Wednesday, October 3, 2007

"హ్యాప్పీడేస్" దెబ్బకు "చిరుత" విలవిల


హాలీవుడ్ లో చరిత్ర పునరావృతమైంది. నాడు శేఖర్ కమ్ముల తొలి చిత్రం "ఆనంద్" దెబ్బకు చిరంజీవి "శంకర్ దాదా ఎం.బి.బి.యస్" విలవిల లాడితే నేడు "హ్యాప్పీడేస్" దెబ్బకు చిరు తనయుని "చిరుత" విలవిలలాడిపోసాగింది. టాలీవుడ్ లో ఎవరు కింగ్ అయినా హాలీవుడ్ లో మాత్రం కింగ్ "శేఖర్ కమ్ముల" మాత్రమే అని చరిత్ర మరోమారు నిరూపించింది.
టాలీవుడ్ లో లేటుగా విడుదలయిన "హ్యాపీడేస్" చిత్రం హాలీవుడ్ లో మాత్రం గతనెలలో "చిరుత" తోబాటే విడుదలైంది. సాంజోశ్, న్యూజెర్సీ, డల్లాస్ లలో "హ్యాపీడేస్" దాటికి "చిరుత" మినిమం టికెట్లతో ప్రదర్శింపబడటం పలువురికి ఆశ్చర్యానికి గురిచేసింది. చికాగో, డెట్రాయిట్ లలో మాత్రం "చిరుత" యావరేజ్ గా ఆడసాగింది. మిగిలిన అన్ని ప్రాంతాలలో "చిరుత" రిపోర్ట్స్ వెరీ వీక్. ఇక "హ్యాప్పీడేస్" చిత్రానికి అమెరికా ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాలలో 'హ్యాప్పీడేస్" చిత్రం రికార్డు కలెక్షన్లను రాబట్టుకుంటుంటే, "చిరుత" మాత్రం తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించడం గమనార్హం. కాగా అమెరికాలో "హ్యాప్పీడేస్" చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు కు చెందిన "ఆర్.కె.ఫిలింశ్ విడుదల చేయగా, "చిరుత" చిత్రాన్ని "గేట్ ఇండియా ఫిలింస్" సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ "చిరుత" పై పెట్టిన పెట్టుబడి రాబట్టుకునే ప్రయత్నాలను మమ్మురంగా చేస్తున్నట్లు తెలిసింది.

1 comment:

Unknown said...

waste picture chi ru tha