Saturday, October 13, 2007

ఇంటి కోసం రెమ్యునరేషన్లో డిస్కౌంట్ ఇచ్చిన ఇలియానా


టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇలియానా కూడా ఓ ఇంటికి ఓనరౌతోంది. కాకపోతే ఆ ఇంటి ఖరీదులో డిస్కౌంట్ ఇస్తే, తను వారికి ఓ సినిమాలో నటించి పెట్టడమే కాకుండా, ఆ సినిమాకు తన రెమ్యునరేషన్లోంచి కొంత డిస్కౌంట్ కూడా ఇస్తానని "ఫ్యాన్సీ ఆఫర్" సదరు బిల్డరు గారికి ఇచ్చి తనూ తన స్వంత ఇంటి కలను నిజం చేసుకుంది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే సినీ నిర్మాత లగడపాటి శ్రీధర్ సోదరుడు లగడపాటి రాజగోపాల్ హైదరాబాదు సమీపంలో నిర్మించనున్న ప్రతిష్టాత్మక "ల్యాంకో హిల్ల్స్" లో హీరోయిన్ ఇలియానా స్వంతంగా ఒక ఫ్లాట్ కొనాలని అనుకుంది. ఇందులోని ఫైవ్ స్టార్ ఫ్లాట్స్ బుకింగ్ ఈ మధ్యనే ఆపివేశారు కూడా. అయితే అందులో తనకు ఒక ఫ్లాట్ కొనాలని అనుకున్నదే తడవుగా సదరు నిర్మాతను ఇలియానా సంప్రదించింది. అయితే ఒక్కో ఫ్లాట్లు ఖరీదు కోటిన్నర దాకా ఉండటంతో బాగా ఆలోచించిన ఇలియానా, తనకు ఫైవ్ స్టార్ ఫ్లాట్ లో డిస్కౌంట్ ఇవ్వాలని, అందుకు తగ్గట్లే తాను, లగడపాటి శ్రీధర్ నిర్మించే ఒక చిత్రంలో నటిస్తానని, అలాగే ఆ చిత్రానికి తన రెమ్యునరేషన్లోంచి కొంత డిస్కౌంట్ ఇస్తానని ఆఫర్ ను లగడపాటి శ్రీధర్ ముందుంచింది. దానికి సమ్మతించిన శ్రీధర్ తన సోదరునితో మాట్లాడి ఇలియానాకోసం ఫ్లాటు రేటు కొంత తగ్గించాడని, బదులుగా ఇలియానా త్వరలోనే శ్రీధర్ చిత్రంలో నటించనుందని తెలిసింది. ఇలియానా ఇంత ప్రయాసపడి కొంటున్న ఆ ఫ్లాట్ల అసలు సంగతి ఏమిటంటే, అవి ల్యాంకో గ్రూప్ నిర్మిస్తున్న అతి ప్రతిష్టాత్మకమైన వంద అంతస్తుల ఫ్లాట్ లు కావడమే. ఇక అందులోని ఫైవ్ స్టార్ ఫ్లాట్స్ ప్రత్యేకంగా ఎన్ ఆర్ ఐ లకు, సినీ స్టార్లకు కేటాయించినవి కావడం గమనార్హం.

No comments: