గుర్తింపుతో చాలా సంతోషంగా వుంది, అయితే నాలోని నటిని సంతృప్తి పరిచే పాత్ర ఇంతవరకూ నాకు రాలేదు. నటి రమ్యకృష్ణ రజినీ కాంత్ కు ఆపోజిట్ గా నటించిన "నీలాంబరి" లాంటి పాత్ర నాకూ ఒక్కటైనా దొరికితే బావుణ్ణు, ఎంచక్కా అడిగినన్ని డేట్లు ఇచ్చి మరీ నటించేదాన్నాని" నటి త్రిష తనకు తెలిసినవారిదగ్గరల్లా ఒకటే వాపోతోంది.

ఇంతకూ తనకు కావలసిందల్లా "ఒక్క నెగిటివ్ రోల్" మాత్రమే నంటున్న త్రిషకు, నెగిటివ్ రోల్ చేయడం తన జీవిత లక్ష్యంగా మారిపోయిందని ఇటీవల తమిళ పాత్రికేయులతో ఇంటర్వ్యూలలో సహితం చెబుతోంది. పత్రికా ముఖంగా తన మనసులోని కోరికను చెప్పినా ఇంతవరకు ఏ ఒక్క నిర్మాతా, దర్శకుడూ అలాంటి పాత్రతో తన దగ్గరకు రాలేదని ఇటీవల మళ్ళీ తన మదిలోని కోరికను వెళ్ళగ్రక్కింది త్రిష. ఎవరైనా ఒక్క నెగిటివ్ పాత్రను త్రిషకోసం సృస్టిస్తే బావున్ను. పాత త్రిషను చూసి చూసి మనకూ బోర్ రావడం లేదూ, అందుకే ఓసారి కొత్త లుక్స్ లో త్రిష వుంటే ఎలావుంటుందో చూద్దుము. కాదంటారా...!?.

రెమ్యునరేషన్ పెంచేసిన శ్రియా సరన్







"శివాజి" చిత్రంతో ఆ చిత్ర కథానాయిక పంట పండినట్లైంది. అంతదాకా అందరికీ అందుబాట్లోని కథానాయికగా పేర్గాంచిన శ్రియ ఇప్పుడు చుక్కలను తాకుతోంది.
"శివాజి" చిత్రంతో వచ్చిన క్రేజ్ తో ఆమె ఇప్పుడు తన రెమ్యునరేషన్ ను ఒక్కసారిగా పెంచేసింది. గతంలో 15 నుంచి 20 దాకా వున్న శ్రియ రెమ్యునరేషన్ ఒక్కసారిగా 40దాటిందని తమిళ నిర్మాతలు గోల గోల చేస్తున్నారు. ఇక కమర్షియల్ కార్యక్రమాలకు కూడా శ్రియ తీసుకుంటున్న రెమ్యునరేషన్ బాలీవుడ్ భామినుల స్థాయిలో ఉందని తెలిసింది. ఇటీవల చెన్నయ్ లో జరిగిన ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఏకంగా 10 లక్షలు తీసుకుందని తెలిసింది. ఇది ఓ మోస్తరు నటీమణులు తీసుకునే రెమ్యునరేషన్ కు రెండింతలు. తమిళ నాడు సెక్సీ క్వీన్ నమిత సహితం ఓ కాయక్రమానికి 2 లక్షలు మాత్రమే తీసుకుంటుండగా, శ్రియ ఏకంగా పది లక్షలుతీసుకోవడంతో సదరు చిత్ర నిర్మాతలు శ్రియ తో సినిమా అంటేనే కోలీవుడ్ లో భయపడుతున్నట్లు తెలిసింది.

అమెరికాలో "హ్యాపీడేస్","చిరుత"ల "ఢీ".




టాలీవుడ్ లో క్రేజీని సమకూర్చుకున్న రెండు చిత్రాలు అమెరికాలో పోటీ పడనున్నాయి. చిరంజీవి కుమారుడు రాం చరన్ తేజ్ నటించిన "చిరుత", ప్రతిభావంతుడైన దర్శకుడు శేఖర్ కమ్ముల నూతన చిత్రం "హ్యాపీడేస్" చిత్రాలు అమెరికాలో ఒకేరోజు విడుదల అవుతున్నాయి. అమెరికాలో టాలీవుడ్ హీరో శేఖర్ కమ్ముల. అతని గత చిత్రాలు అమెరికాలో పెద్ద హీరోల చిత్రాల కలెక్షన్లను మించి రికార్డు సృష్టించాయి. "ఆనంద్", "గోదావరి" చిత్రాలు నింపాదిగా సాధించిన కలెక్షన్లను చిరంజీవి చిత్రాలు సహితం అతి కష్టంగా సాధించగలిగాయంటే శేఖర్ కమ్ముల అమెరికా మార్కెట్ స్థాయి ఏమితో తెలుస్తోంది.

ఇక మార్కెటింగ్ పరంగా "హ్యాపీడేస్" చిత్రంపై అమెరికాలో స్పష్టమైన అంచనాలు ఉన్నాయి. అయితే రాం చరన్ తేజ్ నటించిన "చిరుత" చిత్రం పబ్లిసిటీ పరంగా చాలా వెనుకబడి ఉంది. ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అధికారికమైన సమాచారం అమెరికాలో పత్రికలవారికిగానీ, లేక అభిమానులకుగానీ అందుబాటులో లేక పోవడం ఈ చిత్రానికి ప్రస్తుతానికి మైనస్ పాయింట్ గానే చెప్పవచ్చు. నిజానికి "చిరుత" దర్శక, నిర్మాతలు ప్యూహాత్మకంగానే ఈ చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీని నిలిపి ఉంచినప్పటికీ, ఇది ఈ చిత్రానికి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది చిత్రం విడుదలవుతేగానీ తెలీదని సినీ పరిశీలకులు అంటున్నారు. కనుక అమెరికాలో ఈ రెండు చిత్రాలమద్యన రసవత్తర పోటీ తధ్యమని తెలుస్తోంది. కాగా, ఇక్కడ దేశవ్యాప్తంగా "చిరుత" చిత్రం ఈ నెల 28న విడుదల అవుతుండగా, "హ్యాపీడేస్" చిత్రం మాత్రం అక్టోబర్ 2న విడుదల అవుతోంది. అమెరికాలో మాత్రం రెండూ ఒకే రోజున, ఈ నెల 28న విడుదల అవుతున్నాయి.
చివరగా చిన్న కొసమెరుపు. గతంలో చిరంజీవి నటించిన "శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్." చిత్రం, శేఖర్ కమ్ముల "ఆనంద్" చిత్రం ఒకేరోజు విడుదలవగా రెండు చిత్రాలూ 100రోజులు పూర్తి చేసుకున్నాయి. కాగా అమెరికాలో "ఆనంద్" చిత్రాన్ని ఎదుర్కోవడానికి చిరంజీవి చిత్ర పంపిణీదారులు చాలా శ్రమపడినట్లు తెలిసింది. మరి ఇప్పుడు ఈ రెండు చిత్రాల పోటీ ఏ చిత్రానికి లాభం చేకూరుస్తుందో, మరే చిత్రాన్ని దెబ్బతీస్తుందో కాలమే చెప్పాలి.

అభిమానుల కోసం బాలయ్య పెయింటింగ్ ఫోటో


బాలీవుడ్ కథానాయిక నిషా కొఠారీ లేటెస్ట్ ఫోటో సెషన్ లోంచి కొన్ని ఫోటోలు.











Friday, September 14, 2007

నీటిలో తడవడమంటే నాకు భలే ఇష్టం-త్రిశ. నాక్కూడా-స్నేహ,నమిత,సునితా వర్మ,అను మెహతా...!?(ఫోటో గ్యాలరీ)






















హీరోయిన్లు లేకుంటే ఆ సినిమా ఫెయిల్ కావల్సిందే-కమలినీ ముఖర్జీ.




ఎంతటి స్టార్లున్న చిత్రమయినా అందులో హీరోయిన్లు లేకుంటే ఆ చిత్రం పరాజయం పాలవుతుందని తెలుగు, తమిళ చిత్రాల కథానాయిక కమలినీ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. సినిమాల విజయానికి హీరోయిన్ల ప్రాధాన్యత చాలా వుంటుందని ఆమె అన్నారు.

ఇటీవల చెన్నైలో పత్రికలవారితో మాట్లాడుతూ,కమల్ హాసన్, తను, జ్యొతికలు ప్రముఖపాత్రలలో నటించిన "వేట్టైయ్యాడు విళైయాడు" చిత్రం, తెలుగులో డబ్ చేయబడి "రాఘవన్" పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించిందని, ఆచిత్రంలో తన నటనను అందరూ పొగుడుతున్నారని, తనకు లెక్కకు మించిన అభినందనలు వస్తున్నాయని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా చిత్ర విజయంలో తన పాత్ర చాలా కీలకమని, ఒక విధంగా కథానాయికలు చిత్ర విజయంలో ప్రముఖ పాత్ర వహిస్తారని ఆమె అన్నారు. ఇక ముందు, ముందు కూడా అభినయ ప్రాధాన్యమున్న పాత్రలను పోషిస్తానని, ఆ అభినయ ప్రాధాణ్యత అన్నిరకాల పాత్రలకు ఉంటుందని, అవసరమయితే శృంగార పాత్రల్లో కూడా నటించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

బాలకృష్ణ "ఒక్క మగాడు" ఫోటో గ్యాలరీ











బాలకృష్ణ "ఒక్క మగాడు" ఆడియో, శాటిలైట్ హక్కులకోసం "రెండు పేటీ"ల భారీ ఆఫర్లు.







నటకిషోరం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం "ఒక్కమగాడు" కు ఆడియో, శాటిలైట్ హక్కుల కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయి. దర్శక,నిర్మాత వై.వి.యస్.చౌదరి తన స్వంత "బొమ్మరిల్లు" పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం పై అన్ని విభాగాలలో భారీ అంచనాలే ఉన్నాయి.
ముఖ్యంగా వై.వి.యస్.చౌదరి పాటలకు మంచి క్రేజీ ఉంటుంది. పాటల చిత్రీకరణలో, సాహిత్యం పొందుపరచుకోవడం లో చౌదరి విభిన్న బాణీని అనుసరిస్తాడు. దాంతో గత చిత్రాలు కూడా ఆడియో పరంగా మంచి విజయాన్ని సాధించాయి. అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ, వై.వి.యస్ ల కలయిక కావడం తో సహజంగానే అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం అన్ని ఆడియో కంపనీలు ఈ చిత్రంపై రెండు కోట్లదాకా పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూయిస్తున్నాయని తెలిసింది. ఇక శాటిలైట్ హక్కులకోసం ప్రముఖ స్థానంలో ఉన్న రెండు ఛానెళ్ళు "రెండు పేటీ" ల ఫ్యాన్సీ ఆఫర్ ను ఇచ్చాయని తెలిసింది. సహజంగా శాట్లైట్ హక్కులకు 1.5 కోట్ల నుంచి 1.75 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి శాటిలైట్ కంపనీలు ముందుకు వస్తాయి. కానీ ఇప్పుడు బాకకృష్ణ చిత్రానికి "రెండు పేటీల(రెండు కోట్ల)" ఆఫర్ అటు ఆడియో హక్కుల పరంగా, ఇటు శాటిలైట్ హక్కుల పరంగా రావడం తో దర్శకనిర్మాత వై.వి.యస్ సంతోశంగా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ చిత్రం అక్టోబర్ చివరిదాకా షూటింగ్ లోనే ఉంటుంది. బాలకృష్ణ సంక్రాంతి చిత్రాల విజయాల సెంటిమెంట్ లో భాగంగా ఈ చిత్రాన్ని జనవరిలో మాత్రమే విడుదలచేసే ఆలోచనలో చౌదరి ఉన్నట్లు తెలిసింది.

Thursday, September 13, 2007

మహేశ్ బాబుకు తమిళ నాడులో పెరుగుతున్న డిమాండ్


యంగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తమిళ నాడులో డిమాండ్ పెరుగుతోంది.
మహేశ్ బాబు నటించిన "పోకిరి", "మురారి","సైనికుడు" తదితర చిత్రాలు తెలుగులో అక్కడ విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అలాగే మహేశ్ బాబు నటించిన అనేక చిత్రాలను తమిళ నాడు క్రేజీ స్టార్ విజయ్ తో రీమేక్ చసారు. అవికూడా అక్కడ మంచివిజయాన్ని సాధించాయి. ఇటీవలి "పోకిరి" అదే పేరుతో విజయ్ తో రీమేక్ చేయగా అది అక్కడ సంచలన విజయం సాధించి 200రోజులు ప్రదర్శింపబడింది. ఇక మహేశ్ బాబు నటించిన "అతడు"తో సహా మరికొన్ని చిత్రాలు తమైళం లో డబ్బింగ్ చిత్రాలుగా విడుదలై విజయాన్ని సాధించాయి. దాంతో తమిళ నిర్మాతల, దర్శకుల దృష్టి మహేశ్ బాబుపై పడింది.తమ చిత్రాలలో నటించాల్సిందిగా పలువురు అడుగుతున్నారు. గతంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన "యువ" చిత్రంలో నటించాల్సిందిగా మహేశ్ బాబును ఆయన అడగగా డేట్ల సమస్య వచ్చి ఆ చిత్రం లో మహేశ్ బాబు నటించలేదు.ఇప్పుడు కొత్తగా తమిళ దర్శకులు లింగుస్వామి, గౌతం మీనన్ లు మహేశ్ బాబును తమిళ చిత్రం కోసం అడిగినట్లు తెలిసింది. అయితే ఆ అవకాశాన్ని త్రోసిపుచ్చకుండా వేచిచూసే ధోరణిలో మహేశ్ బాబు ఎలాంటి సమాధానాన్ని ఇవ్వలేదని తెలిసింది. అయితే ప్రస్తుతం యు.టి.వి, వైజయంతి మూవీస్, సుమంత్ ఆర్ట్ క్రియేషన్స్ సహా ఆరు చిత్రాలు చేతిలో ఉండటం వల్ల తమిళ చిత్రాలను ఒప్పుకోవడం లేదని సమాచారం.

"దశావతారం"చిత్రంలో కమల్ హాసన్ "నవ" అవతారాలు (ఫోటో గ్యాలరీ)



పద్మభూషణ్ కమల్ హాసన్ నటిస్తున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం "దశావతారం" పై ప్రేక్షకులలో అనేక అంచనాలు ఉన్నాయి. తన ప్రతి చిత్రంలో విభిన్నత కోసం తపనపడే కమల్ హాసన్ నటించిన ఈ చిత్రంలోని "నవ" అవతారాలు ఎలా ఉంటాయనే అంశంపై సినీ పరిశ్రమ, ప్రేక్షకులలో అనేక సందిగ్దాలు ఉన్నాయి. సినీ పరిశ్రమతో సహా వీటిలో కొన్ని అవతారాల ఫోటోలు ఎలా వుంటాయో చాలా మందికి తెలియదు. ఈ చిత్ర టెక్నీషియన్లకు మాత్రమే తెలిసిన వీటి గుట్టు ఇప్పుడు మీముందుంది. "దశావతారం" చిత్ర "నవ" అవతారాల చిత్రమాలిక మీకోసం. మిగిలిన ఒక్క అవతారం లో కమల్ హాసం డెబ్బై ఏళ్ళ పండుముసలి స్త్రీగా నటిస్తున్నాడు. ఈ ఒక్క చిత్రం యొక్క ఫోటో ఫైనలైజేషన్ ఇంకా కాలేదు. ఇందుకు సంబధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.



























































Wednesday, September 12, 2007

పవర్ స్టార్ పవన్ కల్యాన్ "స్టిల్ ప్లీజ్" ఫోటో గ్యాలరీ.











హేమ మాలినితో మా నాన్నది అక్రమ సంబంధం-రిషి కపూర్.


ప్రముఖ నటి హేమ మాలినితో మా నాన్నకు ఉన్న అక్రమసంబంధంవల్ల మేము 5నెలలు నరకాన్ని అనుభవించామని ప్రముఖ బాలీవుడ్ నటుడు, స్వర్గీయ రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ వ్యాఖ్యానించారు. ఇటీవల హేమ మాలిని విడుదలచేసిన ఆటోబయోగ్రఫీలో తన తండ్రిని పబ్లిసిటీ పిచ్చి వాడని వ్యాఖానించడాన్ని ఆయన వ్యతిరేకించారు. హేమ మాలిని వల్ల తమ కుటుంబం నరకం అనుభవించిందని తెలిపాడు. రాజ్ కపూర్ తో తనది స్నేహపూర్వక బంధమని, అందుకే రాజ్ కపూర్ తనను విహారయాత్రలకు సహితం తీసుకువెల్లేవాడని ఆమె తన పుస్తకంలో వ్యాఖ్యానించడాన్ని, రిషి కపూర్ తప్పుబట్టారు. వారిద్దరి మద్యన ఉన్నది స్నేహం కాదని, ఆమె హిందీ హీరోయిన్ అయిన తొలినాళ్ళలోనే తన తండ్రిని ఆకర్శించి, ఆయనను తన వలలో వేసుకుందని తెలిపారు. ఆమె ఆకర్షణలో ఉన్న తన తండ్రితో ఓకె అనిపించుకుని ఆమె మాయింటికే వచ్చి తిష్ట వేసిందని, దాంతో తమ కుటుంబం మొత్తం ఐదు నెలలపాటు హోటల్ లో గడపాల్సి వచ్చిందని తెలిపారు. నాటి సంఘటనలు ఇంకా నాస్మృతిపథంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ముంబై కి చెందిన కొన్ని వెబ్ సైట్లు సహితం దృవీకరించాయి.

ఛార్మీ, దేవి శ్రీ ప్రసాద్ ల ప్రేమ కథ సుఖాంతమౌతుందా...?.




ఏమో ఎవరికి తెలుసు. అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు, కానీ ఛార్మీ, దేవి శ్రీ ప్రసాద్ ల పెళ్ళి స్వర్గంలో జరగలేదేమోననే అనుమానాలు ప్రస్తుతం టాలీవుడ్ లో వ్యాపించాయి. నటి ఛార్మీ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ లు ఒకప్పుడు ఒకరికి ఒకరం అనుకుంటూ టాలీవుడ్ లో ఎక్కడ చూసినా వారే కనిపించారు. కొన్ని మార్లు సినిమా ఫంక్షన్ లలో, పార్టీలలో కూడా దర్షణమిచ్చిన వీరి ప్రేమకథను సుఖాంతం చేయాలని చార్మి తండ్రి రచయిత సత్యమూర్తి దేవి శ్రీ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెలితే అక్కడ "నో" అనే సమాధానం వచ్చిందని టాలీవుడ్ లో ఒకటే గోల. అయితే ఇప్పుడిప్పుడే మ్యూజిక్ నుంచి కథానాయకునిగా కూడా మారుతున్న దేవి శ్రీ ప్రసాద్ కొన్నాళ్ళు పెళ్ళిని వాయిదావేయడానికి ప్రయత్నిస్తున్నాడని, దాంతో ఛార్మీ తండ్రికి "నో" చెప్పినట్లు తెలిసింది. దాంతో భాధపడిన ఛార్మీ ఏవిషయంపై ఆసక్తిగా ఉండకుండా ఎప్పుడూ పరధ్యానంగా ఉంటున్నట్లు తెలిసింది.

చిన్ననాటి త్రిశ ( త్రిశ పర్సనల్ ఫోటో గ్యాలరీ)





























అక్టోబర్ 2న కొత్త పార్టీని ప్రకటించనున్న చిరంజీవి.


చిరంజీవి రాజకీయ ప్రవేశం విషయంలో ఇన్నాళ్ళూ పేరుకుపోయిన నిశ్శబ్ధాన్ని అక్టోబర్ 2వ తేదీన ఛేదించదానికి రంగం సిద్దమవుతోంది. అందిన సమాచారం ప్రకారం కొంతమంది ఎన్.ఆర్.ఐ.ల సహకారం, కొన్ని స్థానిక రాజకీయ శక్తుల ప్రమేయంతో చిరంజీవి కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం దాదాపు ఖరారైంది. దానికి ముహూర్తంగా అక్టోబర్ 2వ తేదీని ఎంచుకున్నట్లు తెలిసింది.

ఆ రోజు జరగనున్న గాధీ జయంతి సందర్భంగా చిరంజీవి, కొత్త పార్టీని ప్రకటించడంతోబాటు, స్థానిక తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. అలాగే తమ పార్టీ కులాల ప్రాతిపదికలో పనిచేయదని, కులరహిత, మతరహిత సభ్య సమాజం లక్ష్యంగా తమ కొత్త పార్టీ పనిచేస్తుందని చిరంజీవి ప్రకటించడంతోబాటు, తమ రాజకీయ ప్రాతిపదికను తెలియజేయనున్నట్లు తెలిసింది. భవిష్యత్ రాజకీయ లక్ష్యాలను ఏర్పాటు చేయకన్నా ముందు కొన్ని తాత్కాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించడంకోసం చిరంజీవి యువత పనిచేయవలసిందిగా చిరంజీవి పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నెన్నో రూమర్లు ప్రచారంలో ఉండగా చిరంజీవి కదలికలను గమనిస్తున్న పాత్రికేయులు, కొన్ని వెబ్ సైట్లు మాత్రం చిరంజీవి రాజకీయ ప్రవేశం అక్టోబర్ 2తో ముడిపడి ఉందని వెళ్ళడిస్తున్నాయి. చివరికి అక్టోబర్ 2న ఏం జరుగుతుందో వేచిచూద్దాం.

హాలీవుడ్ నా టార్గెట్ : ఆసిన్







తెలుగు, తమిళ, మళయాల చిత్ర పరిశ్రమల్లో అగ్ర శ్రేణి కథానాయికగా కొనసాగుతున్న నటి ఆసిన్ ఇటీవలి "గజిని" చిత్రం ద్వారా హిందీలోకి సహితం అడుగుపెట్టింది. తమిళ చిత్రంలో తన నటనను చూసి మెచ్చుకున్న అమీర్ ఖాన్ ఏరికోరి తననే హిందీ "గజినీ" లోకి ఎన్నుకున్నాడని సంతోషంతో పొంగిపోతున్న ఆసిన్ తనకు మాత్రం "హాలీవుడ్" లక్ష్యమని తెలియజేసింది. ఇటీవలే ఓ ఇండో జపాన్ చిత్రంలో నటించమని అడుగుతున్నారని, సాధ్యాసాధ్యాలను గమనిస్తున్నానని పత్రికలవారికి తెలియజేసింది. ఉత్తరాదిలో ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా తన ఓటు మాత్రం దక్షిణాదికేనని చెబుతున్న ఆసిన్ కు లోలోన మాత్రం బాలీవుడ్ లోనో లేక హాలీవుడ్ లోనో సెటిల్ కావాలని ఉందని తెలిసింది.

Monday, September 10, 2007

రజినీ కాంత్, మణిరత్నంల చిత్రంలో నటిస్తూ నిర్మించనున్న కమల్ హాసన్.

ఒక్కోసారి మంచి కాంబినేషన్ల కలయిక సగటు ప్రేక్షకునికి ఆనందాన్ని కలిగిస్తుంది. తెలుగు నాట మల్టీ స్టారర్ చిత్రాల విశయంలో ఆశించదగ్గ పరిణామం చోటుచేసుకోవడం లేదు కానీ, తమిళ నాట ఓ భారీ ప్రయత్నానికి అంకురార్పణ జరిగింది. తమిళ నాట తిరుగులేని కథానాయకులైన రజినీ కాంత్, కమల్ హాసన్ లు ఒకే చిత్రంలో కలిసి నటించనున్నారు.ఈ భారీ చిత్రం ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. దీనికి సంభంధించిన ప్రాధమిక కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఇక షూటింగ్ మాత్రమే మిగిలింది. అయితే ఈ చిత్రాన్ని తానే నిర్మించదలచినట్లు కమల్ హాసన్ దర్శకుడు మణిరత్నంతో చెప్పినట్లు తెలిసింది. నిజానికి మణిరత్నమే ఈ చిత్రాన్ని తన స్వంత "మద్రాస్ టాకీస్" బ్యానరుపై చిత్రించాలని అనుకున్నారు. కాగా కమల్ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. రజినీ కాంత్, కమల్ హాసన్ లు కలిసి నటించడం దాదాపు ఖాయమేనని కోలీవుడ్ తెలిపింది. ఇటీవలే రజినీ కాంత్, కమల్ హాసన్ లు కమల్ హాసన్ ఇంట్లో కలుసుకుని ఏకాంతంగా మాట్లాడుకోవడం కోసం కమల్ కారులో కలిసి ఓ కల్యాణ మండపం ఆఫీసుకు వెల్లి చాలాసేపు మనసులు విప్పి మాట్లాడుకున్న తర్వాత కలిసి నటించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తమిళ పత్రికలు సహితం దృవీకరించడ తో తమిళ నాట రజినీ కాంత్, కమల్ హాసన్ ల భారీ చిత్రం నిజమేనని తేలింది.ఇందులో రజినీ కాంత్ సరసన ఐశ్వర్య రాయ్ కథా నాయికగా దాదాపు ఖరారైంది. ఇక మిగిలిన తారాగనం ఎన్నిక పూర్తయితే షీటంగ్ మాత్రమే పెండింగ్ ఉంటుందని తెలిసింది.

అమీర్ ఖాన్ చిత్రానికి మెగా స్టార్ చిరంజీవి క్లాప్











బాలీవుడ్ సంచలనం అమీర్ ఖాన్ కొత్తగా నటిస్తున్న "గజిని"చిత్రానికి మెగా స్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు.
తమిళంలో నిర్మింపబడి అక్కడా, తెలుగులో అనువాదమై ఇక్కడా సంచలన విజయం సాధించిన "గజిని" చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో ఆల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ముంబాయిలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, ఆసిన్ లు జంటగా నటిస్తున్నారు. ఆ సందర్భంగా తీసిన ముహూర్తపు ఫోటోలను ఇక్కడ ఇస్తున్నాం.

పబ్బుల్లో బీరు త్రాగడమంటే బలే సరదా: అమీషా పటేల్.










బాలీవుడ్ భామిని అమీషా పటేల్ కు పబ్బుల్లో బీరు త్రాగడమంటే భలే సరదాగా ఉంటుందని ఆమే స్వయంగా తెలిపింది. మన కోరికలను ఎవరికోసమో దాచుకోనక్కర్లేదని చెబుతున్న అమీషా ఫుల్లుగా త్రాగి తూలుతూ వెల్తుంటే ఆ మజాయే వేరని చెప్పడం బాలీవుడ్ లో సంచలనమే లేపింది.




అంతే కాకుండా మన డ్రెస్సింగ్ కూడా మన ఇష్టానుసారంగా వుండాలే తప్ప ఎవరో చెబితే అవన్నీ వేసుకోవడం తనకు చికాకు కలిగిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని బాలీవుడ్ వెబ్ సైట్లు ప్రముఖంగా ప్రస్తావించడంతోబాటు ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు అమీషా ఓ ప్రముఖ పబ్బులో మంచి పార్టీలో వుందని తెలిపాయి. ఈ ఫోటోలు చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా తెలుస్తూనే వుందిలావుంది.

"మల్లన్న" గా వస్తున్న విక్రం.


యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్రం తన తదుపరి చిత్రంలో "మల్లన్న" గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన "కందస్వామి" తెలుగులో "మల్లన్న"గా పేరు మార్చుకుని మన ముందుకు రానుంది.
విక్రం ఇంతక్రితం నటించిన "భీమ" ఆర్థికపరమైన ఇబ్బందులవల్ల ఇంకా విడుదల కాకముందే తదుపరి చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి సంభంధించిన డబ్బింగ్ పనులు కొనసాగుతుండగా, చివరి షెడ్యూల్ మరో రెండు రోజులలో పూర్తవుతుందని తెలిసింది. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుసి గణేషన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర పాటలలను వచ్చే వారంలో విడుదల చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో విక్రం సరసన శ్రేయ కథానాయకిగా నటించింది.

పాప్ సింగర్ మారియా కేరీ ఆవిరి స్నానం.









పాప్ సింగర్ మారియా కేరీ ప్రతి రోజు తప్పనిసరిగా కొన్ని గంటల పాటు తన కంఠానికి ఆవిరి స్నానం చేయించడం తన దిన చర్యగా పెట్టుకుంది.
తన సహ గాయకుడు లూథర్ వాండ్రోస్ ఇచ్చిన సలహా పాఠిస్తూ ఆమె తన గాత్ర శుద్దికి ఈ పని చేస్తున్నట్లు ఆమె పత్రికలవారికి చెప్పింది. ఆ సలహా ఏమిటంటే ప్రతి నిత్యం ఎవరైనా కనీసం కొన్ని గంటలపాటు తమ కంఠాన్ని ఆవిరిలో ఉంచితే వారి గాత్రం అత్యంత మాధుర్యంగా తయారవుతుందనేదే. అయితే ఈ కంఠ స్నానానికన్నా ముందు తాము తప్పకుండా నురగ స్నానంలో మునిగి తేలాలని మరో అనుభంధ సలహాను కూడా ఈయన ఇచ్చినట్లు తెలిసింది. ఆ సలహా నచ్చిన ఈ చక్కనమ్మ వెంటనే ఆ సలహాను అమలులో పెట్టింది. దాంతో హాలీవుడ్ పత్రికలవారికి కావలసినంత సమాచారం దొరికి ఆవిరి స్నానంపై ప్రత్యేక కథనాలను ప్రచురించడంలో నిమగ్నమయ్యారని తెలిసింది. ఇక ఈవిడ గారి అభిమానులైతే ప్రత్యేకంగా బ్యూటీ పార్లర్లకు వెళ్ళి "ఆవిరి కంఠ స్నానం అలాంగ్ విత్ నురగ స్నానం" అంటూ ఆర్డరేస్తున్నట్లు వినికిడి.

చిరంజీవి 149వ చిత్రం దర్శకునిగా ఎన్నికైన కృష్ణవంశి


చిరంజీవి 150వ చిత్రం "ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి" ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ప్రస్తుత తరుణంలో అతని 149వ చిత్రం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. 150వ చిత్రానికి చిరంజీవి స్వయంగా దర్శకత్వం వహించడం ఖాయమైంది. ఈ లోగా నిర్మించే 149వ చిత్రానికి దర్శకుని వేట, ఆ అవకాశంకోసం ప్రముఖ దర్శకులంతా ప్రయత్నాలు చేయడం ఆసక్తిని కలిగించింది.చివరికి ఈ అవకాశాన్ని క్రియేటివ్ దర్శకునిగా పేర్గాంచిన కృష్ణవంశి దక్కించుకున్నారని తెలిసింది. అయితే ఈ అవకాశం ఇంకా ఎవరికీ ఇవ్వలేదని చిరంజీవి తరుపువారు అంటుండగా, అదేం కాదు, ఈ అవకాశం కృష్ణవంశీకి ఇవ్వడంపై చిరంజీవి సానుకూలంగా స్పంధించడంతోబాటు, కృష్ణవంశి, మరియు అతని తమిళ రచయిత త్రయంలతో ఇప్పటికే కథా రూపకల్పనలో అయిదుకుపైగా సిట్టింగ్లలో పాలుపంచుకున్నారని, వారు తయారు చేసిన కథ చిరంజీవిని బాగా ప్రభావితంచేసిందని స్పష్టంగా తెలిసింది. కాగా మరో వైపు "ఠాగూర్" చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్ తన ప్రయత్నాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉనండడం కొసమెరుపు.

హీరో వెంకటేశ్ కొత్త చిత్రం "తులసి" ఫోటో గ్యాలరీ.







Saturday, September 8, 2007

వైవిధ్యాన్ని కోరుకునే ఏంజిలినా జోలి ఎప్పుడూ సంచలనమే.




కొంతమందికి సంచలనాలంటే భయం. మరి కొంతమందికి సంచలనాలే ప్రాణం. హాలీవుడ్ సంచలన తార ఏంజిలినా జోలి సంచలనాలకు ఎప్పుడూ అగ్ర పీఠం వేస్తారు. వివాదాలను తలకెత్తుకోవడానికి, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికే కాదు ఇతర సెలబ్రిటీలలాగా వీలుచిక్కితే విహార యాత్రలకు వెళ్ళడాన్నీ ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో శరణార్తులకు చేయూతనివ్వాలని కొత్త సందేశాన్ని ఇస్తూ తను ముందుగా ఆ పని చేసి ముందుకు నడుస్తున్నారు.
ఐక్యరాజయ సమితికి "గుడ్ విల్ " దౌత్యవేత్తగా పనిచేస్తున్న ఏంజిలినా ప్రపంచానికి పెద్దగా తెలియని కొన్ని అట్టడుగు దేశాలకు వెల్లి నిరుపేదలను కలుసుకుని వారికి చేయూతనిస్తున్నారు. తన కమ్మని మాటలతో ఆర్తులకు సేదదీరుస్తూ వారికి మనోధైర్యాన్ని, భవిశ్యత్తు పట్ల నమ్మకాన్ని కలిగిస్తున్నారు. నిరుపేదలైన శరణార్తులకు మానసిక, శారీరక, ఆర్థిక స్వాతంత్ర్యం కలిగినప్పుడే వారు నిజమైన స్వేచ్చను అనుభవిస్తారని చెబుతూ తన అనుభవాలను ఐక్యరాజ్య సమితికి సమర్పిస్తున్నారు. తనలాగే ఇతర సెలబ్రిటీలు కూడా నిరుపేదలకు సేవచేస్తే బావుంటుందని, మనం కూడా ఓ ఆత్మ సంతృప్తిని పొందుతామని అంటున్నారు. ఇది నిజంగా మంచి ఆలోచన.

ఎం.ఎఫ్.హుస్సేన్ "బొమ్మ" అమృతా రావు తో శ్యాం బెనెగల్ కొత్త చిత్రం.




ప్రఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ చిత్రంతో తన నట జీవితానికి శాశ్వతత్వాన్ని పొందిన నటి అమృతా రావు కొత్తగా ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్ దర్శకత్వం వహిస్తున్న ఓ కొత్త చిత్రంలో అవకాశాన్ని సాధించారు.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో ఆమె శ్రేయాస్ తల్పాడే సరసన నటిస్తారు. ఈ అవకాశం రాగానే మారు మాట్లాడకుండా ఒప్పుకున్న అమృతా రావు ప్రస్తుతం శ్యాం బెనెగల్ నిర్వహిస్తున్న శిక్షణ శిభిరానికి హాజరవుతున్నారు. ఈ చిత్రం త్వరలోనే తెరకెక్కనుంది.

టాలీవుడ్ హాటెస్ట్ గర్ల్ అనుష్క ఫోటో గ్యాలరీ











మోజర్ బేర్ సంస్థతో మూడు తమిళ చిత్రాల నిర్మాణానికి ప్రకాశ్ రాజ్ ఒప్పందం.

ప్రముఖ తెలుగు, తమిళ నటుడు ప్రకాశ్ రాజ్ కు సంభంధించిన "డ్యూయెట్ మూవీస్" సంస్థతో కార్పోరేట్ సంస్థ "మోజర్ బేర్ " మూడు చిత్రాల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో తమిళంలో ప్రకాశ్ రాజ్ నిర్మించిన "అళగియదేగే", "పొయ్","మొళి" చిత్రాలు తమిళ నాట మంచి విజయాన్ని సాధించాయి. దాంతో మోజర్ బేర్ సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా ప్రకాశ్ రాజ్ సహనిర్మాణత్వంలో మొజర్ బేర్ సంస్థ "వెళ్ళితిరై", "అభియుం నానుం", "మయిల్" అనే మూడు చిత్రాలను ఏక కాలంలో నిర్మిస్తుంది. వీటిలో "వెల్లితిరై" చిత్రంలో ప్రకాశ్ రాజ్, పృథ్వి రాజ్ లు ప్రధాన పాత్ర ధారులుగా విజ్జి దర్శకత్వంలో, రెండవదైన "అభయుం నానుం" చిత్రంలో ప్రకాశ్ రాజ్, త్రిష లు నాయికానాయకులుగా రాధా మోహన్ దర్శకత్వంలో, మూడవదైన "మయి" చిత్రాన్ని మొత్తం కొత్తవారితో, జీవన్ దర్శకత్వంలో నిర్మిస్తారు.

Friday, September 7, 2007

మీ సినిమాలలో మొత్తం చెత్తే : తనకు వచ్చిన "ఎస్.ఎం.ఎస్" తో షాక్ తిన్న రాంగోపాల్ వర్మ.





ఇటీవల రాంగోపాల్ వర్మ నిర్మించిన సినిమాలతో విసిగి పోయిన ఓ ప్రేక్షకుడు నేరుగా ఆయనకే ఎస్.ఎం.ఎస్ ద్వారా తన సందేశాన్ని పంపించి ఆయనను షాక్ కు గురి చేసినట్లు తెలిసింది. క్రియేటివిటీ అనేదే లేకుండా తను నిర్మిస్తున్న చిత్రాలలో అంతా పాత కంపు తప్ప కొత్తదనమేమీ లేదని సగటు ప్రేక్షకుడు తన ఆవేదనను రాంగొపాల్ వర్మ కే పంపించాడు. ఆ ఎస్.ఎం.ఎస్ ను యధాతతంగా ఇక్కడ అందిస్తున్నాం.



"Hi Sir. To call Aag a piece of junk would be demeaning junk. What happened to the colours of Rangeela and the grit of Satya? No clear story, meaningless script, obsession with dark lighting, weak screenplay, and songs that are too high-pitched and outdated. You were in a hurry while shooting. Fast editing, nonsensical expressions, no romance, horrifying background music and choreography, cinematography is horrid, bad clothes, bad hoardings, bad amateurish dialogues, bad characterizations with no emotional graph for the characters,leaving the actors free to ham,outdated action, emotionless scenes, no comedy, no colour. You should sit and watch your film alone. No freshness, carelessness in creativity. You've become over-confident and you are losing touch with reality. You're handing over creative work to the wrong people. You're impulsively doing ten films at a time and not focusing on one project. You've enjoyed the shooting without caring about what the outcome would be. You're busy giving stupid interviews. What have you done in the past seven years except a couple of notable films?"

లారెన్స్ దర్శకత్వంలో నటించనున్న మహేశ్ బాబు



డ్యాన్స్ మాస్టర్ నుంచి దర్శకునిగా మారిన లారెన్స్ తన తదుపరి చిత్రంలో మహేశ్ బాబుకు దర్శకత్వం వహించనున్నాడా?.
అందిన సమాచారం ప్రకారం అదే నిజమని తేలింది. మరోవైపు మహేశ్ తన తదుపరి చిత్రానికి కూడా తమ స్వంత సంస్థలైన "కృష్ణా ప్రొడక్షన్స్" లేదా "ఇందిరా ప్రొడక్షన్స్" లలో నటించవచ్చనే సమాచారం అందింది. దాంతో మహేశ్ నటిస్తాడనుకున్న తదుపరి చిత్రాలు "మిర్చి" ,"హరే రామ హరే క్రిష్ణ" లు ఇంకా ఆలస్యం జరగవచ్చనే వార్త వినిపిస్తోంది. ఏదేమైనా మహేశ్ లారెన్స్ దర్శకత్వంలో నటించడం దాదాపు ఖాయమేనని టాలీవుడ్ సమాచారం. ఇటీవల లారెన్స్ మహేశ్ బాబును కలిసి చెప్పిన కథ అతన్ని బాగా ఇంప్రెస్స్ చేయడంతో దానిని యు.టి.వి.సహకారంతో తమ మాతృ సంస్థలో నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాను రమేశ్ బాబు కానీ, లేక మంజుల కానీ నిర్మించవచ్చు. అధికారికమైన సమాచారం అతి త్వరలోనే పద్మాలయా స్టూడియోస్ వైపునుంచి అందుతుందని టాలీవుడ్ సమాచారం.

డాక్టర్ చిరంజీవి ఫోటోగ్యాలరీ






గ్లామర్ క్వీన్ ప్రియామణి ఫోటోగ్యాలరీ.











ఉత్తమనటులుగా రజినీ, కమల్ లకు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు.




తమిళనాడు ప్రభుత్వం ప్రతిసంవత్సరం ఇచ్చే ప్రభుత్వ అవార్డులలో 2005,06 సంవత్సరాలకుగాను రజినీ కాంత్, కమల్ హాసన్ లను ఉత్తమ నటులుగా ప్రభుత్వం ఎన్నుకుంది."చంద్రముఖి" చిత్రానికిగాను రజినీ కాంత్ కు, "వేట్టైయ్యాడు విళైయ్యాడు" చిత్రానికి గాను కమల్ హాసన్ లను ప్రభుత్వం ఎన్నుకుంది. అలాగే ఉత్తమ నటికి ఇచ్చే అవార్డులకు గాను జ్యోతిక, ప్రియామణి లను ఎన్నుకుంది. కాగా 2005 సంవత్సరానికిగాను ఉత్తమ చిత్రాలుగా "చంద్రముఖి", 'గజిని" చిత్రాలకు, 2006వ సంవత్సరానికిగాను "వెయిల్" చిత్రాన్ని ఎన్నుకుంది.

Thursday, September 6, 2007

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రేయా సరన్ ఫోటోగ్యాలరీ.








రజినీ కాంత్, ఐశ్వర్య రాయ్ లతో మణిరర్నం కొత్త సినిమా.




అఖండ పేరు ప్రఖ్యాతులు తీసుకు వచ్చిన "శివాజీ" చిత్రం తరువాత రజినీ కాంత్ నటించే కొత్త చిత్రంపై ఉన్న స్థంభన దాదాపు తొలిగిపోయింది. "శివాజీ" వల్ల వచ్చిన పేరును ఉపయోగించుకుంటూ అంతకు మించిన ప్రాజెక్ట్ లో నటించాలని ఇన్నాళ్ళూ భావిస్తున్న రజినీ కాంత్ తన తదుపరి చిత్ర భాధ్యతను ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు అప్పచెప్పాడు.
కథ ఖచ్చితంగా "నాయకన్", "దళపతి" చిత్రాల తరహాలో అంతకు మించిన కథా, కథనాలతో ఉండాలని చెప్పడంతో ఇన్నాళ్ళూ కథ రూపకల్పనపైనే దృష్టి సారించిన మణిరత్నం తయారు చేసిన కథ రజినీ కాంత్ కు నచ్చడంతో దానికి తుది మెరుగులు దిద్దమని చెప్పి దాదాపు తన తరువాతి చిత్రంపై ఉన్న ప్రతిష్టంభనను తొలగించారు. దాంతో తుది స్క్రిప్టును తయారు చేసేపనిలో దర్శకుడు, అతని టీం తలమునకలై ఉంది. మరో వైపు ఈ చిత్రంలో కథా నాయికగా నటించడం కోసం ఐశ్వర్యతో జరిపిన సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చాయని తెలిసింది. ఐశ్వర్య ఒప్పుకోకపోతే విద్యా బాలన్, లేదా అయేషా టకియాలలో ఎవరైనా ఒకరిని ఎన్నుకోవాలని దర్శకుని అబిప్రాయంగా ఉండేది. అయితే చివరికి ఐశ్వర్య వైపునుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిసింది. అధికారికంగా ఇంకా ప్రకటించని ఈ కొత్త చిత్రం కథ మరో రెండు నెలలలో పూర్తిగా సిద్దమవుతుందని, జనవరి,2008 నుంచి చిత్ర నిర్మాణం ప్రారంభిస్తారని తెలిసింది. సో రజినీ కాంత్ నుంచి మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆశించవచ్చు.

Wednesday, September 5, 2007

బాలీవుడ్ హాటెస్ట్ నేహా ధూపియా (ఫోటో గ్యాలరీ)







చిరంజీవి దర్శకత్వం వహించనున్న చిత్రానికి పనిచేస్తున్న ముగ్గురు తమిళ రచయితలు.


చిరంజీవి దర్శకత్వం వహించడం దాదాపు ఖాయమైనట్లే. చిరంజీవి రాజకీయ జీవితంపై కూడా ఊహగానాలు చెలరేగుతున్న ఈ తరుణంలో చిరంజీవి దర్శకత్వం వహించకపోవచ్చునని ఇంతదాకా అనుకున్నా, చివరికి దర్శకత్వం వహించడం దాదాపు ఖాయమైంది. ఇందుకు సాక్ష్యంగా చిరంజీవి ముగ్గురు తమళ రచయితలతో తను దర్శకత్వం వహించే చిత్రానికి కథా రచన రూపొందిస్తున్నారు.

ప్రముఖ తమిళ రచయితలు భూపతి, క్రిష్ణ స్వామి, వల్లసురై లు గత కొన్ని రోజులుగా ఈ కథా చర్చలు చేస్తూ చాలా దీక్షతో కథారచన కొనసాగించడం, ఎప్పుడూ చెన్నై టు హైదరాబాద్ లేక హైదరాబాద్ టు చెన్నై అంటూ చిరంజీవి ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఈ విశయాన్ని తేటతెల్లం చేస్తోంది. ముఖ్యంగా చిరంజీవి రాజకీయ నేపద్యం బలపడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ముగ్గురు రచయితలు వ్రాస్తున్న కథ కూడా ప్రజా జీవితానికి చెందినదే కావడం వల్ల దీనిని తెలుగు రచయితలు వ్రాస్తే అది వెంటనే తెలిసి రాజకీయ వాతావరణం వేడెక్కే అవకాశం ఉండడంవల్ల చిరంజీవి తమిళ రచయితలను ఎన్నుకున్నట్లు తెలిసింది. ఏదేమైనా చిరంజీవి దర్శకత్వ నేపద్యం, రాజకీయ నేపద్యం రెండూ ఏక కాలంలో బలపడుతుండడం చెప్పుకోదగ్గ మార్పుగానే కనిపిస్తోంది. అందుకే టాలీవుడ్ లో ఎప్పుడూ బహిరంగంగా రహస్య చర్చలు కొనసాగుతున్నాయి.

"బుజ్జిగాడు- మేడ్ ఇన్ చెన్నై" కథ మార్చండి- ప్రభాస్.




"బుజ్జిగాడు- మేడ్ ఇన్ చెన్నై" చిత్ర కథ తనకేమాత్రం నచ్చలేదని దానిని వెంటనే మార్చాల్సిందిగా దర్శకుడు పూరీ జగన్నాథ్ ను చిత్ర హీరో ప్రభాస్ అడిగినట్లు తెలిసింది. గతంలో చిత్ర కథలో తలదూర్చని హీరో ప్రభాస్ "మున్నా" చిత్రం ఫెయిల్ కావడంతో ఇప్పుడు చిత్రకథపై దృష్టి సారించాడు. ఇటీవలే ఈ కథ మొత్తం తెప్పించుకుని చదివిన ప్రభాస్ కు కథ ఎంతమాత్రం నచ్చలేదని తెలిసింది.


దాంతో వెంటనే చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావుతో, చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ తో ఈ విశయమై స్పష్టం చేసి "కథను మార్చండి" అని అడిగినట్లు తెలిసింది. అయితే ఈ విశయమై పూరీ ఎలాటి సమాధానం ఇవ్వలేదని తెలిసింది. అయితే ఈ చిత్ర కథ మారుతుందా, లేక చిన్న చిన్న మార్పులు మాత్రం చేస్తారా, లేక అలాగే చిత్రాన్ని నిర్మిస్తారా అనే విషయం ప్రస్తుతానికి తెలియలేదు. ఈ విషయమై నిర్మాత, దర్శకుడు, హీరోల తరుపునుంచి ఎలాంటి అధికారికమైన సమాచారం లేదు.

"బెజవాడ బుజ్జి" గా వస్తున్న రవితేజ.


క్రేజీ స్టార్ రవితేజ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం పేరు "బెజవాడ బుజ్జి" గా ఫైనల్ చేసినట్లు తెలిసింది. రవితేజ ప్రక్కన త్రిశ నటిస్తున్న ఈ చిత్రం విజయవాడలో నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోంది. లక్ష్మి నరసిం హ విజువల్స్ బ్యానరుపై బి.కాశీ విశ్వనాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతాన్ని అందిస్తున్నారు. పూర్తి విజయవాడ నేపద్యంలో కొనసాగే ఈ చిత్రం యాక్షన్ బేస్ లవ్ స్టోరీతో రూపుదిద్దుకుంటోందని తెలిసింది.

కొత్త పార్టీ ఏర్పాటుకు 150 కోట్ల పార్టీ ఫండ్ కోసం అమెరికాలో ప్రయత్నించిన చిరంజీవి.


తనకు రాజకీయాలోకి రావడం ఇష్టం లేదంటూనే మరోవైపు చిరంజీవి తన కొత్త పార్టీ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారా...?.

ఏమో చూడ్డానికి ఇది నిజంలాగే ఉంది. ఇటీవల చిరంజీవి అమెరికాలో కొన్ని రోజులు గడిపారు. అప్పుడు తను పెట్టదలచిన కొత్త పార్టీ గురించిన ప్రతిపాదనను తన ఎన్.ఆర్.ఐ.మితృలతో చిరంజీవి చర్చించినట్లు తెలిసింది. తనకు బాగా కావలసిన వారు, ఆప్తులు అయిన కొద్ది మందికి ప్రత్యేకంగా తనే పార్టీ సహితం ఇచ్చి తన మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు అక్కడి సుమారు 40 మంది మితృలు తమపూర్తి సహకారాన్ని అందచేయనున్నట్లు తెలియజేశారు. అలాగే కొత్త పార్టీ ప్రారంభానికి కావలసిన సుమారు 150 కోట్ల రూపాయలను ఏవిధంగా కూడగట్టుకోవాలి, అందులో ఎన్.ఆర్.ఐ. లు ఎంతమాత్రం అందించగలరు అనే అనేక విశయాలు అక్కడ చర్చించినట్లు తెలిసింది. ఒక వేళ కొత్త పార్టీని అదికారికంగా ప్రారంభించడం ఖాయమవకన్నా ముందే కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావుకు తమ పార్టీలో ఇవ్వదలచిన పాత్ర ఏమిటనే విషయంతోబాటు, ఎస్.సి/ ఎస్,టి లకు పార్టీలో కలిగించాల్సిన పాత్ర ఏమిటి అనే అనేక విషయాలు అక్కడ చర్చించినట్లు తెలిసింది. ఇంత ముఖ్యమైన సమావేశాలు అక్కడ ఉండటం వళ్ళే చిరంజీవి తన కుమారుడు రాం చరన్ తేజ నటించిన "చిరుత" ఆడియో ఫంక్షన్ కు సహితం రాలేకపోయాడని తెలిసింది. దానికి తోడు ఇటీవల చిరంజీవి,సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి రాఘవులుతో కూడా చర్చించినట్లు ఈరోజు ఈనాడు పత్రిక కూడా ప్రచురించడంతో చిరంజీవి కొత్త పార్టీ పెట్టడం ఖాయమేనని టాలీవుడ్ సమాచారం. అయితే ఇదంతా వట్టి ట్రాష్ అని చిరంజీవికి దగ్గరివారు అంటుండగా, మరి వెబ్ సైట్లలో, పత్రికలలో వసున్న వార్తలు "నిప్పు లేకుండా పొగవస్తుందా" అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి. అయినా ఇక్కడొక విషయం, పార్టీ పెట్టాలనుకోవడం తప్పేమీ కాదు, ప్రజకు ప్రత్యక్షంగా సేవ చేసే అదృష్టం దక్కుతుంది. అందునా చిరంజీవి పార్టీ అంటే ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా వుండే అవకాశం ఉందని చిరంజీవినుంచి కొత్త పార్టీని కోరుకుంటున్న కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎనీహౌ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాప్పెన్స్ ఇన్ ఫూచర్.

మళ్ళీ జన్మలో కుక్కగా పుడతాను..షారుఖ్ ఖాన్.











మళ్ళీ జన్మంటూ ఉంటే మీకేమై పుట్టాలని ఉందని ఎవర్నైనా అదిగితే సహజంగా చాలామందికి ఏ సచిన్ గానో, లేక మరే షారుఖ్, అమీర్, హృతిక్, లేదా గాంధీ గానో మరో హిట్లర్ గానో పుట్టాలని ఉందని చెప్పడం సహజం. అయితే మన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ కాన్ రూటే వేరు. అంతేకాదు దియా మిర్జా, మందిరా బేడీ లదీ అదే దారి. అదేనండీ కుక్కై పుట్టడం.
కొందరికి పెంపుడు జంతువులంటే ప్రాణం. మన షారుఖ్ కు అది కొంచెం ఎక్కువ. ఇటీవల జరిగిన ఒక సర్వేలో షారుఖ్ ఖాన్ తనకు తన పెంపుడు కుక్క "చ్యూబెక్కా" లా పుట్టాలని ఉందన్నాడు.తన పెంపుడు కుక్క చ్యూబెక్కా అంటే షారుఖ్ కు చచ్చేంత ఇష్టం. దానిలా కడుపునిండా తింటూ, జల్సాగా తోక ఊపుతూ, ఏ టెన్షన్ లేకుండా గడిపెయ్యాలని ఉందన్నాడు. ఇతని దారిలోనే మరికొందరు బాలీవుడ్ భామలు వెల్లారు. ప్రముఖ మోడల్, సెక్సీ నటి దియా మిర్జా, క్రికెట్ యాంకర్ కం నటి మందిరా బేడీ లు కూడా తమకు "కుక్కగా" పుట్టాలని ఉందని చెప్పారు. సో జంతు ప్రేమా జోహార్.

Tuesday, September 4, 2007

అందాల భామల కొన్ని సరదా సన్నివేశాలు. (ఫోటో గ్యాలరీ)

సినిమా షూటింగ్ లలో కొన్ని మార్లు అనుకోకుండా కొన్ని సరదా దృష్యాలు కనిపిస్తుంటాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా వుండే ఈ సన్నివేశాలు అందరికీ కాసింతసేపు నవ్వుకునేలా చేస్తాయి. అలాంటి సన్నివేశాలను ప్రతివారం మంగళ వారం ఈ పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ బ్లాగులో ప్రచురించదలచాము.వాటిలో కొన్ని ఈ వారం చూడండి.

















భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు యంగ్ ఎన్.టి.ఆర్ -సల్మాన్ ఖాన్.



యంగ్ ఎన్.టి.ఆర్ అంటే తనకు అపారమైన ఇష్టమని బాలీవుడ్ క్రేజీ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. ఇటీవల జెమిని టి.వి. కోసం నటి రమ్యకృష్ణ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ టి.వి స్క్రీన్ పై ప్రత్యక్షమై యంగ్ ఎన్.టి.ఆర్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు.

యంగ్ ఎన్.టి.ఆర్ ను తను గత అయిదు సంవత్సరాలుగా గమనిస్తున్నానని, అతను నటించిన "ఆది", "సిం హాద్రి","యమదొంగ" చిత్రాలు తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఎన్.టి.ఆర్ ఇన్నోసెంట్ ఫేస్ బావుంటుందని, గతంలో కాస్త లావుగా వుండే ఎన్.టి.ఆర్ ఇప్పుడు సన్నబడి చాలాబాగా కనిపిస్తున్నాడని చెప్పారు. ఈ సందర్బంగా ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ లో అతని బాడీ అంటే తనకు ఇష్టమని చెప్పారు. అతని గుండె ధైర్యం కూడా తనకు బాగా నచ్చుతుందని చెప్పారు. ఈ సందర్బంగా సల్మాన్ ఖాన్ కు నచ్చ