Friday, October 12, 2007

తమిళంలో "తులసి"


తెలుగు సినిమాల డబ్బింగ్ మార్కెట్ రేంజ్ మరికొంత పెరిగింది. వరుసగా తెలుగు సినిమాలను తమిళంలోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతున్న విక్టరీ వెంకటేశ్ "తులసి" చిత్రాన్ని తమిళంలోకి డబ్బింగ్ చేస్తున్నారు. తమిళనాడులో యధాతతంగా తెలుగు వర్శన్ ఒకవైపు విడుదలవుతుండగా, ఈ డబ్బింగ్ వర్శన్ ని మరో నెల రోజుల తర్వాత విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సురేశ్ బాబు నిర్మాతగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని "తులసి" పేరుతోనే తమిళంలోకి అనువాదం చేయనున్నారు. ఇందుకు సంబధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిసింది. తెలుగు నిర్మాత అయిన సురర్శ్ బాబు తమిళ హక్కులు ఎవరికీ ఇవ్వకుండా, తనే తన సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానరుపై ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేతున్నారు.

No comments: