దక్షిణ భారత గ్లామర్ తార ఆసిన్ కు ఆంధ్రా చేపల పులుసంటే ప్రాణమట. షూటింగ్ కొసమో, లేక మరే ఇతర కారయక్రమాలకైనా ఆంధ్ర ప్రదేశ్ వస్తే ముందుగా ఓ రెండు మూడు ప్లేట్ల చేపల పులుసు లాగించాకే ఏ కార్యక్రమానికైనా హాజరవుతానని అంటోంది ఆసిన్. అన్నట్లు ఏ తెలుగు సినిమా చేసినా నా మెనూలో మొదటి స్థానం చేపల పులుసుకే. అది లేకుంటే ఆ రోజంతా ఏదోలా వుంటుందని చెబుతున్న ఆసిన్, తనకు తెలుగు చిత్ర పరిశ్రమే గుర్తింపును ఇచ్చిందనీ, త్వరలోనే ఏదైనా మంచి తెలుగు చిత్రంలో నటించాలని ఉందని చెబుతున్న ఆసిన్ ప్రస్తుతం హిందీ "గజినీ" తో బాటు కొన్ని తమిళ చిత్రాలలో నటిస్తోంది. ఇటీవల హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గోవడానికి వచ్చిన ఆసిన్ ఈ ముచ్చట్లన్నీ పాత్రికేయులతో పంచుకుంది. అలాగే చేపల పులుసు గురించిన ఓ లెక్షర్ కూడా ఇచ్చింది. అదేమిటంటే చేపలు తింటే గ్లామర్ ఏమాత్రం దెబ్బ తినదనీ, వీటి వల్ల కొవ్వు చేయడం జరగదనీ, ఇవి కంటికి బలమే కాకుండా, చూపు బాగా వుంటుందనీ, దాదాపు కొలెస్ట్రాల్ లేని ఈ చేపలలో పీచు పదార్థ ఎక్కువగా వుంటుందనీ తెలియజేస్తోంది. ఇన్ని విషయాలు నీకెలా తెలుసంటే, తొలిసారి హైదరాబాదు వచ్చినప్పుడు రుచి చూద్దామని ఓ చేప ముక్క నోట్లో వేసుకున్న నేను, ఇక మరే కూర జోలికీ వెళ్ళకుండా చేపలను ఓ పని పట్టాననీ, ఇంత ఎక్కువ చేపలు తిన్నాను ఒక వేళ దానివల్ల గ్లామర్ కు ఏదైనా దెబ్బ వుంటుందేమోననే భయంతో దీనికి సంబంధించిన పలు బుక్స్ కొని చదవడమే కాకుండా, అప్పట్లో ప్రతి ఒక్కరినీ ఇదే విషయమై అడిగేదాన్నని దాంతో ఈ విషయాలు తనకు తెలిశాయని చెప్పుకొచ్చింది ఆసిన్. అలాగే చేపలు తిన్నప్పటినుంచే తనకు సినీ పరిశ్రమలో కలిసి ఒచ్చిందని, ఆతర్వాత ఇంతటి స్థానానికి చేరుకున్నానని సాగదీసి మరీ చెప్పింది ఆసిన్. ఆ తర్వాత అక్కడినుంచి బయటపడ్డ పాత్రికేయులు తెలీక చేపల గూర్చి ఆసిన్ తో పెట్టుకున్నామని బుర్రలు గోక్కుంటూ వెళ్ళారట. పాపం కదూ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment