Monday, October 8, 2007

ఎక్స్ క్లూజివ్ : రాం చరన్ తదుపరి మూడు సినిమాలు


"చిరుత" చిత్రంతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాం చరన్ తదుపరి నటించే చిత్రాల గురించిన సమాచారాన్ని గోప్య,గా ఉంచుతున్నారు. ఒక్క రాజమౌలు చిత్రానికి సంబంధించిన అధికారికమైన సమాచారం మాత్రం అందరికీ తెలుసు. కాగా రాం చరన్ తదుపరి నటించే మూడు చిత్రాలకు సంబంధించిన అధికారికమైన సమాచారం చిరంజీవి కార్యాలయం నుంచి లభించింది.
ఆ వివరాల ప్రకారం రాం చరన్ తదుపరి తన రెండవ చిత్రంగా గీతా ఆర్ట్స్ బ్యానరులో, రాజమౌలి దర్శకత్వంలో నటిస్తాడు. ఇక మూడవ చిత్రంగా చిరంజీవి తమ్ముడు నాగేంద్ర బాబు అంజనా ఆర్ట్స్ బ్యానరుపై నిర్మించే చిత్రంలో నటిస్తాడు. దీనికి వంశి దర్శకుడు.ఇక మూడవ చిత్రాన్ని వి ఎం సి బ్యానరుపై వి దొరస్వామి నిర్మించే చిత్రంలో నటిస్తాడు. దీనికి లింగుస్వామి దర్శకుడు.

No comments: