Monday, September 3, 2007

పది కోట్లు రెమ్యునరేషన్ ఇస్తేగానీ డేట్లు ఇవ్వనన్న మహేశ్ బాబు...!?.


టాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక సినిమాకు పది కోట్లు డిమాండ్ చేసున్నట్లు తెలిసింది.

ఇటీవల భారీ మొత్తం వెచ్చించి యు.టి.వి. సంస్థ మహేశ్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక సినిమాకు పన్నెండు కోట్ల రూపాయల చొప్పున మొత్తం 36 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ కుదుర్చుకుని సదరు అడ్వాన్స్ కూడా చెల్లించి మహేశ్ తో మూడు భారీ ప్రాజెక్టులు రూపొందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోందా సంస్థ. అంతకన్నా ముందే మహేశ్ బాబు "మిర్చి", "హరే రామ హరే కృష్ణ" సినిమాలను ఒప్పుకోవడం జరిగింది. అయితే వాటికి కూడా మినిమం పది కోట్లు చెల్లిస్తే తప్ప తన డేట్లు ఇవ్వడం జరగదని చెప్పించినట్లు తెలిసింది. ఇది అబద్దమని నిర్మాత తరుపువారు చెబుతున్నా, జరిగింది అదేనని టాలీవుడ్ జర్నలిస్టులు చెబుతున్నారు. ఏదేమయినా మహేశ్ బాబు రెమ్యునరేషన్ పదికోట్లు దాటిందనేది మాత్రం నిస్సందేహం.

No comments: