1. "హ్యాపీడేస్":

2. "చిరుత"

రాంచరన్ నటన, కథ, కథన శైలి ఈ చిత్రాన్ని రెండవ స్థానంలో నిలిపాయి.రాష్ట్ర వ్యాప్తంగా మంచి కలెక్షన్లతో ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రం "హ్యాపీడేస్"తో పోల్చుకుంటే కలెక్షన్ల పరంగా వెనుకబడిందని ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. చిరంజీవి తనయుడనే గుర్తింపు మొదటివారం ఈ చిత్రాన్ని మొదటి స్థానంలో నిలిపినా, రెండవ వారం వచ్చేసరికి ఈ చిత్రంపై ఉన్న మధ్యస్థ అభిప్రాయం ఈ చిత్రాన్ని రెండవ స్థానానికే పరిమితం చేశాయి. అయినా ప్రేక్స్షకులు రాం చరన్, నేహల నటనను ఆహ్వాదిస్తూ థియేటర్లనుంచి సంతృప్తిగానే వెలుతున్నారని టాలీవుడ్ రిపోర్ట్.
3. "చందమామ"
"చందమామ" చిత్రం విడుదలై దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఈ చిత్ర ప్రేక్షకాదరణను ఇంకా పొందుతూ "టాప్ 5" లో మూడవ స్తానాన్ని పొందింది. పూర్తి స్థాయి కుటుంబ ప్రేక్షకులను దృస్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ చిత్రంలోని హృద్యమైన కామెడీ, దాదాపు అన్ని చిత్రాలలో ఉండే హింసనుంచి ఈ చిత్రం దూరం జరగడం, శివబాలాజీ, కజల్, నవదీప్, సింధు తులానీలతోబాటు ఆహుతి ప్రసాద్ల నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని సినీ విమర్శకులు చెబుతున్నారు.

"యమదొంగ" విడుదలై 50 రోజులు పూర్తయినా ఈ చిత్రం ఇంకా "టాప్-5" లో కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. వైవిధ్యమైన కథ, కథనాలు, ఎన్ టి ఆర్ నటన, రాజమౌలి దర్శకత్వ ప్రతిభ, ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం వల్ల ఈ చిత్రం కలెక్షన్లు ఇప్పటికీ సంతృప్తిగానే ఉన్నాయని చిత్ర డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. అయితే కలెక్షన్లు చాలావరకు తగ్గాయని చెబుతున్నారు. దాంతో కలెక్షన్లె పరంగా ఈ చిత్రం ఐదవ స్థానంతో సంతృప్తి పడవలసి వచ్చింది.
శ్రీవెంకట్ బులెమోని
No comments:
Post a Comment