Friday, October 5, 2007

కొత్తగా ఏర్పడే "ఆంధ్ర" రాష్ట్రానికి "విజయవాడ" రాజధాని: "పవర్ స్టార్" పవన్ కళ్యాణ్





ఆంధ్ర ప్రదేశ్ రెండుగా విడిపోవడం ఖాయమని ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ స్థిర అభిప్రాయంతో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితివల్ల తప్పకుండా ప్రత్యేక "తెలంగాణా" రాష్ట్రం ఏర్పడుతుందని, "తెలంగాణా"కు రాజధానిగా హైదరాబాదు కొనసాగుతుంది, కనుక కొత్తగా ఏర్పడే "ఆంధ్ర" రాష్ట్రానికి "విజయవాడ" రాజధానిగా ఏర్పడుతుందని ఆయన అభిప్రాయ పడటమే కాకుండా, ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.
"తెలంగాణ" రాష్ట్రంలో సినీ పరిశ్రమ హైదరాబాదులోనే కొనసాగుతుంది. ఇక "ఆంధ్ర" రాష్ట్రంలో కొత్త రాజధాని "విజయవాడ"లో సినీ పరిశ్రమ స్థిరపడుతుందని ఆయన భావిస్తూ, అందుకు అనుగుణంగానే విజయవాడలో పెద్ద యెత్తున భూమి కొంటున్నారు. ఇటీవల విజయవాడలోని మొగల్రాజపురం లో ఒక ఎకరా భూమిని కొన్నారు. దీనికోసం ఆయన పదిహేను కోట్ల రూపాయలను వెచ్చించారు. విజయవాడలోని మొగల్రాజపురంలో భూముల ధరలు అత్యధికంగా ఉంటాయి. అలాగే విజయవాడ సమీపంలోని కొన్ని స్థలాలను కూడా చూసినా ఇంతవరకు దేనినీ ఫైనల్ చేయలేదు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మాత్రం రెండుగా విడిపోవడం ఖాయమని, తదనంతరం ఆంధ్ర ప్రాంతంవారు తిరిగి వారివారి స్వస్తలాలకు వచ్చే అవకాశం ఉండటం వల్ల భవిష్యత్తులో భూమి రేట్లు ఇంకా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉండటం వల్ల తాను ముందుగానే ఇంటి స్థలాన్ని, కొంత భూమిని కొంటున్నట్లు ఆయన తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసింది.

No comments: