సినీ పరిశ్రం దృస్టి ఇప్పుడు రజినీకాంత్ నటిస్తున్న యానిమేషన్ చిత్రం "సుల్తా ది వారియర్" పై బడింది. రజినీ కాంత్ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తూ తన ఓఛర్ స్టూడియో బ్యానరుపై, యాడ్ ల్యాబ్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
ఈ చిత్రానికి సంబధించిన ట్రైలర్ ను ఇంతక్రితమే "శివాజీ" చిత్ర ప్రారంభంలో తమిళ, తెలుగు భాషల ప్రేక్షకులు చూసే ఉంటారు. అదే ట్రైలర్కు మరిన్ని మెరుగులు చేర్చి తీర్చి దిద్దిన కొత్త ట్రైలర్ ఒక దాన్ని ఇటీవల కేన్స్ చలన చిత్రోత్సవంలో "మిప్కాం" ఈవెంట్ లో ప్రదర్శించారు. భారతీయ యానిమేషన్ రంగాన్ని ప్రపంచానికి దగ్గర చేయడమే తమ అభిమతమని ఈ సందర్భంగా సౌందర్య రజినీకాంత్, యాడ్ ల్యాబ్స్ ప్రతినిధులు సమావేశంలో తెలియజేశారు. అన్ని భారతీయ భాషలతో బాటు, ఇంగ్లీష్, రష్యన్ భాషలలో ఈ చిత్రాన్ని విడుదలచేసే ఆలోచన తమకున్నట్లు వీరు సదస్సులో తెలియజేశారు. విడుదల తేదీని ఇంకా ఖరారు చేయని ఈ చిత్రాన్ని అతి త్వరలోనే విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని వారు తెలిపారు.
No comments:
Post a Comment