Friday, October 5, 2007

తమిళ "లాడం" లో ఛార్మీ


భారీ ఎత్తున నిర్మిచనున్న తమిళ చిత్రం "లాడం" లో నటి ఛార్మీ నటించనుంది. సినీ పరిశ్రమకు తమిళ చిత్రాల ద్వారానే పరిచయమైన నటి ఛార్మీ గతంలో "కాదల్ అదివదిళ్ళై","కాదల్ కిసు కిసు","ఆహా ఎత్తినై అళగు" చిత్రాలలో నటించింది. ఆ తర్వాత తెలుగులో మంచి అవకాశాలు చాలా రావడంతో తిరిగి తమిళ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దర్శకుడు ప్రభు సాలమన్ దర్శకత్వంలో, చోళా క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో గ్లామర్ కూడుకున్న పాత్రను పోశిస్తోందని తెలిసింది. ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాలలో నటిస్తున్న నటి ఛార్మీ ఇకపై తెలుగు, తమిళ చిత్రాలలో క్రమం తప్పకుండా నటిస్తానని తెలిపింది.

No comments: