మారుతున్న కాలంతోబాటు మనమూ మారాలి. లేదంటే ఈ సమాజం మనల్ని గుర్తించదు. అవసరానికి తగ్గట్లుగా మన ఆలోచనలు, ఆచరణలు సహితం మారాలి అంటూ ముంబై రిపోర్టర్లకు తెగ క్లాసులు పీకేస్తున్న విద్యా బాలన్ తన క్లాస్ ఇమేజ్ కు కూడా తిలోదకాలిస్తోందా.
ఇదే విషయం అడిగినందుకే ముంబై రిపోర్టర్లకు క్లాసు. బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ స్థానాన్ని దక్కించుకోవడమే తన లక్ష్యంగా క్లాస్ ప్రేక్షకులను అలరించిన విద్య, ఇక మాస్ పట్ల కూడా దృష్టి పెట్టినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లే తన డ్రెస్సింగ్ సెన్స్ కూడా మార్చేసింది. ఇకపై క్లాసు, మాసు కలగలిసిన విద్యా బాలన్ ను మనం తెరపై తిలకించనున్నాం.
No comments:
Post a Comment