Monday, October 1, 2007

ముస్తాబవుతున్న తమిళ "బొమ్మరిల్లు"




తెలుగులో సంచలన విజయం సాధించిన "బొమ్మరిల్లు" చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. "సంతోష్ సుబ్రహ్మనియం" పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో "జయం" రవి, జెనీలియాలు నాయికా, నాయకులు. అన్నట్లు "జయం రవి" ఎవరో తెలుసా..మన ఎడిటర్ మోహన్ అబ్బాయేనండీ ఈ రవి. తెలుగులో విజయం సాధించిన "జయం" చిత్రాన్ని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేస్తే, ఆ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు కాబట్టి అతని పేరు "జయం" రవి అయ్యిందన్నమాట. ఏమాట కామాటే చెప్పుకోవాలి...ఈ తమిళ చిత్రంలో జెనీలియా తెలుగంత బాగా లేదని కోలీవుడ్ కబురు. ఈ ఫోటోలలో చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది. కావలిస్తే మీరే చూడండి.

No comments: