తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి తన సేవా ఆశ్రమాన్ని వికలాంగులకోసం విస్తృతపరిచేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇంతవరకు రక్త నిధి, నేత్ర నిధిని స్థాపించిన చిరంజీవి ఇకపై శారీరక, మానసిక వికలాంగుల కోసం ప్రత్యేకంగా "చిరంజీవి ఛారిటబుల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ, మెంటల్లీ రిటార్డెడ్" పేరుతో మరో కొత్త సంస్థను ప్రారంభించనున్నారు. ప్రణాళికలు కూడా దాదాపు పూర్తయిన ఈ కొత్త సేవా ఆశ్రమాన్ని త్వరలోనే ప్రకటించడానికి రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ సేవా ఆశ్రమంలో మానసిక, శారీరక వికలాంగులకోసం వసతి కల్పన, ఉన్నత స్థాయి విద్యాభ్యాసం, ఆరోగ్య వసతి కల్పనలను కలిగించాలని చిరంజీవి నిర్ణయంగా తెలిసింది. అయితే ముందుగా శారీరక వికలాంగులకోసం మాత్రమే దీనిని ప్రారంభించి, తదనంతరం మానసిక వికలాంగులకోసం దీనిని విస్తరించాలని మరో ప్రణాళికను సిద్దం చేసినట్లు తెలిసింది. ఏదేమైనా వికలాంగులకోసం ప్రత్యేక సేవా ఆశ్రమాన్ని ప్రారంభించడం మాత్రం ఖాయంగానే తెలిసింది. కొత్తగా ప్రారంభించే ఈ "చిరంజీవి ఛారిటబుల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ, మెంటల్లీ రిటార్డెడ్" సంస్థ ప్రస్తుతం కొనసాగుతున్న "చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్" లో ఒక భాగంగా కొనసాగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment