"శ్రీరాములయ్య" చిత్రంలో పరిటాల శ్రీరాములు పాత్ర పోషించిన నటుడు మోహన్ బాబు ఇప్పుడు కొత్తగా మరో రాయలసీమ రాజకీయ నాయకుని జీవిత చరిత్రతో నిర్మించే "రాయలసీమ సర్కార్" చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. అయితే మోహన్ బాబు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపడేస్తున్నా, విశ్వసనీయ సమాచారం మేరకు ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం అతి వేగంగా కొనసాగుతున్నట్లు తెలిసింది.
హీరో మోహన్ బాబు అయితేనే ఈ పాత్రకు సరైన న్యాయం చేస్తాడని తలపోసిన సదరు నాయకుని సంబంధీకులు మోహన్ బాబుని సంప్రదించిన తర్వాతనే ఈ చిత్రానికి నుడికారం దిద్దినట్లు తెలిసింది. అంతా అనుకున్నట్లుగా సాగితే జనవరిలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిసింది. కాగా ఏ నాయకుని జీవితం అధారంగా ఈ సినిమా నిర్మించదలచారో తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. అయితే ఈ నాయకున్ని మొత్త రాయలసీమలో "సర్కార్" అని సంభోధిస్తారని, అందుకే చిత్రం పేరు "రాయలసీమ సర్కార్"గా నామకరణం చేసినట్లు తెలిసింది.
No comments:
Post a Comment