ఇటీవల తమిళ పత్రికలు, తమిళ పాత్రికేయులు తను మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మించనున్న చిత్రంలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు అబద్దమని ప్రముఖ నటుడు రజినీకాంత్ విలేఖరులకు చెప్పారు. ఇటీవల చెన్నైలోని ఫోర్ ఫ్రేంస్ ప్రివ్యూ థియేటర్లో తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ, ఇదంతా అబద్దమని, అసలు అలాంటి చర్చ మామద్యన రాలేదని ఆయన తెలిపారు. ఇప్పటిదాకా ఏచిత్ర కథనూ, మరే దర్శకుడినీ తన తదుపరి చిత్రానికి ఫైనల్ చేయలేదని ఆయన తెలిపారు. తన కొత్త సినిమా విషయం వచ్చే జనవరిలో ప్రకటిస్తానని ఆయన అన్నారు. అంతే కాని తాను మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మించే చిత్రంలో నటించడం లేదని ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment