నటి మీనా నిర్మాతగా మారనుంది. తమిళ సినీ పరిశ్రమలో ఈ విశయం పెద్దగా చర్చించుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏ సినిమాలోనూ నటించలేదేమిటని మీనాను అడిగితే, "ప్రస్తుతం హీరోయిన్లు డ్యూయట్ లంటూ, చెట్టులవెంటా, పుట్టలవెంటా తిరగడం చూసి, వెగటు పుట్టి అలాంటి కథానాయకి పాత్రలను పోశించకూడదని నిర్ణయించుకున్నాను. పూర్తి డెప్త్ తో కూడిన సినిమాలైతే చేస్తానని, ప్రస్తుతం మళయాలంలో అలాంటి ఒక పాత్ర చేస్తున్నానని" చెప్పింది. ఇకపై తానే నిర్మాతగా మారే ఆలోచన ఉందని తెలపడంతోబాటు, కొన్ని కథలను కూడా వింటున్నట్లు తెలిసింది. ఎనీహౌ, మీనా నిర్మాతగానైనా మారి మంచి సినిమాలు తీస్తే బావుండునని, అభిమానులు కోరుకుంటున్నట్లు తెలిసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment