Tuesday, October 9, 2007

తమిళీకరిస్తున్న నాగార్జున "బాస్"


తెలుగు సినిమాలకు తమిళనాడులో డిమాండ్ పెరుగుతోంది.ఇప్పుడు కొత్తగా నాగార్జున గతంలో నటించిన "బాస్" ను తమిళీకరిస్తున్నారు. అంటే తమిళంలోకి డబ్బింగ్ చేస్తున్నారు. గతంలో నాగార్జున నటించిన "శివ" మొదలుకుని కొన్ని చిత్రాలు తమిళీకరణ పొందినా గత కొంత కాలంగా నాగార్జున చిత్రాలు తమిళనాడులో విడుదల కాలేదనే చెప్పాలి. చాలా కాలం తర్వాత ఇప్పుడు "బాస్" చిత్రం ఈ నెల 19న తమిళనాడులో విడుదల కానుంది. ఇందులో నాగార్జున సరసన నయనతార, శ్రేయలు నటించారు.

No comments: