"ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం" అంశానికి చిరంజీవి మద్దతు ఇవ్వనున్నట్లు టాలీవుడ్ లో వార్త గుప్పుమంది. ఇన్నాళ్ళూ చిరంజీవి రాజకీయ ప్రవేశం, రాజకీయ పార్టీ స్థాపనకు సంబంధించిన వార్తలు వస్తే ఇప్పుడు చిరంజీవి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇవ్వనున్నారంటూ కొత్త వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇక్కడ ప్రత్యేక తెలంగాణా అంటే చంద్ర శేఖరరావు నేతృత్వంలోని "తెలంగాణ రాష్ట్ర సమితి" పార్టీకి కాదు, "ప్రత్యేక తెలంగాణా" అంశానికి అని టాలీవుడ్ లో సమాచారం.
ముఖ్యంగా గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పరిస్థితి స్థిరంగా లేదు. అంతటా "మధ్యంతరం" మాట అమితంగా వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే అన్ని రాజకీయ పార్టీలూ కొత్త కొత్త హామీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దానికి తోడు చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఎప్పుడూ లేనంతగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకవేల చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీకి మద్దతు ఇస్తారో కూడా ఇదమిద్దంగా తెలీకున్నా, దాదాపు అన్నిపార్టీలూ చిరంజీవిని తమ పార్టీలోకి పరోక్షంగా ఆహ్వానిస్తున్నాయి. అయితే చిరంజీవి వైపునుంచి ఎలాంటి ప్రతిస్పందనా లేదు. ఇక వామ పక్షాలు ఒక అడుగు ముందుకు వేసి చిరంజీవితో పలుమార్లు చర్చలు కూడా జరిపినట్లు తెలిసింది. పైకి సాధారణంగానే తాము కలుసుకున్నామని ఇరు పక్షాలూ అంటున్నా, నిజానికి చిరంజీవి రాజకీయ ప్రవేశం గూర్చి చర్చించడానికే వారు అధిక ప్రాధాన్యం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే అతని తదుపరి అడుగు ఎటు పడుతుంది, అతని రాజకీయ వాగ్దానాలేమై ఉంటాయి అనేది ముఖ్యమైన చర్చగా కొనసాగుతుంటే, కొత్తగా చిరంజీవి "ప్రతేక తెలంగాణా రాష్ట్రానికి" మద్దతు తెలుపుతూ, "ప్రత్యేక తెలంగాణా", "ప్రత్యేక ఆంధ్ర" రాష్ట్రాల సాధనకు తన మద్దతు ఉంటుందని, ఒక కుటుంబంలోని అన్నదమ్ముల మధ్యనున్న మనస్పర్ధల వల్ల ఎక్కువకాలం కలిసి ఉండటం సాధ్యం కాదని, కనుక వారు విడిపోయి వేరు వేరుగా నివాసం ఉంటూనే కలిసిమెలిసి ఉండటం సమాజంలో చూస్తూనే ఉన్నాం కనుక, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లుగా కలిసి ఉండటం సాధ్యమేనని ఆయన ఉవాచ గా ఉందని టాలీవుడ్ సమాచారం. ఇక ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు ఒక్క తెలుగు దేశం తప్ప మిగిలిన ఆని పార్టీలూ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నా, కాంగ్రెస్ వారు గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్నారు. ఇక ముందస్తు ఎన్నికల మాట విన్నప్పటినుంచి అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకోవడనికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటప్పుడు "ప్రత్యేక రాష్ట్రం" అన్న పదం తప్ప తన రాజకీయ ప్రవేశానికి మరో తారక మంత్రం ఉండబోదని, అదే మాటతో గతంలో "తెలంగాణ రాష్ట్ర సమితి" ఎక్కువ సీట్లు సాధించినా, చంద్ర శేఖరరావు పరిస్థితి, చిరంజీవి పరిస్థితి వేరువేరని చిరంజీవికి దగ్గరివారు చర్చిస్తున్నట్లుగా తెలిసింది. ఇదే విషయమై వామ పక్షాలు కూడా చిరంజీవికి మద్దతు ఇవ్వడానికి సిద్దమేనని, వమపక్షాల ఇటీవలి కదలికలనుబట్టి తెలుస్తోంది. ఒక వేళ చిరంజీవి రాజకీయ ప్రవేశం చేయకపోతే తాము ఎట్టిపరిస్తితుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని, తమ మద్దతు తెలుగు దేశానికే ఉంటుందని వారు పరోక్షంగా తెలియజేస్తున్నారు. అయితే చిరంజీవి రాజకీయ ప్రవేశం ఆశతో వారు మరికొంత కాలం వేచి చూసే ధోరనిలో ఉన్నట్లు తెలిసింది. ఇక మరోవైపు చిరంజీవి కొత్త పార్టీ స్థాపనకు కావలసిన "పార్టీ ఫండ్" కోసం తన అమెరికా మితృల సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నుంచగా, వారు అంతా అందుకు సిద్దంగానే ఉన్నట్లు తెలిసి చిరంజీవి తన రాజకీయ పార్టీ ఏర్పాటు, రాజకీయ పార్టీ ఎజెండా, ప్రస్తుతం నెరవేర్చాల్సిన కార్యక్రమాలు తదితర పలు ఆలోచనలతో తనకు దగ్గరివారితో రెగ్యులర్ గా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
చిరంజీవి పెట్టబోయేది "జాతీయ పార్టీ"
చిరంజీవి రాజకీయాల్లోకి అంటూ వస్తే అతను ఖచ్చితంగా "ప్రాంతీయ పార్టీ" పెట్టరని, "జాతీయ పార్టీ"నే ఆయన ఉద్దేశ్యంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు కాకున్నా మరి కొంత కాలానికైనా ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడం ఖాయమని, తనకు తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమల్లోనే కాక, ప్రక్కనున్న తమిళనాడు, కర్నాటక,కలకత్తా లతోబాటు మరికొన్ని ప్రాంతాలలో ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని జాతీయ పార్టీ స్థాపించి ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్ పైనే దృష్టి పెట్టినా, భవిష్యత్తులో దానిని విస్తృతపరచవచ్చునని ఆయన మనసులోని ఆలోచనగా టాలీవుడ్ సమాచారం. అయితే మొన్న గాంధీ జయంతికే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని పెద్దయెత్తున ప్రచారం జరిగినా అలాంటి అలికిడి ఆయనవైపునుంచి ఏమీ జరగలేదు కానీ, ప్రస్తుత రాజకీయ పక్షాలన్నీ చిరంజీవి రాజకీయ ప్రవేశ ఆశ(భయం) తో ముందస్తు ప్రణాలికలు వేసుకుని జనంలోకి చొచ్చుకెళ్ళడానికి తమవంతు ప్రయత్నాలను మమ్మురం చేసాయి. ఇక గత రెండు రోజులుగా టాలీవుడ్ లో చిరంజీవి తెలంగాణా అంశానికి మద్దతు ఇస్తారన్న ఊహాగానాన్ని వినగానే అందుకు తగ్గట్లుగా తమ ప్రయత్నాలను మమ్మురంచేశాయి. అయితే ఇదమిద్దంగా ఏరోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నాయన్న విషయం నిర్వివాదాంశం.
1 comment:
AP avadabba sommani pratyeka rashtralu erpaatu chestaru? Chiranjeeve kadu, evadi valla kaadu... Khabardaar!!!
Post a Comment