టాలీవుడ్ బ్లాక్ బస్టర్ "బొమ్మరిల్లు" హిందీలో తిరిగి నిర్మాణం జరుపుకోనుంది. ప్రముఖ నటి జయసుధ, కేంద్ర మంత్రి డా.దాసరి నారాయణ రావులు ఈ చిత్రాన్ని నిర్మించతలపెట్టారు. ఇందుకు గాను ఇటీవల వీరు ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిశేక్ బచ్చన్ లను కలిసి తండ్రీ, కొడుకులుగా కలిసి నటించమని అడిగారు.
ఇందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అయితే అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ఈ సినిమాను చూసిన బచ్చన్ కుటుంబీకులు మంచి సినిమా అని అభినందించినట్లు తెలిసింది. కాగా ఈ సినిమాలో అభిశేక్ బచ్చన్ కు తల్లిగా జయసుధ నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
No comments:
Post a Comment