Wednesday, October 3, 2007

2012 ఒలంపిక్స్ లో పాల్గొననున్న కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర


ప్రముఖ నటుడు కమల్ హాసన్ చిన్న కూతురు 2012లో ఒలంపిక్స్ లో పాల్గొననుంది. 2012లో లండన్ లో జరుగనున్న ఒలంపిక్స్ లో కొత్తగా చేర్చిన "డ్యాన్స్ (బాల్రూం లాటిన్)" విభాగంలో పాల్గొననున్న అక్షరకు ప్రస్తుతం 16 సంవత్సరాలు మాత్రమే. 2012లో "బాల్రూం లాటిన్" గా పిలిచే ఈ కొత్త నృత్య విభాగంలో పాల్గొనడం కోసం అక్షర బ్రిటన్ నుంచి పిలిపించిన నృత్య దర్శకును ద్వారా శిక్షణ తీసుకుంటోంది. బ్రిటన్ కు చెందిన హాట్ షో డ్యాన్స్ క్యాంప్ డైరెక్టర్ జెఫ్రీ వర్డన్ కూడా అక్షరపై పూర్తి నమ్మకాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం ఏకాగ్రతతో శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న అక్షర 2012లో ఒలంపిక్ లక్ష్యంగా కృషి చేస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ అక్షరా!

No comments: