Tuesday, October 9, 2007

"వ్యభిచారం నేరంపై అరెస్టయిన స్నేహ" వార్తతో ఠారెత్తిన కోలీవుడ్


"తాడే పామై కరుస్తుందనే" నానుడి నటి స్నేహ విషయంలో అక్షరాలా నిజమైదేమోననిపిస్తోంది. తన పేరే తనకు ఇబ్బందులు కలిగించడం చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలీని పరిస్తితి స్నేహది. అసలు విషయం ఏమిటంటే ఇటీవల పలు దిన పత్రికలలో "వ్యభిచారం నేరంపై అరెస్టయిన స్నేహ" అనే వార్త ప్రచురితమైంది. ముందే వదంతులకు చెవికోసుకునే తమిళజనాలు ఆ వార్త చూసి సినీ నటి స్నేహనే అరెస్టయిందని భావించి ఒకరి చెవులు ఒకరు కొరుక్కున్నారు. దాంతో వదంతులు దావానలంలా వ్యాపించి కోలీవుడ్ మొత్తం ఇదే చర్చ. తెలిసినవారు విషయం స్నేహకు చేరవేయగా సంఘటన జరిగినట్లు చెబుతున్న పోలీస్ స్టేషన్ కు స్నేహ తన మేనేజర్ని పంపించి విషయమేంటని అడగగా "రైడ్ లో స్నేహ అరెస్టవడం నిజమేననీ, కాని ఆ స్నేహ హీరోయిన్ స్నేహ కాదని, అదే పేరుతో ఉన్న మరో స్నేహ అని, ఈ వార్త చదివినవారు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇంత అనర్థం జరిగిందని చెప్పడంతో" మేనేజర్ ఊపిరి పీల్చుకున్నా, ఈ విషయం నటి స్నేహను చాలా బాధించినట్లు తెలిసింది. అయినా తనపై వదంతులు రావడం పరిపాటైదని, వీటిని వినడం కూడా తనకు పరిపాటైదని స్నేహ కోలీవుడ్ జనాలతో చెబుతున్నట్లు వినికిడి.

No comments: