Thursday, October 4, 2007

400 థియేటర్లలో "యమదొంగ" హాఫ్ సెంచరీ!!




యమదొంగ సినిమా 400 థియేటర్లలో యాభై రోజులను ఈ రోజుతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా విజయవంతంగా నడుస్తున్నప్పటికీ జిల్లా స్థాయిలో నూతన రికార్డును నెలకొల్పిన గుంటూరు (తొలి సారిగా ఈ జిల్లాలో "యమదొంగ" చిత్రం మొదటి వారంలో ఒక కోటి నలభై లక్షల రూపాయలు కలెక్ట్ చేసి, ఆ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సాధించింది) జిల్లాలోనే ఈ సినిమా అర్థ శతదినోత్సవాన్ని జరపడానికి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్ణయించారు. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈ నెల 14న ఈ ఉత్సవాన్ని జరపనున్నారు. కాగా ఈ స్టేడియంలో చాన్నాళ్ల తరువాత ఒక సినిమా ఫంక్షన్ జరగబోతోంది. ఇంతకుముందు ఘరానా మొగుడు సినిమా ఫంక్షన్ జరిగింది.

No comments: