సెన్సేషనల్ హీరో రవితేజ, గ్లామర్ డాల్ త్రిశలు పుకెట్ దీవులలో ప్రేమాయణం సాగిస్తున్నారు. మనసుల్లోని ఊసులను, ఊహలను పంచుకుంటూ దీవుల్లో ఎక్కడ చూసినా తామే అన్నంతగా మునిగితేలుతుంటే అక్కడి స్థానిక పుకెట్ దీవుల వాసులు ముక్కుపై వేలేసుకుని మరీ చూస్తున్నారని తెలిసింది. వీరి ప్రేమాయణం మధ్య మధ్యలో దైరెక్టొర్ వి వి వినాయక్ అడ్డుచెప్పకుండా వుంటే కోరియోగ్రాఫర్ ఎంతకైనా తెగించడానికి సిద్దంగా ఉన్నట్లు వినికిడి. ఈ పాటికే అసలు సీన్ అర్థమైదనుకుంటాను. మరేమీ లేదండీ, వి వి వినాయక్ దర్శకత్వంలో తొలిసారిగా రవితేజ, త్రిశ నటిస్తున్న "బెజవాడ బుల్లోడు" లేదా "బెజవాడ బుజ్జిగాడు" సినిమాకోసం యూనిట్ అంతా పుకెట్ దీవుల్లో పాటల చిత్రీకరణకు వెల్లారు. ఇక పొద్దున్నే లేచింది మొదలు ఆ ఇసక దీవుల్లో, గుబురు పొదల్లో, నీటి తెమ్మెల్లో రవితేజ, త్రిశలతో ఒకటే స్టెప్పులేపిస్తున్నారు పాపం. అతి త్వరలోనే ఈ పాటల తతంగామాను పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చి, మళ్ళీ షెడ్యూలంటూ మరో చోటికి వెల్లనున్నట్లు టాలీవుడ్ సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment