Tuesday, October 9, 2007

క్యారంస్ ఛాంపియన్ అయిన సిద్దార్థ


నటుడు సిద్దార్థ క్యారంస్ చాంపియన్ అయ్యాడు. స్వతహాగా క్యారంస్ లో మంచి ప్రవేశం ఉన్న నటుడు సిద్దార్థ "స్ట్రైకర్" అనే చిత్రంలో క్యారంస్ చాంపియన్ గా నటిస్తున్నాడు. దర్శకుడు చందన్ అరోరా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ "స్ట్రైకర్" చిత్రం అతి త్వరలో త్రిభాషా చిత్రంగా రూపొందనుంది. హిందీ, తెలుగు, తమిళ భాషలలో రూపొందనున్న ఈ చిత్రంలో విద్య మల్వదే, టాలీవుడ్ లేటెస్ట్ హాట్ హీరోయిన్ పద్మప్రియలు నటించనున్నారు. ఈ చిత్రంలో సిద్దార్థది మురికి వాడలలో నివసించే ప్రతిభావంతుడైన క్యారంస్ ప్లేయర్ సూర్య కాంత్ పాత్ర. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

No comments: