Wednesday, October 10, 2007

భార్యామణి(నమ్రత) అనుమతి లేకుంటే ఇంటర్వ్యూ క్యాన్సిల్ : మహేశ్ బాబు




టాలీవుడ్ యంగ్ హీరో మహేశ్ బాబు తన భార్య నమ్రత మాట జవదాటడం లేదు. ఏపనికైనా నమ్రత మాటే శిరోధార్యం అన్నట్లు గా ప్రవర్తిస్తున్నాడు. చివరికి జర్నలిస్టులకూ మహేశ్ బాబు ఇంటర్వ్యూ కావాలంటే ముందుగా నమ్రత పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్తితి తలెత్తిందని ఆంధ్ర ప్రదేశ్ పాత్రికేయులు ఒకటే వాపోతున్నారు. ఒక ఇంటర్వ్యూలేనా వ్యాపార విషయాలకు, వ్యవహార విషయాలకు అన్నింటికీ భార్యామణి మాటే శిరోధార్యం అయ్యింది మన మహేశ్ బాబుకు. ఇటీవల మహేశ్ బాబు కొత్త సినిమా "అతిధి" పబ్లిసిటీకి కూడా నమ్రత పర్మిషన్ లేక సకాలంలో సినిమా పోస్టర్లు, పత్రికలలో ప్రచురించే అడ్వర్టైజ్మెంట్లు ఏవీ బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయని టాలీవుడ్ సమాచారం. అన్నట్లు మహేశ్ బాబు ప్రస్తుత వ్యవహార శైలి చూస్తుంటే ఏదైనా గుర్తుకు వస్తుందా...మరేమీ లేదండీ, మహేశ్ బాబు తండ్రిగారయిన సూపర్ స్టార్ క్రిష్ణ గారు కూడా తన భార్యామణి విజయనిర్మల మాట జవదాటక పోవడం. గత రెండు దశాబ్దాలుగా క్రిష్ణ గారు "భార్యా విధేయుని"గా కొనసాగుతున్న విషయం దాదాపు మన తెలుగు సినిమా ప్రేక్షకులకు అందరికీ తెలిసే ఉంటుంది కదా అందుకే గుర్తుకు వచ్చిందాని గుర్తుచేయడం అన్నమాట.

No comments: