Saturday, October 6, 2007

రూ.500కోట్ల బడ్జెట్ తో శంకర్ దర్శకత్వంలో "మహాభారత్"


తమిళ డైరెక్టర్ శంకర్ తో రిలయన్స్ కు చెందిన యాడ్ ల్యాబ్స్ సంస్థ ఇంగ్లీషుతోబాటు, అన్ని భారతీయ భాషలలో "మహాభారత్" సినిమాను రూ.500 కోట్లు వెచ్చించి నిర్మించడానికి రంగం సిద్దమవుతున్నట్లు తెలిసింది. శివాజీ సినిమా తరువాత పలువురు నిర్మాతలు శంకర్ అంటేనే తెలియనట్టు ప్రవర్తిస్తున్నారట. ఇందుకు కారణం శివాజీ సినిమాకు అయిన రూ.75 కోట్లేనట. అంత పెద్దమొత్తం పెట్టి సినిమా తీసే దమ్ము తమకు లేదని శంకర్ పేరెత్తడం లేదని తెలిసింది. ప్రస్తుతం శంకర్ హిందీ "రోబోట్" సినిమా పనిలో బిజీగా ఉన్నడు. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ హీరోగా, ఆయనే స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. శంకర్ తో ఒక పెద్ద సినిమా తీయడానికి రిలయన్స్ మీడియా వింగ్ సంస్థ యాడ్ ల్యాబ్స్ చాలాకాలం నుంచి ప్రయత్నిస్తోంది.అయితే "మహాభారత్" సబ్జెక్ట్ అయితే నిర్మాణవ్యయం ఎక్కువైనా దానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంటుందని ఈ సంస్థ భావిస్తోంది.దీనిని ఇంగ్లీషుతోసహా అన్ని భారతీయ భాషలలో నిర్మించడానికి ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు రూ.500 కోట్ల భారీ మొత్తాన్ని కూడా పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు ప్రాధమిక సమాచారం.

No comments: