Friday, October 12, 2007

"పాత్రికేయులతో మాట్లాడను", "ప్రమోషన్స్ చేయను" :నయనతార కండిషన్స్







తెలుగు సినీ పరిశ్రంలో లేని కొత్త కండిషన్లతో నయనతార నిర్మాతలను చంపుతోందని టాలీవుడ్ లో ఒకటే చర్చ. తను "పాత్రికేయులతో మాట్లాడను", "ప్రమోషన్స్ చేయను" అంటూ, "తన కాంట్రాక్ట్ చిత్రంలో నటించడం వరకే, ఆ తర్వాత ఆ చిత్రంతో కానీ, చిత్ర యూనిట్ తోగానీ తనకు ఎటువంటి సంబంధం ఉండదు, ఆయా చిత్రాలకు సంబంధించి వారితో మాట్లాడండి, వీరితో మాట్లాడండి అంటే కుదరదు, అలాగే ఆయా చిత్రాలకు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాలలో కూడా తాను పాల్గొనేది లేదని" ఖరాకండిగా చెబుతూ దర్శక, నిర్మాతలు మరో సారి ఆలోచనలో పడేలా చేస్తోంది నటి నయనతార.
సహజంగా ఎవరినా నటీనటులు తమ చిత్రాల ప్రచారాన్ని తమదిగా భావిస్తూ, దానికి సంబంధించిన పలు కార్య క్రమాలలో పాల్గొంటుంటారు. చివరికి బాలీవుడ్ నటీ,నటులు సహితం తమ చిత్రాలను ప్రమోట్ చేసుకోవడాని దాదాపు అన్ని విలేఖరుల సమావేశాలకు, ప్రచార కార్య క్రమాలకు తప్పకుండా వస్తారు. అలాంటిది నయనతార ఈ కొత్త కండిషన్స్ పెట్టడం ఏమీ బాగోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు అందులో తన కండిషన్లకు ఒప్పుకున్నట్లు లేకుంటే అసలు సంతకమే చేయనని మొరాయిస్తూ నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హీరోయిన్ లలో నయనతార డిమాండ్ లో ఉండటం వల్ల నిర్మాతలు కూడా సరేనని ఒప్పుకుంటున్నట్లు తెలిసింది. అయితే దీనికంతకీ అసలు కారణం వేరే ఉంది. తమిళ నటుడు శింబు తో జరిగిన ప్రేమాయణం, ఇతర వివాదాల గూర్చి విలేఖరులు, అభిమానులు అడుగుతూండటం తో ఆ ఇబ్బందుల నుంచి ఈ కండిషన్లు తనను రక్షిస్తాయని నయనతార నమ్ముతోంది. అందుకే ఈ వింత కండిషన్లని టాలీవుడ్ కోడై కూస్తోంది.

No comments: