2. డివైడ్ టాక్ ఉన్నా కలెక్షన్ల జోరు కొనసాగుతున్న "తులసి"
సంచలన చిత్రం "లక్ష్మి" తర్వాత వచ్చిన విక్టరీ వెంకటేశ్ "తులసి" చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ టాలీవుడ్ టాప్-5 లో రెండవ స్థానాన్ని ఈ చిత్రం అధిరోహించింది. రికార్డు స్థాయి కలెక్షన్లతో ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంత వెనకబడిందనే డివైడ్ టాక్ వినిపిస్తోంది. దాంతో మహిళా ప్రేక్షకులు కొంత తగ్గినా మిగిలిన వర్గాలనుంచి మంచి స్పందన రావడంతో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
3. వెనకబడిన "చిరుత"
చరన్ తేజ నటించిన "చిరుత" చిత్ర విజయం ఆరంభ శూరత్వంలా మారిందని టాలీవుడ్ టాక్. పెద్ద హీరోల వారసులు అనగానే వచ్చే విశేషమైన ఫాలోయింగ్ ను ఈ చిత్రం వినియోగింగుకోలేకపోతోందని టాక్. ఈ వారం చిత్ర కలెక్షన్లు విపరీతంగా పడిపోయాయి. ఎక్కడా హౌస్ ఫుల్ అనేదే లేని పరిస్థితిని "చిరుత" చిత్రం ఎదుర్కుంటోంది. ఒక్క శని వారం సాయంత్రం ఆటలు, ఆదివారం మినహాయిస్తే ఈ చిత్రం బాగా వెనకబడిందనే చెప్పాలి. ఇక మహేశ్ బాబు "అతిధి" వస్తే ఈ చిత్రం టాప్-5 లో స్థానం కోల్పోయినా ఆష్చర్యపోనక్కర లేదని టాలీవుడ్ టాక్.
హైదరాబాదులో జరిగిన జంట బాంబు దాడుల దెబ్బను ఎదుర్కొని సహితం రికార్డు కలెక్షన్లు సాధించిన "యమదొంగ" నిలకడగా రానిస్థోంది. కొంత వరకు కలెక్షన్లు తగ్గినా ఇప్పటికే ఈ చిత్రం 50 రోజులను విజయ వంతంగా పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత కూడా ఎలాంటి వొడిదుడుకులకు లోను కాకుండా సాఫీగా కొనసాగుతుండటం గమనార్హం. కనీసం వంద సెంటర్లలో ఈ చిత్రం వంద రోజులను జరుపుకోవఛ్ఛనేది టాలీవుడ్ టాక్.
శ్రీవెంకట్ బులెమోని
No comments:
Post a Comment