Wednesday, October 10, 2007

అమెరికన్ కాంగ్రెస్ చేత "లెజెండ్" గా సత్కారం పొందిన "మంగళంపల్లి"




కర్నాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను అమెరికా కాంగ్రెస్ సత్కరించింది. శాస్త్రీయ సంగీతానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఒక ప్రశంసాపూర్వక పత్రాన్ని అమెరికా కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధి నిక్ ల్యాంప్సన్ టెక్సాస్‌లో మీడియాతో మాట్లాడుతూ...
బాలమురళీకృష్ణను భారతీయ సంగీతానికి చెందిన "లెజెండ్‌"గా అభివర్ణించారు. ఈ సందర్భంగా లాంగ్ ఐలాండ్ సమీపంలో శ్రీవారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ అమెరికా పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూజెర్సీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల రాష్ట్ర అసెంబ్లీ బాలమురళీకృష్ణ సంగీత ప్రతిభను కొనియాడుతూ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని చదివి వినిపించారు.

No comments: