Monday, September 3, 2007

నేను చెప్పేవన్నీ అబద్దాలే...రాంగోపాల్ వర్మ.




బాలీవుడ్ లో తెలుగు సంచలనం రాంగోపాల్ వర్మ తానుచెప్పేవన్నీ అబద్దాలేనని సంచలన వ్యాఖ్య చేసారు.
ఇటీవల తన కొత్త చిత్రం "ఆగ్" విడుదల సందర్బంగా హైదరాబాద్ వచ్చిన రాంగోపాల్ వర్మ అక్కడ పత్రికలవారితో మాట్లాడుతూ "ఆఫ్ ది రికార్డ్"(ఈ విశయం ప్రచురించకూడదని అర్థం) అంటూ "తను చెప్పేదొకటి చేసేదొకటని చెప్పుకొచ్చారు. ఒక విధంగా మనం రాణించాలంటే కొన్నిసార్లు చెప్పింది చేస్తే కుదరదని, మన గెలుపు పోరాటంలో మనం ఓడిపోకుండా వుండాలంటే కొన్నిసార్లు అబద్దాలు కూడా చెప్పాల్సి వస్తుందని, కాకపోతే తను అబద్దాలే ఎక్కువగా చెబుతానని నవ్వుతూ చెప్పుకొచ్చారు. గెలుపు ఓటములను సమానంగా భావిస్తూ చిత్రాలు నిర్మించాలని అందరమూ భావిస్తామని, కాని ఒక్కోసారి దానిని అనుకున్నంత ఈజీగా తీసుకోలేమని అన్నారు. అందుకే వందరోజుల పరుగుపందేలపై కాకుండా పెట్టుబడి రాబట్టుకోవడానికి అందరు నిర్మాతలూ, దర్శకులూ తప్పకుండా అబద్దాలు చెబుతారని, తమ సినిమాలపై ప్రేక్షకులలో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా మొదట చూసుకుని మొదటి వారంలోనే పెట్టుబడిని పొందడానికి శాయశక్తులా కృషి చేస్తారని అందుకు ఎవరూ అతీతులు కారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి" అంటూ తన "ఆఫ్ ది రికార్డ్" కు ముగింపు పలికారు. ఎంతటి వారికైనా తమ జయాపజయాలపై వుండే అభద్రతా భావాన్ని, దాన్ని అధిగమించడానికి వారు పడే కష్టాల్ని గమనిస్తే మనం కూడా ఎప్పుడైనా అభద్రతా భావానికి గురైతే "ఎంతవారలైన కష్ట దాసులే.." అని పాడుకోవడానికి కూడా బావుంటుంది. అలాగే మనల్ని మనమే ఉత్సాహం కలిగించుకుని ముందుకు వెల్లడానికి కూడా టానిక్ లా పనిచేస్తుందని భావిస్తూ ఈ ఆఫ్ ది రికార్డ్ ని ఇక్కడ చేర్చాం.

No comments: