చిరంజీవి తనయుని "చిరుత" చిత్రంలోని "యమహో యమా" పాట ఆంధ్ర రాష్ట్రాన్ని ఉప్పెనలా కమ్ముకుంది. టాప్ 5 పోటీలో ఇప్పట్లో "చిరుత" ను బీటేసే పాట మరోటి వస్తుందనే ఆశకూడాలేదని మ్యూజిక్ వరల్డ్ లాంటి సంస్థ అభిప్రాయపడిందంటే అది సామాన్యమైన విషయం ఏమీ కాదు. కాగా ప్రేక్షకులు అత్యధికంగా ఇష్టపడే పాటలను ఎన్నుకోవడానికి ప్రముఖ మ్యూజిక్ సంస్థలు అభిప్రాయ సేకరణకోసం ప్రత్యేకంగా ప్రచురించిన కూపన్లను తమ తమ స్టోర్ లలో ఉంచుతారు. అలాగే ఏ పాటలను ఎక్కువగా విన్నదీ ఆయా స్టోర్ లలో ఉండే మ్యూజిక్ హియరింగ్ ఔట్ పుట్ ల ద్వారా కూడా తెలుస్తుందని, తమ సంగీత్ సాగర్ లో ఎక్కువగా "చిరుత" చిత్రంలోని "యమహో యమా" పాటనే ఎక్కువగా ప్రేక్షకులు వినడం జరిగిందని సంగీత్ సాగర్ తెలుపుతోంది. ఇక టాప్ 5 లో మిగతా స్థానాలను వరుసగా "యమదొంగ", "చందమామ","శంకర్ దాదా జిందాబాద్", "వియ్యాలవారి కయ్యాలు" చిత్రాలు సాధించాయి.వాటి వివరాలు.
1. "యమహో యమా" (చిరుత)
2. "రబ్బరు గాజులు" (యమదొంగ)
3. "బుగ్గారే బంగారమా " (చందమామ)
4. "ఆకలేస్తే (శంకర్ దాదా జిందాబాద్)
5. "తెలుసు చెలి" (వియ్యాలవారి కయ్యాలు).
1 comment:
సాధారణంగా ఈ వర్గీకరణకు ప్రాతిపదిక ఏమిటి?
Post a Comment